నీటి బుడగలు - 2

కేలండర్ మీద 2003 జనవరి నెలకి గొళ్ళెం పడింది. అప్పుడు నడుస్తున్నది ఇంకా 2001 అక్టోబరనుకుంటా!అంటే మరో 15 నెలల్లో ఆల్బమ్ రిలీస్ చెయ్యాలన్న ప్రణాళికన్న మాట. ఇప్పుడంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కి గిరాకీ పడిపోయింది గానీ, 2000కి అటూ,ఇటూ హిందీలో ప్రైవేట్ ఆల్బమ్స్ ఓ ఊపు ఊపేవి.
కానీ మన తెలుగులో?!? .... 'త్పృ....ర్.ర్.ర్.ర్.'
ఇంకేం! ఇదే మంచి టైం. ఓ 20 పాట్లుకి(పాటలకి వచ్చిన పాట్లు), ట్యూన్, సాహిత్యం సిధ్ధం చేసుకున్నాక, మాకు మంచి కీబోర్డ్ ప్లేయర్ కావలసివచ్చింది. ఎవడో చెప్తే రామాంతపూర్ దూరదర్శన్ దరిదాపుల్లో కాపేసాం. ఉహూ... దొరకలా... సికింద్రాబాద్లో కిరస్తానీ పాటలు చేసే ఓ రికార్డింగ్ థియేటర్లో మొత్తానికో 'పియొనిస్ట్':) 1000 రూపాయిలిస్తే వస్తానన్నాడు. మా పాకెట్ మనీతో అతగాణ్ణి మేనేజ్ చేసినా ఫలితం దక్కలేదు. :( ఓ రోజంతా కూర్చోబెట్టుకుని, సోదేసుకుని డబ్బులిచ్చిపంపించేసాం.

చూస్తుండగానే 2003 జనవరి నెల గొళ్ళెం పగలగొట్టుకుని వెళ్ళిపోయింది. అంతకన్నా హాశ్చర్యమేంటంటే, అప్పుడు మేం గొళ్ళెం వేసామన్న సంగతి కూడా మరో రెన్నెళ్ళు ఆగితే కానీ గుర్తురాలేదు. అలా అలా ఇతర వ్యాపకాల్లో పడి అసలు విషయం కొట్టుకుపోయినా జగన్ ఇప్పటికీ గుర్తుచేస్తాడు. నిజం! ఈ యేడు కూడా ఫోన్ చేసి అడిగాడు కంప్లీట్ చేద్దామా అని:).... నా సమాధానం మీకు అర్ధం అయ్యుంటదిలెండి...

video

పై పాటకి సాహిత్యం ఓ పట్టాన ఫైనలైజ్ కాలేదు. జగన్ నా చేత 6 వెర్షన్లు రాయించాడు. పాడింది మళ్ళీ మనమే...:) కనుక గుండె దిటవు చేసుకోండి...

8 comments:

భావన said...

బాగుందండీ కొంచం ప్రేమావేశం ఎక్కువ ఐ గట్టి గా నొక్కి వక్కాణించి చెప్పినట్లున్నారు ప్రేమ మహిమ ;-)

బృహఃస్పతి said...

హమ్మయ్య! ఏంటబ్బా... రెండో పాటకి శ్రోతలెవరూ అడ్రస్ లేరూ, మొదటి పాటతో అంత భయపెట్టానా అనుకుంటున్నా. మీరొచ్చారు. అసలు ట్యూన్స్ ఎలా ఉన్నాయంటారు? ఒరిజినాలిటీ వినిపించిందా? లేక పాత ట్యూన్స్ ఏవైనా లీలగా వినిపించాయా? చెప్పండి ప్లీజ్

చైతన్య.ఎస్ said...

బాగుంది :)

బృహఃస్పతి said...

చైతన్య గారూ, టాంకూ అండీ

భావన said...

బృహస్పతి గారు: ట్యూన్స్ బాగున్నాయి మీరు రాసినప్పటికి ఆర్పీ పట్నాయక్ ఐతే పాటలు ట్యూన్ చెయ్యటం లేదు కదా.. నాకు ప్రస్తుతానికి ఐతే ఏమి గుర్తు రావటం లేదు. గుర్తు వస్తే చెపుతాను.. ఆ మొదటి మాట ట్యూన్ ఒక్కటే ఎక్కడో విన్నట్లు వుంది కాని ఎంత ఆలోచించినా గుర్తు రావటం లేదు.. నా వూహేమో మరి. బాగుంది మీరు కొంచం నొక్కి వక్కణించి ప్రేమ మహిమ చెప్పేరు అనిపించింది గొంతు మాత్రం బాగుంది..
ఏదో రెండు రోజులు కుదరక కామెంటక పోతే ఎంత అభాండమేసేరండి మా మీద..
I too hurt :-(

బృహఃస్పతి said...

భావన గారూ టాంకూ అండీ. గుర్తుకువస్తే చెప్పండి. ఆ అభాండాలు మీ మీద కాదండీ బాబూ...

కమల్ said...

పాట, సాహిత్యం బాగున్నాయి, కానీ గొంతే కాస్త నీరసంగా ఉంది, విషాద పాట అయినప్పటికి గొంతులో మరీ నీరసం ఉంది...

బృహఃస్పతి said...

కమల్ గారూ, ధన్యవాదాలు. నేను తెలుస్కోదలచింది కూడా పాట, సాహిత్యం గురించేనండీ... ఎందుకంటే పాటలు పాడటం నాకు చేతకాని విషయం. (నా మీద ఒట్టండీ బాబూ...) ఎవరూ పాడకపోతే నా పాట ఎలా వినిపించేది? అందుకే నేనే పాడి వినిపించేసా :)