చీకటి చూస్తోంది...


గలంతా నిద్రించి
రాత్రయితే చాలు
కళ్ళు తెరుస్తోందీ చీకటి

మేల్కొన్నది
ఊరకనే ఉండక
ఒళ్ళంతా
కళ్ళు చేసుకుని
నన్నే
ఎందుకు గమనిస్తోంది?

తన
నక్షత్రనేత్రాల
రెప్పలను

మిణుకు
మిణుకుమంటూ
వేసి
ఆర్పుతూ
తదేకంగా
నన్నెందుకు పరిశీలిస్తున్నట్లు?

ఎంత
ప్రయత్నించినా,
మిన్ను మనసు
అర్ధం
కాకున్నది.

అందుకనే
...
నంగనాచి నింగి
దొంగ
చూపులకు తట్టుకోలేకనే...
మిన్ను
మేల్కొన్నాక
నిద్రించటం
నేర్చుకున్నా!

నింగి
నిద్రించింది లెమ్మంటూ
సూరీడు
ఢంకా భజాయించి
దండోరా
చాటిస్తే
మేల్కొంటున్నా!

21 comments:

భావన said...

వో అందుకని పొడుకుంటున్నారా మీరు... నిద్రొచ్చి కాదా.. వో.. ;-)
తొంగి చూసే చీకటి ని తరిమి కొట్టే వెన్నెల రాత్రి చందమామ ముచ్చటలు వెన్నెలమ్మ సంతకంతో కొబ్బరాకుల కొనల నుంచి జారుస్తూ వుంటాడు మరీ నిద్దరోకండి వాటిని మిస్ అవుతారు మరి..

బృహఃస్పతి said...

భావనగారూ, నిజమేనండీ...

నల్లని నింగి పాలల్లో
తెల్లని వెన్నెల తేనెను కలిపి
చుక్కల చక్కెర గుళికలు వేస్తే
ఆస్వాదించని హృదయముండునా?


[వామ్మో... మీ కామెంట్ల స్ఫూర్తితో కవిత్వం(?!) పొంగుకొచ్చేస్తోందే నాక్కూడా :) ]

సుభద్ర said...

చాలా బాగు౦ది..ముఖ్య౦ తన నక్షత్రల రెప్పలను మిణుకు మిణుకుమ౦టూ.....
చాలా చాలా బాగు౦ది.అపైన భావనగారికి రాసిన రిప్లై సుపర్...


చీకటి లో అ౦దాలు భావన బాగా చెప్పారు..
వెన్నెలో కొబ్బరాకు కొన అసలు ఏమి అ౦దమొ కదా!
మినుగురు పురుగుల మిలమిల శోభ కి నా దగ్గర మాటలే లేవు మరి.

బృహఃస్పతి said...

సుబధ్ర గారూ, భావన గారి భావుకతనందొదిగిన మీ ఫేవరేట్ కొబ్బరిచెట్టు దగ్గర కాసేపు హాల్టేసారన్న మాట! :) అన్నట్లు
నల్లని నింగి పాలల్లో... పూర్తి చేసేసా దాని కంటిన్యూషన్ వినుకోండి...


నల్లని నింగి పాలల్లో
తెల్లని వెన్నెల తేనెను కలిపి
చుక్కల చక్కెర గుళికలు వేస్తే
ఆస్వాదించని హృదయముండునా?

మబ్బుల మీగడ అడ్డు తగిలినా
మధురత మాత్రం చెక్కు చెదరక
మరుసటి దినం మరిన్ని రుచులతో
మన మనసులనాహ్లాదపరచదా...

అమావాస్య రోజుల్లోనయితే
చందమామ ఇక కంటికానక
కేవలం పచ్చి పాల సేవనం

శీతాకాలం వచ్చిందంటే
చక్కని చుక్కల చక్కెర చాలక
చప్పటి చిక్కటి చీకటి వీక్షణం

తుఫాను కమ్మిన రాత్రయితే మాత్రం
పగిలిన మిన్ను విరిగిన పాలలా
అసలాకాశాన్నే ఆస్వాదించజాలము.


ఈ కవిత, స్ఫూర్తి రగిలించిన భావన గారికే అంకితం...

sunita said...

అబ్బాయీ, కవిత బాగుంది.ఎంతసేపూ కవితలేనా?కధలేమన్నా రాసేదుందా?

బృహఃస్పతి said...

సునీతగారూ, కవితలదేముందండీ... ఓ పావుగంట కూర్చుంటే రాసేయవచ్చు. కధలలా కాదే... :(

అయినా త్వరలోనే మొదలెడతా...

వీరుభొట్ల వెంకట గణేష్ said...

__________________________

దొంగ చూపులకు తట్టుకోలేకనే...
మిన్ను మేల్కొన్నాక
నిద్రించటం నేర్చుకున్నా!
___________________________
Excellent మాస్టారు!!
మొదటి సారి చదివినప్పుడు సరిగ్గా అర్థం కాలేదు. తరువాత మళ్ళీ వచ్చి చదివాను, మాధుర్యం అర్థమయ్యింది.
BTW, మీరు వ్రాసిన code ని అర్థం చేసుకోవాలంటే కూడా ఇంతేనా (:-?
అయినా నాది ట్యూబ్ లైట్ లెండి :)

hanu said...

బృహఃస్పతి చాలా బాగా విశ్లేషించారు,నిజంగా మీ వర్ణణ చాలా బాగుంది

బృహఃస్పతి said...

గణేష్ గారూ, ఏదో మీరభిమానంతో అంటున్నారు గానీ, మీరు మొదటిసారి క్యాషువల్ గా చదివుంటారు. ఆంతేగానీ మరీ అంత అర్ధంకానంత రాసానంటారా? ట్యూబ్లైటు లేటయినా ఎక్కువ వెలుగునిస్తుంది కదండీ.. బల్బు కంటే అదే ఉపయోగకారి. పైగా విద్యుత్ పొదుపు :)

హను గారూ, ధన్యవాదాలండీ!

భావన said...

బాగుంది బృహస్పతి గారు కవిత..
తుఫాను కమ్మిన రాత్రి.... గాలి దుప్పట్టాను ఎగరేసుకుంటు నిశి కన్య నీటి గజ్జెల గల గల లతో, పాయల... వరదపాయల కల కల లను తన మారు రూపం గా ఆకాశమ్మ పంపదూ..!!! చూడలేదా..???

బృహఃస్పతి said...

నిశి కన్య నీటి గజ్జెల గల గలలు

భావన గారూ, మీరు మరో కవిత రగిల్చేలా ఉన్నారు.. :)

అంటే తుఫాను ఎంతైనా చేటు తెచ్చేదే కదండీ... అందుకే విరిగిన పాలతో పోల్చా

కెక్యూబ్ వర్మ said...

మంచి భావుకతతో రాసారు. కొనసాగింపుగా భావనగారికిచ్చిన సమాధాన కవితాపాదాలు బాగున్నాయి. ఎంతైనా భావన గారితో పోటీయా. ఆమె పేరులోనే కవిత్వం.. మరి మీరు బృహస్పతి (గురువుగారు)కాబట్టి పర్వాలేదు. కవితా యుద్ధమే...

బృహఃస్పతి said...

వర్మగారూ, నిజమే భావనగారితో పోటీయా... నేను బృహస్పతినైతే, వారు భీష్మాచార్యులవంటివారు. :) కనుక కురుక్షేత్రంలో తక్కితే చిన్న చిన్న కవితాయుధ్ధాలు చేయరులెండి. భావనగారూ వింటున్నారా??

భావన said...

వు వింటున్నా వింటున్నా.. కొంచం పెద్ద పదమే వుపయోగించారు నా కవితా శక్తి గురించి... నేను దానికి అర్హురాలిని కాదు, కాని ఇచ్చారు కాబట్టి సంతోష పడదాము పోయేది ఏమి వుంది కదా... వర్మ గారు థ్యాంక్స్ అండి చల్లని స్నేహమెప్పుడు సంతోషాన్ని, మంచి మాట ఎప్పుడు చల్లని స్నేహాన్ని ఇస్తుంది అంటారు అది నిజమని అనిపించారు మీ ఇద్దరు మొత్తానికి. :-)

kumar said...

Welcome to Best Blog 2009 Contest


The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.



Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.



Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

Good Luck! Spread the word and enjoy the contest.


plz contact andhralekha@gmail.com

http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

cartheek said...

superb :)

madhavarao.pabbaraju said...

శ్రీ బృఃహస్పతి గారికి, నమస్కారములు.

కవిత బాగుంది. అయితే, ఇందులొ కొంత సందేహం వుంది:
"మిన్ను మేల్కొన్నాక
నిద్రించటం నేర్చుకున్నా! " అని వ్రాశారు. మిన్ను,అంటే, చీకటి-రాత్రి మేల్కొనివుండేది రాత్రిపూటే; నిద్రపోయేది పగటిపూటే. మరి మీరు ఏ సమయంలో నిద్రపోయారు? దీని తరువాత పదంలొ, " నింగి నిద్రించింది లెమ్మంటూ
సూరీడు ఢంకా భజాయించి
దండోరా చాటిస్తే
మేల్కొంటున్నా!" అని వ్రాశారు. అంటే, పగటిపూటన నిద్రలేచారు అనేకదా అర్ధం! అంటే, మీరు నిద్రపోయింది రాత్రిపూటనే కదా!

భవదీయుడు,
మాధవరావు.

బృహఃస్పతి said...

మాధవరావు గారూ, మీ అవగాహన సరియైనదే...

"మిన్ను మేల్కొన్నాక నిద్రించటం నేర్చుకున్నా"

అంటే చీకటి పడ్డాక నిద్రిస్తానని...!

నింగి నిద్రించింది లెమ్మంటూ సూర్యుడు ఢంకా భజాయిస్తే...

అంటే పగటి పూట మిన్ను (రాత్రి) నిద్రించి ఉంటుందని. :)

స్పష్టంగా అర్ధమయ్యేందుకు కొంచం మెలిక పెట్టానన్నది సత్యం :)

నేస్తం said...

ఏంటొనమ్మా మీ అందరికీ ఊ అంటే కవిత ఆ అంటే కవిత ఎలా వచ్చేస్తాయో.. ఇక్కడ కుళింగ్స్ :)

బృహఃస్పతి said...

నేస్తం, డాక్టర్ అవుదామనుకున్నవాడు వెటర్నరీ డాక్టర్ అయితే వాడు జీవితాంతం పడే బాధని ఊహించుకోండీ.... అచ్చం ఇలానే ఫిలాసఫర్(??అంటే??) అయిపోదామనుకుని కవిగా ముద్రేయించుకున్నా...! మీరు బ్లాగర్ల పరిచయ పోస్టులో కూడా నా గురించి ఇలానే చెప్పారు మీ చెల్లితో... :(

రసజ్ఞ said...

మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుందండీ! అక్కడ టపాలో రాసినదానికన్నా ఇక్కడ వ్యాఖ్యలలో రాసినది ఇంకా బాగుంది!