హిందుత్వం - ఆది లేదు. అంతమూ లేదు



హిందుత్వం ఒక వ్యక్తిచే సృష్టింపబడినది కాదు. మానవాళి మనుగడలో భాగంగా ఏర్పడిన నియమాలు, కట్టుబాట్ల నుండి పుట్టినది. కాలాతీతమైన పధ్ధతులను, హిందుత్వం మార్చుకుంటూ/సంస్కరించుకుంటూ ముందుకు సాగిందే తప్ప మానవ నడవడికను ఏనాడూ ఒకే పధాన నిర్దేశించలేదు. అందు చేతనే హిందుత్వానికి ఆది లేదు, అంతంలేదు. ప్రపంచం అంతరించే వరకు అది ఉండి తీరుతుంది.

అన్ని నదులూ కలిసేది సముద్రంలోనే అయితే అన్ని మతాల సారాంశమూ హిందుత్వంలో ఐక్యమయ్యేవే... ప్రపంచంలోని మిగతా మతాలను లోతుగా అధ్యయనం చేసి చూడండి. క్రైస్తవం, ఇస్లాం, జూడిజం, బౌధ్ధం, తావోయిజం ఇలా ఎన్నో ఉన్నాయి. హిందుత్వాన్ని అర్ధం చేసుకునే ముందు, మిగిలిన మతాలను - ముఖ్యంగా భారత దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరించే క్రైస్తవం, ఇస్లామ్ మతాల పుట్టు పూర్వోత్తరాలను సమీక్షిద్దాం.

దేవుని సందేశంగా ముస్లింలు పూజించే పవిత్ర గ్రంధం ఖురానును ప్రపంచం అంతటా క్రైస్తవుల బైబిలు, హిందువుల భగవద్గీత లతో సమానమైన హోదాను కల్పించారు. ఇస్లామ్ మత వ్యవస్థాపకుడు, చివరి ప్రవక్తగా అభివర్ణించే మహ్మద్ జీవిత చరిత్రను ఇప్పుడు సమీక్షిద్దాం.

ప్రవక్త అంటే భగవంతుని సందేశాన్ని ప్రజలందరికీ చాటిచెప్పి, భగవంతుని ఆజ్ఞగా ఆచరించమని చెప్పేవాడు.

యోగి అంటే అత్మానుభూతిని పొందేవాడు.

హిందుత్వం మానవులలో యోగికి అత్యున్నత స్థానం కల్పిస్తే - క్రైస్తవం, ఇస్లాం మతాలు ప్రవక్తకు దేవుని తరవాత స్థానాన్ని కల్పించాయి.

హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానందుడు, తాను రచించిన 'రాజయోగం' లో ఈ విధంగా పేర్కొన్నాడు.

"చాలా సందర్భాల్లో యోగి జ్ఞాన పిపాస తీవ్ర రూపం దాల్చినప్పుడు ఓ విధమైన మాయావస్థ అతనిని కమ్ముతుంది. ఇది జ్ఞానానికి బదులు అతడిని చీకటిలోనికి తోసేసేందుకు ఆస్కారం ఉంది. మహ్మద్ సరియైన శిక్షణలేని కారణాన ఈ రకమైన ఆధ్యాత్మికతలో ఊగిసలాడిన వ్యక్తి.

తాను సమాధి అవస్థ ఉండగా, ఒకనాడు భగవంతుడు తన గుహలోనికి వచ్చాడని, హరక్ అను గుర్రం మీద స్వర్గానికి తోడ్కొని పోయెనని మహ్మద్ చెప్పుకున్నాడు. ఈ విధంగా మహ్మద్ ప్రవక్త ప్రవచించిన కొన్ని అద్భుత సూక్తులూ, సత్యాలూ అతిశయాలతో నిండిఉన్నాయి.

ప్రవక్త ఆధ్యాత్మికంగా ప్రభావితం అయ్యాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ అతిశయాలకు సరియైన వివరణ లేదు. ప్రవక్త శిక్షణలేని యోగి కావటం చేత ఏ విధమైన వివరణలూ లేక, తానేమి చేసెనో తెలుసుకోలేని సంకట స్థితిని అనుభవించినాడు. ప్రవక్త ప్రపంచానికి చేసిన మంచి ఏమిటో ఓ సారి ఆలోచించండి. ప్రవక్త ప్రభోధనల వల్ల లోకానికి జరిగిన కీడుని పరికించండి. 18 వ శకం వరకూ ఇస్లాం మత మార్పిడుల హింసలో లక్షలాది మంది తల్లులు తమ పిల్లల్ని కోల్పోయారు. మరెందరో పిల్లలు అనాధలు అయ్యారు. దేశాలకు, దేశాలే సమూలంగా నిర్మూలింపబడి స్మశానాలయ్యాయి.
"

తీవ్రవాదం రూపంలో ఈ హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విధమైన అయోమయ స్థితిలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళించిన ఎందరో యోగులు, తాము భగవంతునితో మాట్లాడామని, భగవంతుడు తమకు మతాన్ని ఉపదేశించి ప్రపంచాన్ని ఆ మతంలో నడిపించమన్నాడని చెప్పుకున్నారు. (క్రైస్తవం కూడా ఈ కోవలోనిదే).

ఎవరు అంగీకరించినా లేకున్నా, వివేకానందుడు పై విమర్శలను వాస్తవిక ధృక్పధంతో ఆధ్యాత్మికతను విశ్లేషించి చేసాడన్నది సత్యం.

హిందుత్వం ప్రకారం ఆధ్యాత్మికత, జ్ఞాన సముపార్జన అన్నవి ఎవరైనా పొందగలిగేటివి. వీటికి అంతం అంటూ, అవి పొందిన చివరి వ్యక్తి అంటూ ఉండరు. చిట్ట చివరి చిత్రకారుడూ, చిట్ట చివరి కవి అంటూ ఎవరూ లేనట్టే చిట్టచివరి యోగి అంటూ ఎవరూ ఉండరు. అయితే ఇస్లాం ఇందుకు విరుధ్ధంగా మహ్మద్ ను చిట్ట చివరి ప్రవక్తగా పేర్కొంది.

(దురదృష్ట వశాత్తూ ఈ విధమైన చిట్ట చివరి పోకడలను అప్పుడప్పుడూ హిందుత్వానికీ అంటిస్తున్నారు. ఉదాహరణకు, జిడ్డు కృష్ణ మూర్తి చిట్ట చివరి తత్వవేత్త అంటూ... ఈ చిట్ట చివరి పోకడలు హిందుత్వానికి విరుధ్ధం. ఒక వ్యక్తి మీదునున్న అభిమానంతో, వారితర్వాత వారిని మించిన వ్యక్తి పుట్టబోడని చెప్పటం అవివేకమే అవుతుంది. అదే నిజమైతే రేడియో తర్వాత టెలివిజన్, ఇప్పుడీ ఇంటర్నెట్ లు వచ్చేవి కాదుకదా!)

మహ్మద్ జీవిత చరిత్ర:

మహ్మద్ 40 ఏండ్ల వరకూ సాధారణ జీవితాన్ని గడిపినాడు. ఈయన తరచూ సమాధి అవస్థ (ట్రాన్స్)పొందుతూ భగవంతునితో ముఖాముఖీ మాట్లాడానని ప్రకటించుకునేవాడు. భగవంతుని ఆజ్ఞ మేరకే తనని తాను చిట్ట చివరి ప్రవక్తగా అభివర్ణించుకున్నానని చెప్పి ఉన్నాడు. మహ్మద్ తనని తాను ప్రవక్తగా, దేవుని సేవకుడిగా చెప్పుకున్నాడు. మరణావస్థలో సైతం తన చావుని స్వర్గానికి ప్రయాణంగా అభివర్ణించినాడు తప్పితే భగవంతునిలో ఐక్యత గూర్చి మాట్లాడలేదు. హిందువు నమ్మే ఆత్మ సిధ్ధాంతాన్ని (అహం బ్రహ్మస్మి) ఇస్లాం గానీ, మహ్మద్ గానీ ఒప్పుకోజాలరు.

ఖురాను ప్రకారం ఏ వ్యక్తీ తనని తాను భగవంతునిగా భావించరాదు. తొమ్మిదవ శతకంలో తనని తాను భగవంతునిగా అభివర్ణించుకున్న సుఫీ ఆల్ అఫీజ్ ముక్కలు ముక్కలుగా నరకబడి నదిలో విసిరివేయబడ్డాడు. మహ్మద్ ప్రవక్త అంతటివాడే తనని తాను భగవంతుని సేవకునిగా భావించినప్పుడు ఇతరులు భగవదానుభూతిని పొందటం ఇస్లాం ప్రకారం అసంభవం.

మహ్మద్ ప్రవచనాల్లో అద్భుత అనుభవాలూ, భగవంతునితో సంభాషించటాలూ, ఆయన అనుగ్రహించిన శక్తిపాటవాలూ తప్పితే ఆత్మను గూర్చి గానీ, ఆత్మానుభూతిని గూర్చిగానీ , కర్మ సిధ్ధాంతాలను గూర్చిగానీ ప్రస్తావనలు లేవు.

మహ్మద్ భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రభువు స్థానంలో, మానవుణ్ణి సేవకుడి స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ ద్వంద్వాన్ని ప్రభోదించటం ద్వారా మానవుణ్ణీ, భగవంతుడ్నీ వేరుగానే ఉంచాడు. మహ్మద్ వర్ణించే భగవంతునికి భావోద్వేగాలున్నాయి. కోపం ఉంది. తనను నమ్మిన వారికి స్వర్గాన్ని, మిగిలిన వారికై నరకాన్ని భగవంతుడు సృష్టించినట్లు మహ్మద్ చెప్పియున్నాడు. వేదాల్లో చెప్పబడ్డ బ్రహ్మ సిధ్ధాంతం, బౌధ్ధంలో ఆచరించే ధర్మకాయం ఇస్లాంకు విరుధ్ధం. పై రెండు సిధ్ధాంతాలూ మనిషిని, భగవంతుడిని వేరుగా కాక కలిపి ఉంచెడివి.

ఈ వైరుధ్యాన్ని క్రైస్తవంలో కూడా గమనించవచ్చు. నిజానికి ఇస్లాం, బైబిలు అడుగుజాడల్లో నడచిందనడానికి ఆధారాలున్నాయి. ఆధ్యాత్మిక పరంగా బైబిలూ, ఖురానులలో సారూప్యతలు సుస్పష్టం.(ఈ సారూప్యాలను ముందు ముందు విపులంగా తెలుసుకుందాం).

ఈ రెండు మతాలూ భగవంతునిలో ఐక్యతను విభేదిస్తాయి.

మహ్మద్ అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. శుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు. మధువును త్యజించినాడు. పేదలనూ, బానిసలనూ, నల్ల జాతీయులను సైతం చేరదీసి వారికి ప్రేమను పంచినాడు. తన అనుచరులందరినీ కుటుంబ సభ్యులవలే భావించి సోదర ప్రేమను పంచినాడు. వర్ణ విచక్షణ లేకుండా అందరినీ సమానంగా ఆదరించినాడు. తన కోసమై ఏనాడూ సంపదలను ఆర్జించ యత్నించలేదు. తిరిగి తన సంపదలను సైతం పరుల కొఱకు త్యజించినాడు. మసీదుల కొరకు ఖరీదయిన కట్టడాలను కాక, వీలయినంత సామాన్యమైన, లేదా మైదానాలను ఉపయోగించాడు. భగవంతునికీ మానవునికీ మధ్య ఏ విధమైన మధ్యవర్తినీ (పూజారులు అనుకోవచ్చు)ఉంచకుండా ముఖాముఖి అనుబంధాన్ని ఏర్పరిచాడు.

అయితే తాను నమ్మిన ఇస్లాంను ప్రభోదించే మహ్మద్ జీవితంలో రెండు విషయాలకు సరియైన వివరణ లభించదు.

1. వ్యక్తిగతం: మహ్మద్ తన 25 వ ఏట 40 ఏండ్ల ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెతో పాతికేండ్లు గృహస్థు ధర్మాన్ని ఆచరించినాక - ఆమె మరణానంతరం 8 మంది అందమైన, యుక్తవయస్కులైన కన్యలను పెండ్లాడినాడు. అప్పటికి మహ్మద్ వయస్సు 50 ఏండ్లు పైబడినది. తన స్నేహితుడైన అబు బక్ర్ కుమార్తె ఐషా ను ఆమె 6వ ఏట పెండ్లాడినాడు. తన దత్త పుత్రుడైన జైద్ చే అతని భార్య జైనాద్ కు విడాకులు ఇప్పించి, ఆమెను పెండ్లాడినాడు. (ఈ వివాహం అనంతరం జైద్ వారసత్వం రద్దు చేయబడింది). ఇస్లాం వివాహేతర మరియూ వివాహానికి మునుపు స్త్రీ పురుషులు నెరపే సంబంధాలను విభేదించినప్పటికినీ, బహుభార్యత్వాన్ని సమర్ధించింది.

సంతాన వ్యాప్తిని దేవుడు ఆజ్ఞాపించిన విధిగా భావించింది. ఇలా సంసార భాద్యతలకు పెద్ద పీట వేయటం ద్వారా, జ్ఞానార్జనకోసమై సర్వం త్యజించే సన్యాసులూ, యోగులూ, బుధ్ధులకు ఇస్లాం సముచిత విలువను ఆపాదించలేకపోయింది.

2. పధానిర్దేశం: సుఫీల ప్రకారం పవిత్ర యుధ్ధం రెండు రకాలు. ఒకటి బాహ్యం, రెండు అంతర్గికం. అంతర్గిక యుధ్ధం శాంతి యుతమైనది. అయితే మహ్మద్ బాహ్య యుధ్ధానికి కూడా ప్రాధాన్యతనిచ్చినట్లు రుజువులున్నాయి. మహ్మద్ 8 కి పైగా యుధ్ధాలు చేసి యున్నాడు. పలుమార్లు గాయపడ్డాడు కూడా. 'బను క్వారైజ' అను తెగకు చెందిన ఏడు వందల మంది యూదులు యుధ్ధ ఖైదీలుగా లొంగిపోయినపుడు - వారిని మహ్మద్, అతని అనుచరులూ ఊచకోత కోసారు. ఒక్కోసారి, తన అనుచరగణంలోని వారిని సైతం సంహరించిన చరిత్ర ఉంది.

షియా తెగకు చెందిన ముస్లింల కధనం ప్రకారం, ఈ హింసాకాండకు కారణం అబు బక్ర్ (కలీఫ్ తెగకు చెందినవాడు. దీనినే సున్నీ అని కూడా పిలుస్తారు.) ఇస్లాం మత సిధ్ధాంతాలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కారణంగా, ఇస్లాం సంరక్షణలో భాగంగా మహ్మద్, అబూ బక్ర్ ని తుద ముట్టించాల్సి వచ్చినట్లు వీరు చెబుతారు. తదనంతర పరిణామాల్లో, మహ్మద్ అల్లుడైన అలీ నేతృత్వానికీ, కలీఫ్ తెగకూ వైరం మరింత ముదిరి - అలీ, అతని కుమారులను, మనుమళ్ళనూ సున్నీ తెగ సంహరించిందని కూడా చరిత్రలో ఉంది. ఇక్కడితోనే మహ్మద్ వంశం అంతరించినది. షియా మరియు సుఫీ తెగల వారు అలీని మహ్మద్ యొక్క నిజమైన వారసునిగా భావించేవారు.

కలీఫ్ (సున్నీ) తెగవారు భగవంతునితో ముఖాముఖి అనుబంధాన్ని అంగీకరించలేదు. వీరు వాస్తవికంగా తాము అనుభవించినదానికే కట్టుబడి, మహ్మద్ తనకు తాను చెప్పుకున్న భగవంతునితో సంభాషణలను ఒప్పుకోలేదు. వీరు కూడా మహ్మద్ ఒకప్పటి అనుచరులే. ఈ తెగకు చెందిన అబూ బక్ర్, ఒమర్ల కుమార్తెలను మహ్మద్ పెండ్లాడినాడు. మహ్మద్ తన ఇరువురి కుమార్తెలను మరో కలీఫ్ నాయకుడైన ఓత్మాను కు ఇచ్చి వివాహం జరిపించాడు.

ఆస్మా అను మక్కాకు చెందిన కవయిత్రి, మహ్మద్ ను దూషించిన కారణంగా, మహ్మద్ అనుచరుడైన ఆమీర్ చేతిలో ప్రాణాలను కోల్పోయింది. తన శత్రువుల పండ్ల(ఖర్జూర) తోటలను సైతం మహ్మద్, అతని అనుచరులు తగలబెట్టినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ విధమైన సంక్లిష్ట ప్రశ్నలకు, సంఘటనలకు చరిత్రలో ఎక్కడా సరి అయిన వివరణ లభించలేదు.

10 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

బాగా చెప్తున్నారు మాస్టారూ...,
Keep up the good work..!!

మనోహర్ చెనికల said...

Good work.

Vani said...

what is differeces between sunny and shia in their ideology? I know there is differences in way they pray

బృహఃస్పతి said...

మహ్మద్ తో విభేదించిన ఒక ముస్లిమ్ వర్గాన్ని 'సున్నీ' అంటారు. 'షియా' వర్గం వారు మహ్మద్ తో ఏకీభవించినవారు. మహ్మద్ తాను చెప్పుకునే భగవంతునితో ముఖా ముఖీ సంభాషణలను 'షియా' విశ్వసిస్తే, 'సున్నీ వర్గం వారు విభేదించారు. తదుపరి కాలంలో ఈ విభేదాలు తీవ్రం అయ్యి మారణకాండకు దారి తీసింది.

టింగు రంగడు said...

మీ హిందుత్వ నిర్వచనం బాగుంది.
మీరు ఇంకా రాయాలి..

rākeśvara said...

ధార్మిక మతాలకూ టొటాలిటేరియన్ మతాలకూ గల ముఖ్య బేధాన్ని (యోగి వ. ప్రవక్త) బాగా వివరించారు.

మీరు టపా మొదట్లో ఇచ్చిన డిస్కలైమరును ప్రతి టపాకు ఇవ్వనక్కరలేకుండా, సైడు బారులో నిక్షిప్తం చేసుకోవచ్చు.

వేఱే మతాలు గుఱించి విశ్లేషణ, వాటి చరిత్రలు కంటే అచ్చమైన ఆధ్యాత్మిక విశేషాల గుఱించి ఎక్కువ వ్రాస్తారన ఆశిస్తున్నాను.

బృహఃస్పతి said...

రాకేశ్వరరరావు గారూ,
1. declaimerను sidebarలో పెట్టాను. ఈ సూచన బాగుంది.
2. వేరే మతాల గురించి ఇంత సుధీర్ఘ వివరణ, విషయాలను కూలంకుషంగా చర్చిద్దామన్న కుతూహలంతో, అత్యుత్సాహంలో చేసింది. ఇది నేను కూడా గ్రహించాను. ఇకపై trackలోకి వస్తాను.
3. ఆధ్యాత్మిక విషయాలను నా నుండి ఆశిస్తే మీరు నిరాశ చెందే ఆస్కారం ఉంది. నేను వీలయినంత వరకూ చారిత్రాత్మక వివరణలకే తొలి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్నాను. బహుశా చారిత్రిక విషయాలు నిండుకున్న రోజున ఆధ్యాత్మిక విశేషాలు మొదలు పెడతాను.

వెంకటేశ్వర రాజు said...

హిందుత్వం మీద మీ అబ్బిప్రాయాలతో నేను యెకీబవిస్తాను. కాని మీరు హిందుత్వాన్ని సరిగ్గా పాటిస్తునట్టు లేరు. లేకుంటే ముస్లిం మతం మీద అంత దీర్ఘంగా విమర్శిస్తూ వ్యాసం రాయరు. ఎవరి మతం వాళ్లకు గొప్ప . మీరు హిందుత్వం గురించి ఎక్కువగా రాస్తే బాగుంటింది అని నా అబిప్రాయం ఉదాహరణకి హిందుత్వం గొప్పతనాన్ని హుందువులు కాని వారు గొప్పగా చెప్పి ఉంటే వాటిని మీరు ఉదహరిస్తే బాగుంటుంది.

hateweb said...

లోపాలు అన్ని మతాల్లోను ఉన్నాయి. అలాగే మంచి విషయాలు కూడా అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ముస్లిముల్లో కూడా గొప్ప గొప్ప మహనీయులూ, అవధూతలూ ఉన్నారు. మనం ధాన్యాన్ని మాత్రమే తీసుకుని, పొట్టుని ఊదెయ్యాలి. సరిగా అర్థం చేసుకొని ఆచరిస్తే ఏ మతమైనా ఒకటే. అర్థం కానప్పుడు ఒక మతానికి చెందుతామని చెప్పుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనమేదీ లేదు. నా ఉద్దేశంలో ఏ మతపు గొప్పతనమైనా ఆ మతంలో పుట్టి పెరిగితే తప్ప అర్థం కాదు. Bare facts మనల్ని తప్పుదోవ పట్టిస్తాయనుకుంటా.

బృహఃస్పతి said...

యువరాజు గారు,

1. నేను పరమత చరిత్ర చెప్పటానికి ప్రయత్నించాను తప్ప పరమత విమర్శను చేయ దలచుకోలేదు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున విమర్శ వ్యక్తమైనట్లైతే, ఆ వాక్యాలు చెప్పండి. ఉపసంహరించుకుంటాను.

2. పై కామెంట్లో నేను ఒప్పుకున్నట్లు ఇకపై వీలైనంత పరమత సమీక్ష తగ్గిస్తాను.

3. 'హిందుత్వం మీరు సరిగ్గా పాటిస్తున్నట్లు లేదు.' ఈ కామెంట్ ఇక్కడ అసంబధ్ధం. నా రచనలపై సమీక్షను స్వాగతిస్తాను. వ్యక్తిగతాలు ఇక్కడ అప్రస్తుతమని నా అభిప్రాయం.

hateweb,
నేను మతాల్లోని లోపాలనో, మనుషులలోని లోపాలనో ఎత్తి చూపటానికి ప్రయత్నించలేదు. మత అంకురార్పణ ఎలా జరిగిందనేది చర్చించ యత్నించాను. మూలాలు ఏ ఉద్దేశ్యాలతో పుట్టాయన్నది చెప్పటమే నా ముఖ్యోద్దేశం. కాల పరిణామ క్రమంలో ఆయా మతాల్లో మహాత్ములు ఉన్నారా లేదా అన్నది నేను ప్రస్తుతానికి విశ్లేషించలేదు.