కోర్కెల కావడికోర్కెల కావడి
బరువెక్కుతోంది
మోయలేకున్నాను.

ఫలించని కలల సమూహంతో
కావడి నిండి,
ఒక్కొక్క కలా ఒలుకుతుంటే -
గుండె చివుక్కుమంటోంది

ఆ ఒలికిన కలలపై
ఆశ వదలటం తప్ప,
సఫలం చేసే వీలే లేదా?

పోనీ కొన్నింటిని త్యజిద్దామంటే,
"అమ్మో!" ఎన్నెన్ని కలలు కన్నానూ...?
నా కలలు ఫలించాలని,

ఒకటో అరో ఫలించి -
జన్మ సార్ధకం చేసుకున్నట్లు
మాయమవుతున్నా,

అదేదో సామెతలా,
మరిన్ని ఆశలు ఆవిర్భవించి -
ఆ భారాన్ని నాపై ఆపాదించి -
నా గమ్య సాధనలో జాప్యాన్ని కలిగిస్తున్నాయి.

ఈ కాంక్ష్యల బరువునకు
కృంగక ముందే -
కోర్కెల భారంలో
కూరుకొనక ముందే -
బయటపడాలి

ఎలా....?
సలహాఇవ్వవూ??**************


దాదాపు పదిరోజుల తర్వాత ఇదే వికాసంలోనికి తొంగిచూడటం. :) ఈ విరామానికి కారణం ఉంది. గతవారం 29వ తేదీన 'బృహస్సతి' మగబిడ్డకి జన్మనిచ్చి నన్ను తండ్రిని చేసింది. ఆ హడావుడిలో పడీ, ఈ ఆలస్యం. :)25 comments:

sunita said...

Congrats Rajesh.

చిలమకూరు విజయమోహన్ said...

కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మీ ఇంట శివకేశవుడు ఉదయించాడన్న మాట,అభినందనలు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

చాలా బాగుంది !!

Sravya Vattikuti said...

మీకు శుభాభినందనలు !

బృహఃస్పతి said...

అందరికీ ధన్యవాదములు.

srujana said...

మీకు అభినందనలు.

భావన said...

శుభాబినందనలు మీ కుటుంబం మొత్తానికి. మరి మాకెప్పుడు చూపిస్తున్నారు మీ అబ్బాయిని. ఎదురు చూస్తుంటాము.
కవిత బాగుంది. అదే కదా జీవితం తీరిన ఆశలతో తేలికవుతున్న కవిడి ని ఎడతెగని మోజులతో నింపుకుంటు బాగా చెప్పేరు..

చైతన్య.ఎస్ said...

శుభాబినందనలు

బృహఃస్పతి said...

సృజనగారూ, చైతన్యగారు, ధన్యవాదాలు.

భావనగారూ, ఇప్పుడే upload చేసా. మీ కోసమే :) పుట్టిన మూడో రోజు తీసినదిది.

మొత్తానికి "సలహా ఇవ్వవూ?" అని అంతలేసి అక్షరాలు ఎర్రగా రాస్తే ఒక్కరు కూడా ఇచ్చారు కాదు చూసారూ?? :)

భావన said...

బాగున్నాడు మీ అబ్బాయి. పాపం వాడి బుజ్జి మొహం మీద ఎంత లైటు వేసేరో తెల్ల బోయి చూస్తున్నాడు.పచ్చ చొక్కా వేసి పూల రంగడల్లే తయారు చేసేసేరు అప్పుడే.. ;-) దిష్టి తీసేసుకోండి ముద్దు గా వున్నాడు. ఏమి పేరు పెట్టేరు.
సల హా కావాలా? సమస్య అర్ధమయ్యి దానికి మూల కారణం తెలిసి ,పరిష్కారమేమిటో తెలియదంటే ఏమి చెప్పగలం చెప్పండి ఎవరమైనా..

బృహఃస్పతి said...

పేరు... ఇదొక సంకట స్థితి అండీ... 'స్' తో రావాలని నిశ్చయమైంది. వాడి నాన్నమ్మ 'ఏం పేరు పెట్టినా సరే నేను సాయి అని పిలుస్తా'నంటుంది. తాత సతీష్ అని కోరుకుంటున్నారు (మా నాన్నమ్మ పేరు సత్యవతి, తాత పేరు సత్యనారాయణ కనుక). వాడి అమ్మమ్మ సమర్థ బావుంటుందంటున్నారు (ఎందుకో మరి?? - ఏదో కీర్తనలో విన్నారంట, నచ్చిందంట) నేను సిధ్ధార్ధ కానీ సుభాష్ అని గానీ అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మనమనుకున్నదే కానిచ్చేస్తామనుకోండీ... అయితే మిగిలిన వారిని నిరాశ పరచకుండా సాయి సత్య సిధ్ధార్థ అని పెట్టేస్తా...

నాన్నమ్మ హేపీ (సాయి), తాత హేపీ (సత్య), నేను ఫుల్ హేపీ (సిధ్ధార్ధ) వాడి అమ్మమ్మ సగం హేపీ (సమర్ధ - అర్ధ సిధ్ధార్ధలో కూడా ఉంది కదా):)

sunita said...

బాబు బాగున్నాడు . పేరు బాగుంది ఇంతకీ బౄహస్పతి ఎవరిపేరు?

బృహఃస్పతి said...

సునీత గారూ, నా కామెడీ వికటించిందనుకుంటానండీ... నే రాసినది బృహస్సతి (సతి). బృహస్పతిని నేనే. నా భార్య కనుక బృహస్సతి అని సంబోధించా...
Browser లలో మన తెలుగుఫాంట్లకొచ్చిన ఖర్మ ఇది 'స్' 'ప' ఒకేలా కనిపిస్తున్నాయి :(

Sravya Vattikuti said...

Cute baby boy:)

మురళి said...

మీకు అభినందనలు.. బుడుగు కి ఆశీస్సులు...

బృహఃస్పతి said...

శ్రావ్యగారూ, మురళీ గారూ, ధన్యవాదాలండీ.

RK said...

Jr. Rajesh, welcome to this world. It is not so rosy, but that doesn't matter, you'll have great fun. Enjoy!!

With blessings and Love
RK

RK said...

సిధ్ధార్ధ కే నా ఓటు :)

బృహఃస్పతి said...

RK గారూ, టాంకూ అండీ...

నా ఓటు కూడా సిధ్ధార్ధకే. ఎటొచ్చీ నా ఓటుని గెలిపించుకోవాలింకా... :)

కొత్త పాళీ said...

బృహస్సతి, హ హ హ. బాగుంది. బాబు బాగున్నాడు. శుభాకాంక్షలు.

బృహఃస్పతి said...

కొత్తపాళీ గారూ, ధన్యవాదాలు.

భావన said...

సిధ్ధార్ధ కే నా ఓటు కూడా

బృహఃస్పతి said...

మరింకేం... సిధ్ధార్ధ కి గొళ్ళెం పెట్టేస్తున్నా... :)

madhavarao.pabbaraju said...

బృహఃస్పతి గారికి, నమస్కారములు.

ముందుగా, తండ్రి అయిన సంధర్భంలొ, మీకు నా శుభాభినందనలు. మీ కోర్కెల కావడి బాగుందీ, ఆ కావడిలో కనిపిస్తున్న మీ కోర్కె అనే మీ పుత్రుడు కనిపిస్తున్నాడు. ప్రతి స్త్రీ, తన జీవితంలొ, తల్లిగావాలని కోరుకుంటుందని అంటారు. ఈ కోరిక ( తండ్రి కావాలని ) ప్రతి పురుషుడుకి కూడా వుంటుందని నా భావన.

భవదీయుడు,
మాధవరావు.

బృహఃస్పతి said...

మాధవరావు గారూ, ధన్యవాదాలు.