హిందుత్వం... మతం కాదు. ఒక జీవన విధానం!
చాలా కాలంగా కొన్ని బ్లాగుల్లో 'హిందుత్వ' మెక్కువేంటి? మిగిలిన మతాల తక్కువేంటి? అనే స్ధాయిలో ప్రారంభమయ్యి - మతమౌఢ్యమంటూ 'హిందూ తీవ్రవాదా'న్ని భూతద్దంలో చూపిస్తున్న రచనలను చూసి మధనపడి ఈ బ్లాగునకు శ్రీకారం చుట్టాను.
హిందుత్వ మీద ఇదివరకే కొన్ని బ్లాగులు ఉండవచ్చును గాక! కానీ అవి మత పరమైనవి, అధ్యాత్మిక పరమైనవీనూ! చారిత్రాత్మకంగా హిందుత్వాన్ని విశ్లేషించే బ్లాగు లేనందున, అట్టి బ్లాగు అవసరం ఎంతయినా ఉందనిపించింది.
భావితరాలు పుస్తకాలను మరచి - Ebooksకి, internetలకు అలవాటయిన రోజు, వారికి మొదట పేర్కొన్న రచనలే లభ్యమౌతాయి. అదీగాక ఆ రచయితలు తమ భావాలను వ్యక్తీకరించటంలో ఉధ్ధండులగుటచే, రాబోయే తరాలకు వారి ఉద్దేశ్యాలు ఆదర్శమయ్యే ప్రమాదం ఉంది.
హిందుత్వ మూలాలు తెలియకపోవటం వల్లనో, లేక వాటితో విభేదించటం చేతనో, ఈ రచయితలు చేసే ప్రచారం బలం పుంజుకోక మునుపే చికిత్సా చర్యలు చేపట్టటం మంచిదనిపించింది. లేదంటే పోనుపోనూ హిందుత్వ మూలాలను మన భారతీయులే మరచి ఎంతో practicalగా హిందుత్వాన్ని మత మౌఢ్యంగా అభివర్ణించే అవకాశం ఉంది.
వీటన్నిటికీ సమాధానంగా హిందుత్వ చరిత్రను ఇక్కడ ప్రతీ వారాంతాల్లో సమీక్షించుకుందాం!
సిధ్ధంకండి...
--- బృహఃస్పతి
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
Welcome sir :-)
స్వాగతం బృహస్పతి గారు... మీ నుంచి మంచి టపా కోసం ఎదురు చూస్తూంటాము..
susvaagatam
హిందుత్వం జీవన విధానానికి ఒక మార్గాన్ని నిర్వచిస్తుంది.దానికి మతమనే రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్నారు, ఈ సూడో సెక్యులరిస్టులు.
ఈ పరిస్థితులలో మీ బ్లాగు అలోచన అభిలాషనీయం
Welcome. GoodLuck.
Very Good Initiative,it is essential to all of us to understand Hindutva in Real way.
Then we can understand the evil thinking of most of the westren,some of the Indian exploitative groups.
Venu
మంచి ఉద్దేశ్యం తో ప్రారంబించిన మీ బ్లాగ్ విజయవంతం కావాలని కోరుకుంటూ ...
మీ బ్లాగ్ నుండి ఎంతో నేర్చుకోవాలని అశిస్తూ.........
మీ బ్లాగు నాకు చాలా బాగా నచ్చింది.మీరు చెప్తున్నటువంటి విషయాలతో ఎవరైనా బ్లాగు ప్రారంభిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉండేవాణ్ణి.ఇప్పటికి ఆ కోరిక తీరింది. నేను కూడా వా బ్లాగుల ద్వారా రామాయణ ,భారత, భాగవతాలలోని మరియు అన్నమయ్య పదసాహిత్యం వగైరాలను అందరికీ పరిచయం చేయాలనే ఉత్సాహంతో ఓ సంవత్సరం నుంచీ నాకు సాధ్యమయినంతలో ప్రయత్నిస్తున్నాను.వీలైతే ఈ క్రింది బ్లాగులనోకసారి చూసి మీ అభిప్రాయం తెలియజేయగలరు.
http://sreemadaandhramahaabharatam.blogspot.com/
http://kasstuuritilakam.blogspot.com/
http://kastuuritilakam.blogspot.com/
http://sooktimuktaavali.blogspot.com/
http://mutyalasaraalu.blogspot.com/
బృహస్పతి గారికి, నమస్కారములు.
"హిందుత్వం" పై మీ రచనలను చదువుతున్నాను. బాగున్నాయి. అయితే, ప్రాధమిక దశలోనే, నేను కొన్ని ప్రశ్నలను అడుగుతున్నాను.
"హిందుత్వం" ఒక వ్యక్తిచే ... ...అంతరించేవరకు అది వుండి తీరుతుంది " --అని వ్రాసారు. చాలా చక్కగా నిర్వచించారు."హిందుత్వాన్ని" అర్ధం చేసుకునేముందు, మిగిలిన మతాలను గురించి సమీక్షిద్దాం" --అని వ్రాసారు. అలాగే, "హిందుత్వం మతంకాదు, ఒక జీవనవిధానం"-- ఈ శీర్షికలో, రెండవ పేరాలో, " చారిత్రాత్మకంగా హిందూమతాన్ని విశ్లేషించే బ్లాగు లేనందున..." అని వ్రాసారు.
నా సూటి ప్రశ్న ఏమిటంటే, "హిందుత్వం", కూడా, ఇతర మతాల్లాగే ఒక మతమని మీ అభిప్రాయమా? హిందుత్వం మతంకాదు అని వ్రాస్తూ, "హిందూమతాన్ని" విశ్లేషించే బ్లాగు లేనందున ఈ నా బ్లాగు మొదలుపెట్టాను అంటున్నారు. వివరణ ఇవ్వగలరు.
భవదీయుడు,
పబ్బరాజు మాధవ రావు.
మాధవరావు గారు,
మీ అభిమానానికి కృతజ్ఞుడను. హిందుత్వం మతం కాదనే మాటకే కట్టుబడి ఉంటాను. అలవాట్లో పొరపాటుగా లేదా అందరికీ అర్ధమైనట్లు రాయాలనే దుగ్ధలో హిందూమతమని రాసాను. ఇప్పుడు సరిదిద్దుకున్నాను. తెలియజేసినందుకు ధన్యవాదములు
హైందవ ధర్మానికీ హిందూమతానికీ కూసింత(అప్పుడప్పుడూ బోలెడంత) తేడా ఉందని విన్నాను. ఆ విషయంలో కొంచెం ఎడ్యుకేట్ చేస్తారా!
మహేష్ గారూ, భారతదేశంలో మిగిలిన మతాలు ప్రవేశించనంత వరకు అసలు హిందూ మతం అన్న నానుడి కూడా లేదండి. మిగిలిన మతాల ఉప్పెనలో హిందుత్వ మూలాలు కోల్పోకుండా(మత మార్పిడులు, ఇత్యాది హింసలలో భాగంగా) ఉండేటందుకు సంఘటితమైన భారతీయులందరికీ హిందూమతం అన్న ఒక ట్యాగ్ తగిలించేసారు. ఈ రకమైన 'హిందూ మతం' అన్న వాదనకు మార్కిష్టులు కూడా తమ వంతు సాయం ఎలా చేసారో ఈ వారం వివరిస్తాను. శనివారం మర్చిపోకుండా చదవండి :)
Very truthful to say these words
Post a Comment