జైహింద్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నే ప్రచురించ దలచిన ఈ టపా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒకరోజు ఆలశ్యమైనది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


ప్రపంచం ఎప్పటికప్పుడు ఏదోవిధమైన ఆపదలను ఎదుర్కొంటూనే ఉంది. ఆపదలు కాలంతో పాటూ రూపాలను మారుస్తూ మానవాళి ప్రశాంత మనుగడపై దాడి చేస్తూనే ఉన్నాయి. ఆపదలు కేవలం మానవీయమైనవే కాక, సకల ప్రాణకోటికీ, ప్రపంచ మనుగడకీ సంబంధించినవి. పరిస్థితులలో దేశమూ కూడా సత్యాన్ని సంరక్షించే భాద్యతను గానీ, నిజమైన ఆధ్యాత్మికత విలువలను ప్రభోదించే కార్యాన్ని గానీ స్వీకరించలేదు.

ఇప్పటికే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ఎన్నో దశాబ్దాల అయోమయ, అవినీతి స్థితుల వల్ల ఆర్ధికంగా బలహీనపడి అంతరించాయి.

పారిశ్రామిక, పెట్టుబడి దారీ దేశాలు తమ సంపదలనూ, ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భావితరాలకు చేరాల్సిన వనరులను ఇప్పటినుండీ దోచుకుంటూ ఆనందాన్ని పొందుతున్నాయి.

కొన్ని పేదదేశాలు అభివృధ్ధిలో దారుణంగా వెనుకబడి అగ్రదేశాల ముంగిట దేహీ అంటున్నాయి.

మరికొన్ని దేశాలు అంతర్గిక యుధ్ధాలతో, పొరుగు రాజ్యాల కయ్యాలతో సతమతమవుతూ ఉన్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న జనాభాని అరికట్టలేక ఇంకొన్ని దేశాలు సమస్యాత్మకం అవుతున్నాయి.

పర్యావరణం ఇప్పటికే పారిశ్రామిక, రసాయనిక వ్యర్ధాలతో, నాశనమైన అడవులతో కాలుష్యం కోరలలో చిక్కుకుంది.

భూభారం వాతావరణంపై సైతం ప్రభావాన్ని చూపుతున్నదని మనకు తెలియనిది కాదు.

ఇలా మనచే నాశనం కాబడుతున్న భూమిపై మన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా, మరిన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొనకుండా కొనసాగేది ఇంకెన్నాళ్ళు?

అణు ఒప్పందాలు సఫలీకృతమయ్యి, ప్రపంచ దేశాలన్నీ సంతకం చేసినా కూడా మనం విసర్జిస్తున్న వ్యర్ధాలు చాలును, అణుబాంబులకంటే కూడా మిన్నగా విషతుల్యం చేయటానికి. ప్రాధమికంగా మనం వాడే అల్లోపతీ వైద్యాన్ని తీసుకున్నా కూడా అది ప్రకృతికి విరుధ్ధంగా ప్రవర్తించేదే. ఇది మరిన్ని కొత్త వ్యాధులకు కారణమవుతున్నది.

ప్రపంచంలో చాలా మతాలు ఇప్పటికే తమ మత విశ్వాసాలకూ, ఆధునిక పోకడలకు మధ్యన వారధిని కనుగొనలేక సంఘర్షణ పడుతూ ఉన్నాయి. కొంత మంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తమ కువిశ్వాసాలను ప్రపంచంపై రుద్ది అందరినీ కలుపుకు పోదామని చూస్తున్నారు. తమ విశ్వాసాలు మానవాళి సమస్యలను తీర్చగలవని నమ్మబలుకుతున్నారు.

కొన్ని సంస్కృతులు వస్తువ్యామోహ ప్రపంచంతో రాజీపడి ఆధునికతకు పూర్తిగా దాసోహమయినాయి.

మహోన్నత ఆధ్యాత్మిక నాగరికతలయిన హిందుత్వం, బౌధ్ధం ఇప్పటికీ పశ్చిమ దేశ పోకడలతో తమ పరిధిలో పోరాడుతూనే ఉన్నాయి. పోరాట సమయంలో మనం ఒక ప్రశ్న సంధిద్దాం.

"ప్రస్తుత పరిస్థితులలో భారత దేశ స్థానం ఏమిటి? ఆమె పోషించాల్సిన పాత్ర ఏమిటి?"

భారతదేశం కూడా ఎన్నో సమస్యలను తట్టుకుంటూ మనుగడ సాగిస్తున్నదే. ఇందులో సందేహమేమీ లేదు. మతపరమైన సమస్యలతో పాటూ, నియంత్రణ కోల్పోయి హద్దులు దాటిన జనాభా తలనొప్పిగా తయారయ్యింది. దీనికి తోడు అంతర్గిక వర్గ వైషమ్యాలూ, రాజకీయ స్వార్ధపరాయణత్వం, అవినీతి అగ్నికి ఆజ్యం పోసాయి. భారతదేశ ఆర్ధిక, ప్రభుత్వ విధానాలపై పట్టు సాధించిన లెఫ్టిస్టు, కమ్యూనిస్టు భావకులు మన ఆధ్యాత్మిక సంస్కృతికి విరుధ్ధంగా పాలన సాగిస్తూ భరతమాత ఆత్మ ఘోషకు కారణమయ్యారు. మనకు పెట్టుబడిదారులకు కూడా కొదువలేదు. భారతావనిని ఎలా దోచుకోవచ్చునా అని ఆలోచించే మల్టీ నేషనల్ కంపెనీలకు మన పెట్టుబడిదారీ వర్గాలు దనాపేక్షతో మోకరిల్లాయి.

ఈనాడు హిందుత్వ ఆత్మ ఎక్కడుంది? భరతమాత మనోసంకల్పం ఏమిటి? జరుగుతున్నదేమిటి?

ఈమె శతాబ్దాల తరబడి శాంతి కోసం, సహనంతో మానవాళి ఐకమత్యాన్ని కాంక్షిస్తూ, అన్ని మతాలనూ గౌరవిస్తూ, అన్ని సంస్కృతులనూ కలుపుకుంటూ ప్రవాహంలో దిశలేని నావలా పయనిస్తూ ఉండిపోయింది. పాశ్చాత్య సెక్యులర్ సంస్కృతులు ఈమెపై నిత్యం దాడి చేస్తునే ఉన్నా, మన భరతమాత అందరినీ సంతోషపరచటానికి ప్రయత్నిస్తూనే ఉంది.

మనదేశంలో ప్రతీ రాజకీయ వర్గానికీ, ప్రతీ కులానికీ, ప్రతీ మతానికీ - అందరికీ తమ వంతు వాటా కావాలి. హక్కులు కావాలి. అందరూ పొందాలనుకునేవారే తప్ప ఇచ్చేవారే లేరు. స్వార్ధపరాయణత్వానికీ, వ్యామోహానికీ ఎదురొడ్డి నిలిచేవారుకరువయ్యారు.

ఈ రణరంగంలో సగటు హిందువు పోరాటానికి కాదుకదా కనీసం గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం కూడా చెయ్యకుండా మిన్నగుండిపోతున్నాడు.

వరదలా వచ్చి పడుతున్న పాశ్చాత్య సంస్కృతులను అహ్వానిస్తూ, అది ఆర్ధికపరమైన అభివృధ్ధియని భ్రమిస్తూ తల్లి మనో సంకల్పాన్ని మరుస్తున్నాడు. మౌనంగా భరిస్తూ తన నేలపైననే ఇతర మతాల వ్యాప్తిని సైతం అంగీకరిస్తున్నాడు.

నేటి సగటు హిందువుకి తన సంస్కృతి పట్ల నమ్మకం లేదు. ఇతర మతాలు బాధించినా విమర్శించలేని పరిస్థితులలో మనో నిబ్బరాన్ని కోల్పోయి ఉన్నాడు. వీటన్నిటినీ పట్టించుకోకుండా, ప్రాధాన్యతనీయకుండా ఉంటే వాటంతటవే వెనక్కి వెళ్ళిపోతాయన్న భ్రమలో మిగిలిపోయాడు. అయితే ఇది ఒక వైరస్ వలే, ఇన్ఫెక్షన్ వలే దేశమంతా వ్యాపించగలదని గ్రహించలేకపోయాడు.

సగటు హిందువు యొక్క మనస్తత్వం ఇదీ...

వారు దేనినీ నిరోధించరు. ఆత్మవిశ్వాసంతో తాము నమ్మిన దానికై నిలబడరు. ప్రపంచం వారినుండి ఏది లాక్కోయత్నించనీ, అడ్డు చెప్పరు. తమ వ్యక్తిత్వాలని భయం చాటున ఉంచుతారు.

మొదట ముస్లింలకు, పిమ్మట బ్రిటిషర్లకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఎదిరించటం అన్నది వీరు మరిచారు. ఒక్కోసారి అమాయకంగా తమను నాశనం చేయగోరే వారితో చేయి కలుపుతారు. తమ వారితోనే పోట్లాడుతారు. (ఇది ఇప్పటికినీ ఉంది. లెఫ్టిస్టు, కమ్యూనిస్టు సిధ్ధాంతాల శరణు జొచ్చి తమ వారితోనే పోరాడే హిందువులెందరో...)

ఇప్పుడు మనమందరం స్వతంత్ర్యులం. అయితే ఏళ్ళ తరబడి పరాయి పాలనలో మ్రగ్గి మనమెవరో మరచాం. ప్రస్తుతం మనలని మనం ఎలా పరిపాలించుకోవాలో తెలియని సంకటస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. మనం నిర్దేశింపబడటానికి అలవాటుపడిపోయాం. ప్రస్తుతం ఆర్ధిక శక్తుల రూపంలో వస్తున్న క్రొత్త తరహా దండయాత్రలకై ఎదురుచూస్తున్నాం.

ఇదీ మన పరిస్థితి.

అయితే ఒకప్పటి భారతం ఇలా లేదు. నిరోధించకుండా ఓటమి అంగీకరించే మనస్తత్వం కాదు భారతావనిది. సత్యాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా సర్వశక్తులూ ఒడ్డిన నాగరికత మనది.

మహోన్నతమైన యోగిశ్వరులు పుట్టిన దేశమిది. బుధ్ధుడు, శంకరాచార్యుడు వంటివారు అఖండ భారతావనిని ఒక్క త్రాటిపై తెచ్చి ఉన్నత ఆధ్యాత్మిక ఫలాలనూ, ప్రేమనూ పంచయత్నించారు. రాముడు, కృష్ణుడు వంటి పాలకుల కాలంలో ఈ విలువలు విరాజిల్లేవని చదువుకున్నాము. కాలాక్రమేణా ఎన్నో దాడులు జరిగినా ప్రతిఘటించిన చరిత్ర మనది. ఈ సందర్భంలో గతంలో చదువరి గారి కామెంటొకటి జ్ఞప్తికి వస్తుంది.

"హిందువులను అణగదొక్కే చర్యలు మధ్యయుగం నుండి ఇప్పటి దాకా జరుగుతూనే ఉన్నాయి. మధ్య యుగాల్లో తమకేం జరుగుతోందో ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలిసేది. తమ శక్తిమేరకు ఎదుర్కొన్నారు, హిందువులు. లేనప్పుడు అసహాయులై తలవంచారు. హైందవంలో ఉన్న అంతర్గత శక్తి దాన్ని నిలబెట్టింది.

కానీ
ఇప్పుడు జరుగుతున్నది మాత్రం సూటిగా జరుగుతున్న దాడి కాదు. ఇదో కుట్ర. హైందవమ్మీద చేస్తున్న దొంగ దాడి. ఈ కుట్రదారుల చేతిలో కత్తులూ కఠార్లూ ఉండవు. రకరకాల వాదాలు ఇజాలూ ఉంటాయి. బైటనుంచి అప్పుతెచ్చుకున్న ఎంగిలి సిద్ధాంతాలుంటాయి. వాళ్ళ ద్రోహపూరిత మద్దతూ వీళ్ళకుంటుంది. మన చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఆచారాలను, మన చదువులనూ వ్యతిరేకిస్తూంటారు. మనవైనవన్నిటినీ విమర్శిస్తూ ప్రజల విశ్వాసాలను, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీయడమే వీళ్ళ లక్ష్యం!


ఈ మార్క్సేయులది మార్క్సువాదం. బైటవాడు చెప్పేదేదైనా వీళ్ళకి హేతుబద్ధంగానూ, మన పూర్వులు చెప్పేదేదైనా మౌఢ్యంగానూ కనిపిస్తుంది వీళ్ళకు. చరిత్రను తమకు తోచిన విధంగా రాసేసుకుపోతూంటారు. హైందవ వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వీళ్ళకు పడదు. మన సంస్కృతి అంటే మంట వీళ్ళకు.
ఇంకో రకం జనమున్నారు.. గతంలో తమను అణగదొక్కారనో మరోటో మనసులో పెట్టుకోని, ఆ కసితో ఇప్పుడు విమర్శిస్తూంటారు. పుస్తకాలు రాసేస్తూంటారు. పోలేరమ్మలు, పోచమ్మలు హిందూ దేవతలు కాదు, ఇప్పుడు హిందువులని చెప్పేవాళ్ళు అసలు హిందువులే కాదు పొమ్మంటూంటారు. హిందువులను చీల్చిపారేసి, వాళ్ళను పరాయి మతాల్లోకి చేర్పించి హిందూమతాన్ని బలహీనపరచాలనే కూహకం వీళ్ళది.

ఇహ
దొంగ లౌకికవాదులు - అందరికంటే ప్రమాదకారులు వీళ్ళు. మధ్యయుగం నాటి ముస్లిము కిరాతకుల కంటే ప్రమాదకారులు వీళ్ళు. ఇతర మతాలను నెత్తికెత్తుకుని హిందూమతాన్ని అణగదొక్కడమే లౌకికవాదం అనేది వీళ్ళ భావన..
కొందరిలో ఈ మూడు రకాలూ కొలువై ఉంటాయి. ఇన్ని రకాల జనాల లక్ష్యం కూడా హిందూమతంపై విషంగక్కడమే. వీళ్ళ దౌష్ట్యాన్ని తట్టుకుని హైందవం ఎన్నాళ్ళు నిలబడుతుందో!"

ఇది నూరుపాళ్ళూ సత్యం.

ముస్లింలు కూడా డజన్ల కొద్దీ యుధ్ధ ప్రతిఘటనల అనంతరమే భారతదేశాన్ని స్వాధీనపరచుకోగలిగారు. అప్పటి పాలకులు ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిధ్ధపడ్డారు తప్పితే తలవంచలేదు. ఇలాంటి వీరులను మనం మరువరాదు.

మన మనస్థితి కురుక్షేత్ర యుధ్ధ సమయంలో అర్జునిని సంకటస్థితి.

రెండు మహా సైన్యాల మధ్య అనివార్యమైన యుధ్ధంలో అర్జునుని స్థితి ఇదీ...

అతనికి పోరాడాలని లేదు. పోరాడవలసిన కారణంపై విశ్వాసం లేదు. శతృసైన్యం చేతిలో ఓడేందుకు సిధ్ధపడియున్నాడు. ఇది అతని పిరికితనం కాదు. అతని సున్నితమైన హృదయం ఈ సంఘర్షణలో ప్రత్యర్ధితో వైరాన్ని స్వాగతించలేకున్నది.

మన ప్రస్తుత భారతదేశ స్ఫూర్తి కూడా ఇలానే ఉంది.

జీవితం ఎల్లప్పుడూ కురుక్షేత్రం వంటి రణరంగమే. ఒక్కోసారి కష్టతరమైన పధాన్ని ఎంచుకోవలసి వస్తుంది. మనకు రెండు దారులున్నాయి. ఒకటి ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృధ్ధిని చూపితే, రెండవది ప్రాపంచిక భ్రమలనూ, సరిహద్దు విభజనలనూ సూచిస్తుంది. ఇవి ప్రపంచాన్నే కాదు, దేశాన్ని ఆఖరుకి కుటుంబాన్ని కూడా చీల్చవచ్చు. పర్యవసానంగా మన అభిప్రాయానికి విరుధ్ధమైన ఆలోచనలకు మనతో పాటూ చోటివ్వవలసి వస్తుంది.

ఈ అర్జునుని సంకటస్థికి కృష్ణుడిచ్చిన ఉపదేశం ఇదీ...

"కళ్ళు తరచి చూడు. ఈ నిరోధం కేవలం వర్తమానానికి సంబంధించినది కాదు. ఇది కాల, స్థానాలకు అతీతమైనది, నిర్నిమిత్తమైనది. సత్యం ప్రాపంచిక భ్రమలకై రాజీ పడరాదు. ఎవరో ఒకరు సత్యాన్ని నిలపాలి. అది నీవే అయి తీరాలి. నీవు కాకుంటే వేరెవరు ఈ కార్యానికి పూనుకుంటారు? లేకుంటే నీ పిల్లలకు నీవేం చెబుతావు? ప్రతిఘటించకుండానే రాజీ పడ్డానని చెబుదువా?"

సత్యాన్ని గ్రహించిన అర్జునుని సమాధానం:

"నేను పట్టు సడలించను. ప్రత్యర్ధులకు లేశమాత్రమైనా అవకాశాన్నీయను. నన్ను త్యాగం చేసుకోవలసిన అవసరం వచ్చినా అందుకు సిధ్ధమే. నా సర్వ శక్తులూ ఒడ్డి పోరాడుతాను. ధర్మం నిలబడాలి. అధర్మం విస్తరించిన చోట సహనం జీవించలేదు. ఈ అధర్మం కూకటివేళ్ళతో పెకిళించబడే దాకా నే విశ్రమించను."

ఇదీ ఒకప్పటి భారతదేశ స్ఫూర్తి. దీని అవసరం ప్రస్తుత ప్రపంచానికి ఉంది. భారతదేశ సమస్యలను నిర్లక్ష్యం చేయటమంటే తల్లిని నిర్లక్ష్యం చేయటమే. మనదేశం భూమండలానికి హృదయం వంటిది. ఇక్కడి సమస్యలు ప్రపంచం అంతటా ఏదో విధంగా ప్రతిఫలిస్తాయి. గుండె చెడినపుడు తల, కాళ్ళు వంటి ఇతరత్రా అవయువాలకు సమస్య రావటంలో వింత ఏమున్నది?

పాశ్చాత్య సంస్కృతులు ఈ హృదయం లేని జీవితానికి అలవాటు పడినాయి. స్వార్ధపూరిత, అపరిపక్వత సంస్కృతికి హిందూ ఆధ్యాత్మిక ఆవశ్యకత ఎంతయినా ఉంది. హింసాత్మక కర్మ సిధ్ధాంతంలో, రాజకీయ, సైనిక కబంధ హస్తాలలో చిక్కుకున్న ఇస్లాం సైతం ఈ విధమైన ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించలేదు. మరో దేశమైన చైనా దురదృష్టవశాత్తూ కమ్యూనిజానికి బందీ అయినది. భారతదేశమొక్కటే ఈ విధమైన ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే ఇక్కడి రాజకీయనాయకులు అవినీతిని ప్రోత్సహిస్తున్నంత కాలం, నైతికంగా హిందుత్వం ఎదగలేదు.

అధర్మంతో రాజీ పడటం అంటే అది సహనమో, అహింసయో కాదు. అది స్వవినాశనం. భయంతోనో, అనుమానంతోనో, అవిశ్వాసంతోనో మనం నమ్మాల్సిన సిధ్ధాంతాలకు నీళ్ళొదలటం అంటే కొరివితో తలగోక్కోవటమే. ప్రపంచం ఆధ్యాత్మిక, నైతిక విలువల లేమితో బాధపడుతుంది. భూగోళాన్ని తల్లిగా భావించి, హిందుత్వాన్ని ఒక విశ్వశాంతి సందేశంగా, శక్తిగా గుర్తెరగండి.

అయితే ఇది జరగటానికి ఎంతో మార్పు కావాలి. ప్రస్తుత భారతం నిజమైన హిందుత్వానికి ప్రతిరూపంగా కాకుండా ఒక ఛాయగా మాత్రమే మిగిలి ఉంది. మహర్షులు నడిచిన ఈ నేలపై అవినీతి, కుసంస్కారం రాజ్యమేలుతున్నాయి. నిజమైన హిందుత్వాన్ని గర్హించినవారు కేవలం బాధాతప్తులై, భగ్న హృదయులై మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. వీరంతా అర్జునుని వలే కార్యోన్ముఖులు కావలసిన అవసరం ఉంది. ఇందుకు బదులుగా పోరాటాన్నే జరుపనవసరం లేదు. కనీసం మనం నమ్మిన సత్యానికై నిలబడినా సంతోషమే. ఈ పరిస్థితులలో ప్రపంచం మొత్తం ఎదురు తిరగనీయి. నీవు మాత్రం మనో సంకల్పాన్ని, నిబ్బరాన్ని కోల్పోవద్దు.

లేవండి. మేల్కొనండి...

11 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు

Chakravarthy said...

ఏం చెప్పారు? మీరు ఉదహరించిన రాముడు / కృష్ణుడు / అర్జునుడు మొదలైన వారి ఉనికికి సంభందించిన అధారాలేమైనా ఉన్నాయా!!! ఎందుకండి ఉత్తుత్తి మాటలు మరియు అనవసర ఉదాహరణలు. ఉన్నవి చెప్పండి అంతే గాని పుక్కిటి పురాణాలు కాదు.

బృహఃస్పతి said...

చక్రవర్తిగారూ, ఆధారాల సంగతి ఇక్కడ అప్రస్తుతం. కనీసం ఆ విలువల గురించి చదువుకున్నాం కదా... అంటే ఆ సిధ్ధాంతాల ఉనికి నిజమే కదా... రాముడు, కృష్ణుడు కాకపోతే మరొకరు. ప్రపంచం బట్ట కట్టక మునుపే మనం ఈ రకమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించామన్నది సత్యం.

అయితే హిందుత్వం వ్యక్తిగత పరిపూర్ణ జ్ఞాన సముపార్జన దిశగా సాగటం వల్ల ప్రపంచం మొత్తానికీ చేరలేకపోయింది. తప్పో ఒప్పో తెలియదు కానీ ఇది నాకు మాత్రం పొరపాటేననిపిస్తుంది. Half Knowledge is Dangerous అన్నది ఎంతవరకూ నిజమో నాకు తెలియదు కానీ, మన ఆధ్యాత్మిక విషయంలో పరిపూర్ణ వ్యక్తిగత ఆధ్యాత్మికత కంటే పాక్షిక ప్రపంచ ఆధ్యాత్మికత మేలు చేసేదేమోనని అభిప్రాయపడుతున్నాను.

పెద్దలెవరైనా విశ్లేషించగలరు.

భాస్కర రామి రెడ్డి said...

Good work. Happy indipendence day There is nothing called "belated" in independence.

బృహఃస్పతి said...

విజయమోహన్ గారూ మరియూ భా.రా.రె. గారూ,

ధన్యవాదములు. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఒక్క హిందువుగానే కాకుండా, ఒక దేశంగా కూడా మనం విఫలమౌతున్నాము. ఈ రెంటికీ కారణం ఒక్కటే - శతస్ఫటాచ్ఛాదనలో విస్మృత విహంగంలా పడి ఉన్న హిందువుల స్తబ్దత. ఈనాడు మనదేశంలోనే, నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు. కుహానా లౌకికవాదుల మాయాజాలంలో పడి స్వమతాన్నే ద్వేషించే సత్రకాయలకు ఉదారంగా లభిస్తున్న స్వేచ్ఛ, నిజమైన హిందువుకు లేకపోవటం ఏమాత్రమూ ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే, మనలని మనం లౌకిక రాజ్యంగా ప్రకటించుకుంటూ మైనారిటీ మతాలవారినే అందలమెక్కిస్తున్నాం. దీనికి ఒక్కటే తరుణోపాయం. రాజ్యాంగబద్ధంగా మన దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించాలి. దానికి ముందుగా కావల్సింది 'నిజమైన హిందువుల' ఐక్యత.

ఐప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే, మరికొన్ని దశాబ్దాల్లో మన దేశంలో మనమే మైనారిటీలమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు, దేశాన్ని 'ఇస్లాం రాజ్యం'గానో, 'క్రైస్తవ రాజ్యం'గానో కూడా మార్చే అవకాశాలున్నాయి. కాబట్టి, హిందువులు తమ సంఖ్యను పెంచుకుపోవాలి.

కొండముది సాయికిరణ్ కుమార్ said...
This comment has been removed by the author.
కొండముది సాయికిరణ్ కుమార్ said...

అయితే హిందుత్వం వ్యక్తిగత పరిపూర్ణ జ్ఞాన సముపార్జన దిశగా సాగటం వల్ల ప్రపంచం మొత్తానికీ చేరలేకపోయింది. తప్పో ఒప్పో తెలియదు కానీ ఇది నాకు మాత్రం పొరపాటేననిపిస్తుంది.
===

పై వ్యాఖ్యలో మీ అభిప్రాయం తప్పు అని చెప్పటమే నా ఉద్దేశ్యం అని గ్రహించగలరు.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అయితే హిందుత్వం వ్యక్తిగత పరిపూర్ణ జ్ఞాన సముపార్జన దిశగా సాగటం వల్ల ప్రపంచం మొత్తానికీ చేరలేకపోయింది. తప్పో ఒప్పో తెలియదు కానీ ఇది నాకు మాత్రం పొరపాటేననిపిస్తుంది.
===
పై వ్యాఖ్యలో మీ అభిప్రాయం తప్పు. వైయుక్తికమైన సాధన లేకుండా ప్రపంచానికి ఏమని ఉద్బోధించగలడు ఎవడైనా? ఆ సాధన ద్వారా ఆర్జించిన జ్ఞానంతోనే కదా మహామహులైన మన తత్త్వవేత్తలు ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది.

బృహఃస్పతి said...

భరత మాత సంకల్పాన్ని ఆవిష్కరిస్తున్న సాయికిరణ్ గారికి కృతజ్ఞతలు. పరిపూర్ణ జ్ఞానం అవసరమేనని నేనూ ఒప్పుకుంటున్నాను. అయితే ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకునేటప్పటికీ కాలాతీతం కావటమో, ఐహిక బంధాలను త్యజించటమో జరుగుతుంది. అదీకాక పరిపూర్ణ జ్ఞానమనేది హిందువుకు నిరంతర శోధన, అధ్యయనం కావటం వల్ల ఈ జ్ఞానులు ప్రపంచానికి పంచేది బహు స్వల్పమవుతోంది. దీని వల్ల ప్రపంచానికి చేరాల్సిన, అవసరమైన సందేశం చేరటం లేదేమోనని తోస్తోంది. ఇలాంటి పరిస్థితులలో నిజమైన హిందుత్వాన్ని ఉధ్ధరించే భాద్యతను తీసుకోవటం సిసలైన జ్ఞానులకు సాధ్యం కాకున్నది. పరిష్కారంగా అరకొర హిందుత్వవాదులు (నాలాంటి వాళ్ళు :)) హిందుత్వ ప్రచార భాద్యతను తలకెత్తుకొనవచ్చునా?? దీని వల్ల కీడెంత, మేలెంత? ఫలితమేంటి? వివరించగలరు.

కత్తి మహేష్ కుమార్ said...

http://www.cobrapost.com/documents/JinnahSecularist.htm
http://books.google.co.in/books?id=CS6cJ_nY9UwC&pg=PA32&lpg=PA32&dq=jinnah+religious+belief&source=bl&ots=Gyq4GcYCTw&sig=dFFu7q7fwP4X2uGpLLeecU9zDHI&hl=en&ei=o0mOSqzGCMKJkQXakaS7Cg&sa=X&oi=book_result&ct=result&resnum=3#v=onepage&q=jinnah%20religious%20belief&f=false

జెనరల్ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ లో రాజ్యాధికారం చేపట్టేవరకూ (1958)అదొక సెక్యులర్ స్టేట్. జిన్నా మతవాది కాదు.నిజజీవితంలో బలమైన మతవిలువల్ని పాటించిన మనిషి కాదు. మతం అతనికొక రాజకీయ సాధనం. సవార్కర్ హిందూజాతీయవాదంలాంటిదే జిన్నా ముస్లిం జాతీయవాదం.