ఈ చిన్ని విజయాలు నాకొద్దు
ఈ అల్పానందాలు అసలే వద్దు
నాకు సంచలనం కలిగించే శక్తి కావాలి
సాఫీగా సాగే జీవితాన్ని నే కోరను
నాకు రెక్కలు కావాలి
ఆ రెక్కలతో నేన్నింగికి ఎగిరి,
మరుగుజ్జు మానవులకు
మరింత దూరంగా
విశ్వ సంచారం చేయాలి
నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు
ఈ అల్పానందాలు అసలే వద్దు
నాకు సంచలనం కలిగించే శక్తి కావాలి
సాఫీగా సాగే జీవితాన్ని నే కోరను
నాకు రెక్కలు కావాలి
ఆ రెక్కలతో నేన్నింగికి ఎగిరి,
మరుగుజ్జు మానవులకు
మరింత దూరంగా
విశ్వ సంచారం చేయాలి
నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు
సత్యాన్వేషినై
విహరించే నేను,
గదుల్లో గడియ బిగుంచుకుని
జీవించే జనాలకు
కనిపించనీ, పోనీ
ఎక్కడో చుక్కల్లో
నా రూపాన్ని వీరు,
చూడనీ, పోనీ
నేన్నింగికి ఎగసానన్న
అనుభూతిని నాకివ్వు
నాకు అర్హత లేదనుకుంటే
మళ్ళీ క్రిందికి దించేయ్.
కానీ అందుకు ముందు
నాకొక అవకాశం ఇవ్వు.
21 comments:
nic chala bagumdi.good work
baagundi.
మాకు ఒక మెడిటేషన్ టెక్నిక్ చెప్పినప్పుడు ఇలానే, రెక్కలువచ్చి, ఆకాశంలో ఎగురుతూ ఇష్టమయిన గురువును కలిసినట్టు ఊహించుకోమన్నారు. మీ కవిత చదివినప్పుడు ఆ అనుభవం గుర్తుకొచ్చింది.
చాలా బాగా వ్రాసారు!!
బాగుంది :)
హను, సునీత, గణేష్ మరియూ శర్మ గారూ,
ఆందరికీ ధన్యవాదాలు.
నేను ఇది ప్రింట్ అవుట్ చేసి తీసుకుంటున్నా.. .. థాంక్స్ :)
very very nice.
సుభధ్ర గారూ, ధన్యవాదాలు.
రమ్య గారూ, ప్రింట్ బాగానే వచ్చింది కదాండీ... ఎందుకంటే మీ కామెంట్ నన్ను కదిలించింది. :) Print Blur అయ్యిందేమోననీ...:) మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
బాగా వచ్చిందండీ :) ప్రింట్ తీసుకున్నాను దాని చివర నాకు అర్హత వుంది, యోగ్యత వుంది అని కుడా రాశా :) రోజూ కనిపించేట్టు అద్దం పై పెడతా మీకవిత.
అద్బుతం అన్న మాట సరిపోదు. అత్యద్బుతం.
హృదయశక్తే కవితా శక్తి. కవిత శక్తే హృదయశక్తి.
ఇదొక చక్రం. కవీ పాఠకుడు చెరోవైపునా ఉండి శక్తిప్రశరణ జరుపుకొంటారు.
ఎక్కువసార్లు కవే సూర్యుడు.
నేనిప్పుడు ఒక గుప్పెడు పత్రహరితాన్నయ్యాను.
థాంక్యూ.
బొల్లోజు బాబా
కొడుకు పుట్టాడుకదా మీకు రెక్కలొచ్చినట్లే,ఇహ విహరించండి హాయిగా :)
రమ్య గారూ, విజయమోహన్ గారూ, ధన్యవాదాలు.
బాబాగారూ, మీ వ్యాఖ్య నన్ను పత్రహరితాన్ని చేసింది.:) ధన్యవాదాలు.
కవీ పాఠకుడు చెరోవైపునా ఉండి శక్తిప్రశరణ జరుపుకొంటారు.
మీ వ్యాఖ్య ద్వారా మీ నుంచి వచ్చిన శక్తి నన్ను ఉత్తేజితుడిని చేసింది.
ఒక్కసారి, "నేను - నా - నాకు" ఇలాంటి పదాలన్నీ తీసి పద్యం చదవండి. ఒకచోట భావ లోపం కూడా కనిపిస్తున్నది. సత్యాన్వేషినై విహరించే నేను అని ప్రకటించుకుని, అల్పానందాలు చిన్నవిజయాలు నాకు వద్దు అని కూడా చెప్పుకొని, కొన్ని పంక్తుల్లో "మరుగుజ్జు మానవులను మరింత చీమల్లా చిన్నచూపు చూడాలి" అనుకోవటం పొసగటంలేదని నా అభిప్రాయం.
సాయికిరణ్ గారూ,
ఎవ్వరికీ కనపడకుండా దాచిన ఒక అతుకుని మీరు బహిర్గతం చేసేసారు. :)
"సత్యాన్వేషినై విహరించే నేను... దగ్గరనుండీ, నేన్నింగికి ఎగసానన్న అనుభూతిని నాకివ్వు" వరకు రాసిన పంక్తులు కొత్తగా వచ్చి చేరినవి. ఈ కవిత ఒరిజినల్ వెర్షన్ కోసం రాసిన కవిత ప్రకారం అక్కడ నేనుంచిన లైన్లు ఇవీ:
నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు
సామన్య అసామాన్య భేదాన్ని
ప్రదర్శించే అవకాశం ఇవ్వు!
ఆ తేడా గుర్తించిన, ఈ
జనాలకి నెత్తిన కళ్ళు
కుట్టుకోవాలి
ఎక్కడో చుక్కల్లో
నా రూపాన్ని చూసి
వీళ్ళు కుళ్ళు కోవాలి.
ఈ కవిత పూర్తిగా మానవుణ్ణి నిందిస్తూ రాసిందే... అయితే ఎందుకు నిందించాలన్న పరివర్తన నన్ను ఆ పంక్తులు మార్చేలా చేసింది.
మరుగుజ్జు మానవుణ్ణి చిన్నచూపు చూడాలి అన్న వాక్యం మార్చాల్సి ఉందన్న మీ అభిప్రాయంతో నూరు శాతం ఏకీభవిస్తాను. త్వరలోనే ఆ వాక్యాన్ని మారుస్తాను.
మరుగుజ్జు మానవులను మరింత చీమల్లా చిన్నచూపు చూడాలి అన్న వాక్యాన్ని మరుగుజ్జు మానవులకు మరింత దూరంగా విశ్వ సంచారం చేయాలి అని మార్చాను.
ఎగరటం వరకు బాగానె వుంది కాని అవనీ తలం మీద అన్వేషించలేని సత్యాన్ని ఆకాశం లో ఎలా అన్వేషిస్తారు? మనసు తలుపుల గడియవేసిన గొళ్ళేలు తెరిపించండి నింగికెగిసిన అనుభూతి, కత్తిరించలేని విశాలమైన రెక్కలు మీరే గమనిస్తారు.. :-)
భావన గారూ, నేను రెక్కలన్నది కూడా చిత్తానికేనండీ...
నేనన్నది చిత్తనికేనండీ.. చిత్తాన్ని రెక్కలతో వినీల గగనాన విహరింప చేసి సత్యాన్ని వెతికే స్నేహితుడా.. మనసు తలుపుల గడియవేసిన గొళ్ళేలు తెరిపించండి ఇంక కత్తిరించ నక్కరలేని రెక్కలు దేవుడు అచ్చం గా మీకిచ్చేందుకు అర్హులయ్యి మరీ సత్యాన్వేషణ లో విజం సాధిస్తారు అని..
భావన గారూ, మీ కామెంట్లో పాయింటు బావుందండీ. దీనితో మరో కవిత అల్లుతా త్వరలో...:)
chala bagundi...1st time chustunna mee blog...anni post lu super.. :)
కిరణ్, ధన్యవాదాలు.
anni post lu super.. :)
మరింకేం?, అన్ని పోస్ట్లకీ కామెంట్లు రాసేయండి :) :)
Post a Comment