నిన్నటి కలలో నీ రూపం

అందమైన నీ రూపం
"అదేంటో..!?"

రంగులు చిందిస్తోంది
ఒక్కో రంగు చర్మం తొలగిస్తే,
వేరొక రంగు ముఖం బయట పడుతోంది.

నువు చేతులు లోనికి పోనిచ్చి
నీ గుండెను తీసి చూపిస్తే,
అది అచ్చం
మంచుగడ్డలా కనిపిస్తోంది.
కానీ కించిత్ కూడా కరగట్లా!

ఎందుకా అని చేరువై చూస్తే
అది కటిక స్ఫటిక!
నువ్వు నాపై ఓ నవ్వు విసిరి
తిరిగి నీ గుండెను దాచేసరికి,

నీ చెవులు సాగి ఉన్నాయ్
తలపై కురులు రాలి
ముఖానికి అంటుకున్నాయ్
నెత్తిన కొమ్ములు మొలుస్తున్నాయ్

చర్మం ముడుతలు పడి
నోట్లో దంతాలు కోరలయ్యాయ్
శరీరంలోని అవయువాలన్నీ
క్రమపధ్ధతి నొదిలి
ఇష్టానుసారం రూపాంతరం చెందాయ్

వికారమైన వికృతరూపంతో
నీలో నెమ్మదిగా
మృగరూపు సంతరించుకుంది...

ఇదీ...

...నా నిన్నటి కలలో నీ రూపం!

17 comments:

నేస్తం said...

బాగా రాసారు :)

Padmarpita said...

chaalaa baagundi!

విజయభారతి said...

చిత్రం, కావ్యం రెండు బాగున్నాయి. రాసిన సరళి చాలా సరళంగా ఉంది.

--విజయ

భావన said...

అర్ధం కాలా :-(

బృహఃస్పతి said...

నేస్తం, పద్మార్పిత గారూ, ధన్యవాదాలు.

విజయభారతిగారూ,వికాసానికి స్వాగతం.మీ బ్లాగులో ఆ 'డేగ-బాలుని' బొమ్మ కదిలించిందండీ. నేను కూడా రాద్దామనుకునేసరికి అప్పటికే అక్కడ ఉన్న హైకూలు చూసి, ఆ స్థాయిలో నాది లేదని విరమించుకున్నా:)

బృహఃస్పతి said...

భావన గారూ, మీకు అర్ధం కాలేదా? నేను....నేన్.. నేను.. నే చెప్తా కదా, మీకు అర్ధం అయ్యేట్లు. ఈ మధ్య కొంతమంది నా పాటవిని బాగుంది మళ్ళీ పాడితే వినటానికి మేం రెడీ అని చెప్పి - నన్ను సింగర్ అని నమ్మించేసి - నేను సీరియస్గా తీసుకుని రెండో పాట పాడేసరికి ముఖం చాటేసేసారు. పాటపూర్తయ్యి కళ్ళుతెరిచి చూస్తే ఆడిటోరియంలో ఒంటరిగా పాడుకుంటున్నా. నా పాటకు నేనే చప్పట్లు కొట్టుకుని, నన్నిలా ముందుకు తోసేసిన వారిపై రాసా ఈ కవిత...

ఇప్పుడర్థమయ్యిందాండీ... (ఏదో సరదాగా చనువుతీసుకుని అన్నా... కోపగించుకోక లైట్గా తీసుకోండేం...)

కెక్యూబ్ వర్మ said...

బాగుంది మీ స్వప్న విహారం. మనిషిలో దాగిన మృగాన్ని బయటపడేసారు. పై ఫోటో మాత్రం అద్భుతంగా వుంది.

బృహఃస్పతి said...

వర్మ గారూ, నేనూ ఆ మనుషుల్లో ఒక భాగాన్నే :) అయితే అప్పుడపుడూ మానవశరీరం నుండి బయటకు వచ్చి ఇలా రాసుకుంటా...:)

Sravya V said...

ఈ మధ్య కొంతమంది నా పాటవిని బాగుంది మళ్ళీ పాడితే వినటానికి మేం రెడీ అని చెప్పి - నన్ను సింగర్ అని నమ్మించేసి - నేను సీరియస్గా తీసుకుని రెండో పాట పాడేసరికి ముఖం చాటేసేసారు. పాటపూర్తయ్యి కళ్ళుతెరిచి చూస్తే ఆడిటోరియంలో ఒంటరిగా పాడుకుంటున్నా. నా పాటకు నేనే చప్పట్లు కొట్టుకుని, నన్నిలా
>>>
I hurted :(

బృహఃస్పతి said...

అయ్యయ్యో.. శ్రావ్యగారూ, తూచ్! నా ముందరి కామెంట్ వెనక్కి తీసుకుంటున్నా... అయినా ఒకసారి పాత కామెంట్లు చూసి "మళ్ళీ పాడితే వినటానికి మేం రెడీ" అని అన్నదెవరో చెప్పండి. మీరు గొంతు బాగుంది అని మాత్రమే అన్నారు. మళ్ళీ పాడితే వింటానికి రెడీ అనలేదు కదా... కనుక మీరు హర్ట్ అవ్వటానికి ఛాన్స్ లేదు. నేనొప్పుకోనంతే! (స్వగతం: మీరినకూడదు.. అదే చదవకూడదు: హర్ట్ అవ్వబోయే మిగిలిన వాళ్ళనెలా మాయ చెయ్యాలో ఆలోచించాలి.)

బృహఃస్పతి said...

మళ్ళీ స్వగతమే... అర్జెంటుగా ఒక కొత్త పోస్ట్ రాసేస్తే, ఈ ప్రస్తుత టపా మూలపడి మరుగున పడుతుంది.

భావన said...

ఏదో రెండు రోజులు కుదరక కామెంటక పోతే ఎంత అభాండమేసేరండి మా మీద..
I too hurt :-(

నేస్తం said...

మొన్న మీ పాట విందామని అనుకుని మావారు పడుకున్నారు మళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని మళ్ళీ విందామని క్లోస్ చేసేసా మీ పాట..తరువాత మర్చిపోయా.. ఈ రోజు కూడా సేం మావారి పడక..నా వంట సమయం అంతా బిజీగా ఉన్నా వినేసా..చాలా మంచి సాహిత్యం ఇంకా సంగీతం కూడా బాగుంది గొంతు అంటార బేడ్ గా అయితే లేదు...చక్కగా బాగుంది .. మీరు ప్రాక్టిస్ చేస్తే ఇంకా బాగా పాడతారు..:)

Sravya V said...

:)

బృహఃస్పతి said...

భావన గారూ, ఒకసారి పాత కామెంట్ చూడండి... మీరు వింటానికి రెడీ అన్నారు కానీ మళ్ళీ నే పాడితే వింటానికి రెడీ అనలేదు కదా... అదీ గాక మీరు కామెంటు కూడా పెట్టారు కదా... కనుక మీకెలా వర్తిస్తుందండీ?? మీకూ హర్టయ్యే ఛాన్స్ లేదంతే :)

నేస్తం, మీరు సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. మెలుకువగా ఉన్నట్లైతే ఏదో పంటి బిగువు కింద బాధని ఓర్చుకోవచ్చుగానీ, నిద్దట్లో దురదృష్టవశాత్తూ ఈ గొంతు వింటే ఆ పీడకలలు పెట్టే చిత్రహింసలు భరించటం కష్టం. మీలాంటి సమయస్ఫూర్తి కలిగిన అర్ధాంగి దొరకటం మీవారి అదృష్టం.

హమ్మయ్య శ్రావ్యగారు నవ్వేసారు. :)

sunita said...

గత వారంగా కొన్ని పర్సనల్ పనులతో బిజీ. వీలున్నప్పుడు డాష్ బోర్డ్లో కనిపించిన టపాలేవో హడావుడిగా చదివాను. మీ టపాలు కొన్ని మిస్స్ కొట్టినయి.అంత మాత్రాన అభాండాలేస్తారా? నేను కూడా భావనా, శ్రావ్యా పార్టీనే. నా డెస్క్ టాప్ రిపేరులో ఉంది, లాప్ టాప్ లో సౌండ్ కొంచం క్లారిటీ తక్కువుంది.అలా కూడా మొదటి పాట విన్నాను. రెండోది అలా రణ గొణగా వినడం ఇష్టం లేక ఎప్పుడు రిపేరు పూర్తవుతుందా అని చూస్తున్నాను.

బృహఃస్పతి said...

సునీత గారూ, మనం ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాంగా... అయినా ఆ అభాండాలు మీ మీద కాదండీ. ఒకసారి ఆ మొదటి పాటకు మీ కామెంట్ చూసుకోండి... మీరు "ఇంకో పాట వినిపించవచ్చు" అన్నారుగానీ మీరు వింటానికి రెడీ అనలేదుకదా. కనుక ఆ నిష్టూరం మీకు వర్తించదండీ...:)