భగ్గుమన్ననిజం నిప్పు మీద
నా కలల గులాబీ
బుగ్గైపోయింది
బుగ్గై మిగిలిన
కలల కట్టె అంచున
మదమెక్కి పొంచిన
ఆ కలల బలహీనతల
ముల్లు శూలం మాత్రం ...
మరింత పదునెక్కి
అదను చూసి తిరగబడేందుకు
ఎదురు చూస్తోంది
నా ఈ ఓటమికి ఎవరిని నిందించను?
నిప్పునా?
నే చేసిన తప్పునా?
నిజాన్నా?
నా నైజాన్నా?