Showing posts with label కవితలు: జయించా. Show all posts
Showing posts with label కవితలు: జయించా. Show all posts

జయించా


నేడు నా కళ్ళు శ్వాసిస్తున్నాయి
ఉఛ్ఛ్వాస
నిశ్వాసలను
చక్షువులే
శాసిస్తున్నాయి

కైలాసమంత ఎత్తులో
నన్ను
- నేను
కనుగొన్న
ఆనందం
కనులలో
ప్రతిఫలిస్తోంది.

నా కాళ్ళు నేల నానట్లా!
నింగిన
విహరిస్తున్నాయి

విశ్వవిజేతనైనంత

సంతోషంగా

రక్తం
కొత్త ఉత్తేజంతో
ఉరకలు
తీస్తోంది

మానవుడి మరుగుజ్జుతనానికి
ఇన్నాళ్ళకి
పెదవులు నవ్వాయ్!

ఎందుకంటే
--
రోజు నే కోర్కెలను జయించాను.