
గెలుపు
నేనొక మామూలు వ్యక్తిని. పూలవానల్లో తడిసే నిన్ను కలల కౌగిట్లో చూసాను...
ప్రేమించాను...
ప్రేమిస్తే సరిపోతుందా??
కల చెదిరితే, కన్ను విప్పితే అంతా ముళ్ళదారి
అందుకే ఏదో చేయాలి
నింగి, నేల, నీరు, నిప్పు అన్నింటినీ మించాలి
ముఖ్యంగా నన్ను నేను మించాలి.
అందుకే...
నిన్ను ప్రేమిస్తూ, నన్ను ప్రేమించుకోసాగాను.
చివరకు నిన్ను గెలిచే ప్రయత్నంలో నిన్ను కూడా కోల్పోయాను.
నేను, అవును నేను మాత్రమే మిగిలాను.
స్వార్ధం అన్నారంతా... నిన్ను ప్రేమిస్తూ, నన్ను ప్రేమించుకోసాగాను.
చివరకు నిన్ను గెలిచే ప్రయత్నంలో నిన్ను కూడా కోల్పోయాను.
నేను, అవును నేను మాత్రమే మిగిలాను.
కాదని నాకు తెలుసు.
అయినా వాదించలేదు.
మౌనం... మౌనంగానే యుధ్ధం చేసాను.
అభివృధ్ధి ఎప్పుడూ యుధ్ధంతోనే ఆరంభమయినట్లు,
ఈ యుధ్ధంలో నన్ను 'నేను' గెలిచాను
నిన్ను గెలిచే ప్రయత్నంలో అన్నీ కోల్పోయాను
చివరకు నిన్ను కూడా...
అయితేనేం?! నన్ను నేను గెలిచాను.
అప్పుడు గర్వంతో కనులు విప్పిచూసాను. చివరకు నిన్ను కూడా...
అయితేనేం?! నన్ను నేను గెలిచాను.
కల చెదిరిపోలేదు.
ముళ్ళదారి ఎదురుపడలేదు.
పూలవానలు లేవు. నువ్వు కూడా లేవు.
ఉండవని ముందే ఊహించాను.
కానీ కన్నీరు రాలేదు.
ఎందుకంటే అప్పటికీ నువ్వు నా హృదయంలోనే ఉన్నావు.
నేను పూర్తిగా "గెలిచాను"
ఇప్పుడు కూడా నేను మామూలు వ్యక్తిని.
*******
*******
ఇక ఫ్రెండ్(??) అని ఎందుకన్నానంటే ఇతనితో నా స్నేహం తక్కువే. ఆ మరుసటి సంవత్సరమే రావులపాలెం వద్దకు మేం వెళ్ళిన పిక్నిక్ లో ఇతనితో పాటుగా మరో ఇద్దరు గోదావరిలో కొట్టుకుపోయి మరణించారు. ఐదురోజుల పాటు మిగిలినవారందరం అక్కడే ఉండి ప్రయత్నిస్తే కానీ వాళ్ళ మృతదేహాలు కూడా దొరకలేదు. మరణించిన వారు ప్రవీణ్ (విశాఖపట్నం), చంద్రమౌళి(మండపేట) మరియూ ఈ కవిత రాసిన యలమంచిలి అబ్బాయి.
ఈ కవిత ఎందుకు రాసాడో తెలియదు. అసలతని జీవితమే తెలియదు. కవితతో పాటుగా సంతకం, తారీఖు(20-11-98) వేసి మరీ ఇచ్చాడు. ఈ ముగ్గురి సీట్లు ఖాళీ కావటంతో, ఆ స్థానాల్లో కాలేజీ మరో ముగ్గురిని భర్తీ చేసింది. ఈ కవిత రాసిన అబ్బాయి నోట్సులను వాళ్ళల్లో ఒకరికి ఇస్తే అతడా పుస్తకాల్లో దొరికిన ఓ బొమ్మను మా అందరికీ చూపాడు. ఈ యలమంచిలి అబ్బాయి క్లాస్ రూమ్ లో పాఠాలు వినకుండా బొమ్మలు వేయటం, కవితలు రాయటం మాకందరికీ తెలిసిందే. ఆ బొమ్మ నా దగ్గర లేకపోయినా అందులో నే చూసినది ఇదీ...

నా స్థానంలో ఉంటే మీరు కూడా షాక్ తినేవారు కదా...అన్నట్లు ఈ యలమంచిలి అబ్బాయి పేరు చెప్పలేదు కదూ...
అతడి పేరు రాజేష్. నా పేరు కూడా...