శిలాపుష్పం



స్తాడో రాడో తెలియని
ఆ అపరిచితుని నిరీక్షణలో
తరుగుతున్న కాలంతో పాటూ
పెరుగుతున్న ఆత్రం
కళ్ళను కరిగిస్తూ, గుండెను కదిలించటమే కాదు
కన్నీళ్ళనూ వెదజల్లిస్తోంది.

రాలిపోయిన రోజుల్ని లెఖ్ఖపెట్టుకుంటూ
రేపటి దినాలపై ఆశ నిలుపుకుంటూ
ఆ అపరచితుని,
అస్పష్ట స్వప్నఙ్ఞాపకాలతో
జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ

వేచీ వేచీ వృక్షాన్నై
తనువు శిలైనా,
నిరీక్షించే నా హృదయ కుసుమం
సదా పరిమళిస్తూనే ఉంటుంది.

ఆ ఆగంతకుని రాక కోసం
ఈ శిలాపుష్పం
నిత్యం వాడిపోక, రాలిపోక
రాగాలాలపిస్తునే ఉంటుంది.

2 comments:

ఓ బ్రమ్మీ said...

ఎక్కడ పట్టారో గానీ .. భలే పట్టరు .. అండ్ దానికి సూటైనట్లుగా ఉందీ కవిత ..

అదిరింది ..

బృహఃస్పతి said...

ఫోటోదేముందండీ, గూగుల్ లో వెతికితే అవే దొరుకుతాయి. కవిత బాగున్నదన్నందుకు ధన్యవాదాలు