అయోధ్య వివాదం - ప్రసారమాధ్యమాల పాత్ర

పర్ణశాల బ్లాగునందు ఈ వారం మహేష్ వెలిబుచ్చిన అభిప్రాయం ఇదీ(యధాతధంగా)...!

బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర.

ఈ వ్యాఖ్య నన్నెంతో కలచి వేసింది. నేను మొదలు పెడదామనుకున్న 'హిందూ ఆధ్యాత్మిక వాదుల' పరిచయాన్ని ప్రక్కన పెట్టించి, ఈ వ్యాసాన్ని రాసేందుకు పురిగొల్పింది.

- బృహఃస్పతి


హిందుత్వానికి వేరే దేశాలపై దండెత్తిన చరిత్ర లేదు. మిషనరీల పేరిటగానీ, మరేవిధంగానో గానీ ఇతర దేశాలకు పోయి అక్కడి వారి మతాన్ని ప్రేతమనో సైతాననో ప్రచారం చేసి హిందుత్వాన్ని మాత్రమే ఆచరించమని బలవంతం చేసిన సంఘటనలు అసలే లేవు. ప్రక్కదేశాలలో కోలనీ వ్యవస్థలను స్థాపించి, అక్కడి వారిని ఆర్ధికంగా దోచుకున్న ఘటనలు క్రించింత్ కూడా లేవు. హిందువు ఏనాడూ కూడా సత్యంగానీ, భగవంతుడు గానీ కేవలం తమకు (హిందువులకు) మాత్రమే చెందుతాడని, మిగిలిన వారు పాపులని చాటిన దాఖలాలు లేవు. హిందూ చరిత్రను తరిచి చూస్తే సహనం, పరమత ఆదరణ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఏ ఇతర మతమూ ఎరుగనివి.

ఐతే దురదృష్టవశాత్తూ ఈనాడు ప్రసార మాధ్యమాల్లో హిందూ వ్యతిరేకత అన్నది సర్వ సాధారణ విషయంగా మారింది. ఈ విధమైన హిందూ వ్యతిరేక భావనలు బహు కొద్ది మంది చేత మాత్రమే ఖండించబడుతున్నాయి.

1992 డిసెంబరులో జరిగిన అయోధ్య సంఘటనను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచం అంతటా (భారతీయ మాధ్యమాలతో పాటుగా) “హిందూ తీవ్రవాదులు మసీదును కూలగొట్టారు" అంటూ కోడై కూసి హిందువులను అటు తీవ్రవాదులగానూ, ఇటు మసీదును నాశనం చేసిన వారిగానూ నిలబెట్టిన ఈ ఘటన పూర్వ పరాలను పరిశీలిద్దాం.

4 శతాబ్దాల క్రిందట మధ్య ఆసియాకు చెందిన ముస్లిం చక్రవర్తి నిర్మించిన ఒక కట్టడాన్ని హిందూ వర్గానికి చెందిన వారు కూల్చివేసారన్నది కాదనలేని సత్యం. ఈ కట్టడం గతంలో సుమారు (60-65 ఏళ్ళ క్రిందట) మసీదుగా ఉపయోగించబడినది. చివరిసారిగా ఇక్కడ ముస్లింలు 1945 ప్రాంతాంలో నమాజునాచరించారు. తరువాతి నాళ్ళలో ఈ అయోధ్య మసీదు లేదా బాబ్రీ మసీదు కేవలం హిందువుల మత కార్యక్రమాలకై మాత్రమే ఉపయోగించబడుతున్నది.

1949 వ సంవత్సరంలో ఇక్కడ రాముని ప్రతిమలు స్థాపించబడ్డాయి. కాకపోతే అప్పటికే కట్టబడిన మసీదు నిర్మాణాలను కూల గొట్టకుండా ఆ ప్రక్కన ఈ ప్రతిమలు ప్రతిష్టించారు. ఈ కట్టడం యొక్క నిర్మాణం నిజమైన మసీదుని పోలి ఉండదు. గోపురాలు(మీనార్), గూళ్ళు వంటి మసీదు పరమైన నిర్మాణాలు ఇక్కడ లేవు (గూగుల్ లో ఫోటోలు చూడండి) వీటన్నిటికీ మించి, ఈ స్థలం హిందువులు పవిత్రంగా భావించే శ్రీ రాముని జన్మస్థలంగా హిందూ గ్రంధాలలో పేర్కొనబడినది. అయితే కాలక్రమంలో జరిగిన డజన్ల కొద్దీ యుధ్ధాలలో హిందువులు(సిక్కులు కూడా) మొఘలుల నుండి ఈ ప్రదేశాన్ని కాపాడుకోవ యత్నించి అశువులు బాసి చివరకు నిస్సహాయంగా ధారాదత్తం చేసిన ప్రదేశమిది.

ముస్లింలకు సంబంధించి ఈ ప్రదేశం మక్కా లేక మదీనా వంటి పవిత్ర స్థలం కాదు. అయితే హిందువులకు సంబంధించి ఇది ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో(sacred) ఒకటి.

కనుక ఈ స్థలాన్ని మసీదు అనడం అసంబధ్ధం. బహుశా ఒక 'వివాదాస్పద స్థలం' అని ఉన్నా సమంజసమేనేమో!

అయితే ఏ ప్రసారమాధ్యమమూ కూడా హిందువులు ఒక వివాదాస్పద కట్టడాన్ని కూల్చారన్న వార్తను ప్రజలకు చేరవేయలేదు. ఎందుకంటే ఇలా చెప్తే వారికి కావలసిన 'మసాలా కధ' దొరకదు. ఫలితం ప్రసారమాధ్యమాలు హిందువులు ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీసారన్న గగ్గోలునే కాక హిందువులపై తీవ్రవాదులన్న అపవాదును మోపి తదనంతరం జరిగిన మరెన్నో హింసాజ్వాలలకు ఆజ్యం పోసారు.

వేయి సంవత్సరాల పైబడి, అలుపెరగని ముస్లిం చక్రవర్తుల దండయాత్రలలో కొన్ని లక్షల హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. క్రీస్తు శకం 6-7 వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు (హుయాన్ త్సాంగ్ మొదలగువారు) తమ దేశానికి అందించిన చరిత్ర లెక్కల ప్రకారం ఉండాల్సిన ఎన్నో- ఎన్నెనో హిందూ దేవాలయాలూ, బౌధ్ధ, జైన కట్టడాలూ ఇప్పుడు ఆనవాళ్ళకు కూడా దొరకవు. ఇవేవీ సహజ సిధ్ధంగా నేలమట్టమవలేదు. రాత్రికి రాత్రి మాయమవనూలేదు. ముస్లిం చక్రవర్తుల సంకల్పానుసారం హిందువుల విశ్వాసాలను దెబ్బకొట్టే ప్రయత్నంలోనూ, ఆ దేవాలయాల్లోనున్న వజ్ర, వైఢూర్య, రతనాల సంపదలను కొల్లగొట్టే ప్రయత్నంలోనూ జరిగినవి.

ఇందులో భాగంగానే హిందువులు పవిత్రంగా భావించే శ్రీకృష్ణ, శ్రీరామ జన్మస్థానాలు దారుణంగా ధ్వంసం చేయబడ్డాయి. ఈ విధ్వంసంతో ఆగక ఈ పవిత్ర హిందూ కట్టడాలకు ఉపయోగించిన రాళ్ళను ఆ ప్రక్కనే మసీదు కట్టడాలలో (మధుర కు వెళ్ళిన వారికి ఇది ప్రత్యక్షానుభవం) ఉపయోగించటం అత్యంత దయనీయమైన విషాద సంఘటన. ఈ హిందూ ఆలయ పూజారులను, ఆ మసీదు ప్రవేశద్వారం వద్ద పూడ్చి పెట్టేవారట. మసీదునందు ప్రవేశించేవారు తమ పాదాన్ని ఈ భూస్థాపిత హిందూ సమాధిపై మోపి వెళితే అదొక విజయసూచికం.

ఈ విధమైన క్రూర చరిత్ర, చాలా మంది చరిత్రనుండి 'లాభాల'ను మాత్రమే ఆశించే 'వ్యాపారులకు' పట్టదు. తమ 'వ్యాపారాపేక్ష'తో 'చరిత్రహీనులు'గా ఉండటమే ఉత్తమమని భావించే వీరికి ఉన్నత విలువలు పట్టవు. రాముడక్కడే పుట్టాడనటానికి అక్కడ DNA ఆధారాలు కావాలంటారు. హిందువులు పది చోట్ల రాముడు పుట్టాడని ప్రకటించలేదు. హిందూ గ్రంధాల ప్రకారం, శిలాశాసనాల ప్రకారం అన్నీ ఏకాభిప్రాయంతో చెప్పిన చోటనే పుట్టాడంటున్నారు. ముస్లిం చక్రవర్తులు కూడా ఈ ఆధారాల అనుగుణంగానే ఒక ప్రణాళిక ప్రకారం హిందూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేసారు. ఏ భావాల, ఇజాల ప్రభావానికి లొంగకుండా, ప్రశాంత చిత్తంతో ఒక్క సారి మీ మనోనేత్రాన్ని తెరచిచూడండి. వేల యేళ్ళగా హిందుత్వ ఆత్మ ఎలా హత్యా యత్నాలకు గురి అవుతోందో మీ హృదయానికి ఖచ్చితంగా కనిపించి తీరుతుంది.

1947 లో ముస్లిం మైనార్టీలకొరకు జరిగిన దేశ విభజన ముఖ్యోద్దేశం హిందువుల పాలనలో జీవించేందుకు ముస్లిం వర్గాల తిరస్కారం. ఈ పరిణామంలో పాకిస్థాన్ లో నున్న అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా రూపాంతరం చెందాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు చెందిన ప్రభుత్వాలూ, సైన్యం కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ ధ్వంసాకాండకు రచన చేసిన సంఘటనలు కోకొల్లలు.

అయితే చరిత్రలో ఈ విధంగా హిందూ దేవాలయాలను కూల్చి మసీదు నిర్మించిన ఘటన ఒక్కటి కూడా వెలుగు సంతరించుకోలేదు. కనీసం అయోధ్య వివాద సమయంలోనైనా ఇటువంటి చరిత్ర ప్రస్తావన ఎవ్వరినీ ఆలోచింపచేయలేదు. ఇందుకు విరుధ్ధంగా తిరిగి హిందువులు తీవ్రవాదులగానూ, మసీదు విధ్వంసకులగానూ ప్రపంచానికి పరిచయం చేయబడ్డారు.

అయోధ్య వివాద సమయంలో కూడా డజన్ల కొద్దీ హిందూ దేవాలయాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూల్చివేయబడ్డాయి. బ్రిటన్ మొదలగు భారతేతర దేశాలలో సైతం ఈ విధమైన దాడులు హిందూ దేవాలయాలపై జరిగాయి. అయినప్పటికినీ ఈ వివాదాలు చాలా తేలికగా తీసుకోబడ్డాయి. కారణం, 'మసీదు ధ్వంసానికి తెర లేపినది హిందువులు. కావున తదనంతరం చెలరేగిన హింసా వివాదాలకు (ముస్లిం వర్గాలచే కూల్చబడిన హిందూ దేవాలయాలకు) కూడా హిందువులే బాధ్యులు.'

ఇదీ దాదాపు అన్ని ప్రసార మాధ్యమాలూ కూడా అయోధ్య వివాదాన్ని చూసిన కోణం.

'హిందూ దేవాలయం కూల్చివేత ఎందుకు వార్త కాలేకపోతోంది?' 'ఒక వివాదాస్పద కట్టడం(మసీదుగా భావించే) కూల్చివేత ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటుంది?' నిజానికి ముస్లిం వర్గాలు వేరే వర్గానికి చెందిన మసీదులను కూల్చివేసిన సంఘటనలూ ఉన్నాయి. (పాకిస్థాన్లో కూల్చివేయబడ్డ అహ్మదీయ మసీదు). ఇవి సైతం ఎందుకు అయోధ్య సాధించినంతటి వివాదాన్ని పొందలేకపోతున్నాయి?

దీనికి సమాధానంగా తిరిగి ఇలా ప్రశ్నించుకుందాం.

"వేల సంవత్సరాలనుంచీ హిందూ దేవాలయాలు ధ్వంసమవుతున్నప్పటికినీ, ఎందుకు హిందువులు అయోధ్య విషయంలో మాత్రమే కళ్ళు తెరచారు?"

పై ప్రశ్నకు సమాధానం కూడా తరచి చూస్తే అక్కడే లభిస్తుంది.

"ఎవరు సమ్మతించినా, లేకున్నా తరతరాలుగా మనసు పొరల్లో దాగున్న మోసగింపబడ్డామన్న భావన లేదా అన్యాయం జరిగిందన్న బాధ లేదా దోచుకోబడ్డామన్న దుగ్ధ చట్ట పరంగా తగిన న్యాయం లభించనప్పుడు విప్లవంగా ఉబికి వస్తుంది."

ఇది కమ్యూనిస్టులు సైతం అంగీకరించవలసిన నిజం. విప్లవానికి వారిచ్చే నిర్వచనం కూడా ఇదే!

గత అరవై ఏళ్ళ పైబడి ఈ అయోధ్య వివాదం కోర్టు గోడల మధ్య సరియైన తీర్పు వెలువడక నలుగుతుందన్న నిజాన్ని ఏ పత్రికా చూపించ ప్రయత్నించలేదు. కనీసం మన చట్టాలు సైతం ఆ కట్టడం మసీదనో లేదా గుడి యనో నిర్ధారించలేకపోవటం శోచనీయం. ఇలాంటప్పుడు అది వివాదాస్పద కట్టడమే కానీ చట్టపరంగా కూడా మసీదు కాజాలదు.

అణగద్రొక్కబడిన ఎన్నో వర్గాల మాదిరిగానే హిందువులూ మేల్కొన్నారు. జాతి, వర్ణ, లింగ విచక్షణ తదితర వైషమ్యాలలో అణగద్రొక్కబడిన వారు కోపోద్రేకాలకు, కట్టలు తెంచుకునే అవేశానికీ లోనై ప్రవర్తించేటప్పుడు వారిపట్ల చూపే సానుభూతిలో కాసింతైనా హిందువు పొందలేకపోయాడు. కనీసం ప్రసార మాధ్యమాలు సైతం అటుగా దృష్టి సారించలేదు. తరతరాలుగా లభించని న్యాయానికై నిరీక్షించి నిరీక్షించి, ప్రజాస్వామ్య పాలనలో సైతం తమకు న్యాయం జరుగకపోవటంతో హిందువు తనకు తాను న్యాయం చేసుకో యత్నించిన ఘటన ఇది.

ఇది తప్పనో, ఒప్పనో నేను చాటిచెప్పటానికి ప్రయత్నించటంలేదు. ఇది ఒక విప్లవం అంతే! ప్రపంచంలో ఏ మూలనైనా అణగద్రొక్కబడ్డ వర్గాలు ఉద్యమించటం సరియైనట్లైతే, ఇది అందుకు మినహాయింపు కాజాలదు. హిందువు కూడా ఈ దారిలోనే నడిచాడని భావించాలి.

హిందువు అణగద్రొక్కబడిన వర్గం అంటే మీరెవరూ అంగీకరించకపోవచ్చును. ఒక్కసారి చరిత్రను చూడండి. 8 వ శతాబ్దం మొదలుకునీ ముస్లిం, పోర్చుగీసు, బ్రిటిష్ దండయాత్రలలో వర్ణ పరంగా, మత పరంగా, ఆర్ధిక పరంగా సైన్యం ఉక్కుపాదాల క్రింద అణచివేయబడిన చరిత్ర మనది. ఈ విధంగా చరిత్రను తరచి చూస్తే మనం హిందువులెందుకు ధ్వంస రచనకు పూనుకున్నారని ఆవేశపడటం మాని హిందువు ఇన్ని శతాబ్దాల తరబడి దేవాలయ విధ్వంసాలను ఎలా సహించాడని ఆలోచిస్తాం. ఈ తరహా సహనం ప్రపంచంలోని ఏ ఇతర సంస్కృతిలోనూ కనపడదు.

హిందుత్వ వ్యతిరేకతను ప్రసార మాధ్యమాలు ఎంత మేరకు ప్రదర్శిస్తాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఓ రెండు ప్రపంచ దేశాలను ఉదహరించి పోల్చి చూడాలి.

అందులో మొదటిది సౌదీ అరేబియా. ఇక్కడ ఇస్లాం తప్ప వేరే మతాన్ని ఆచరించటం చట్టరీత్యా నేరం. ఇతర మత కార్యకలాపాలు కేవలం విదేశీయులకు అందునా బహిరంగం కానీ ప్రదేశాల్లో (అంటే ఇంట్లోనన్న మాట) మాత్రమే అనుమతి లభిస్తుంది.ఇక్కడ మతానికీ, ప్రభుత్వానికీ, రక్షాణా యంత్రాంగానికీ(పోలీసు వ్యవస్థ), సైన్యానికీ తేడా కనపడదు. అన్నీ ఇస్లాం మతాచారాల చట్టాల ప్రకారం నడుస్తాయి. ఇక్కడ సహనం అన్న విధానమే ప్రభుత్వ అజెండాలలోనూ, మత చట్టాలలోనూ ఉండదు. ఇస్లాంకు వ్యతిరేకంగానో లేదూ ఇతర మతాచారాలను బహిరంగంగానో ఆచరించినట్లైతే(సూర్య నమస్కారంతో సహా) చేతులు నరకివేయటం, కళ్ళు పీకివేయటం వంటి క్రూర శిక్షలు అమలవుతాయి. ఎన్నో ఏళ్ళగా ప్రపంచం నలు మూలలా విస్తరిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలకు ఇక్కడి నుండే ధనం సమకూరుతోంది. అయినప్పటికినీ సౌదీ మధ్యస్థ ఇస్లామిక్ (moderate) దేశంగానే పేర్కొనబడుతుంది.

సౌదీలోని చట్టాల వంటివి 10% భారతదేశంలో హిందువులకు అనుకూలంగా ప్రవేశ పెట్టినా ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి ఉండేది. పరిస్థితి యుధ్ధచర్యల దాకా వెళ్ళినా ఆశ్చర్యపడనవసరం లేదు.

అయినప్పటికినీ సౌదీ ఎందుకు ఈ విధమైన గౌరవాన్ని పొందగలుగుతోంది? కారణం అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం పెట్రోలు కొరకు సౌదీ పై ఆధారపడి ఉంది. ఈ ఆర్ధికావసరాలు ప్రపంచ ప్రసార మాధ్యమాలను సైతం నిర్దేశిస్తూ ఉన్నత ప్రమాణాలకు తిలోదకాలిప్పించి, పత్రికా విలువలకు నీళ్ళొదిలేలా చేస్తున్నాయి.

మనం వ్యాపారావసరాలకై ఎవరిపై ఆధారపడతామో వారు ఎంతటి నియంతృత్వ ధోరణి ప్రదర్శించినా అది మనలను విస్మరించేలా చేస్తుంది. ప్రతి రంగంలోనూ ఆధిక్యాన్ని చూపే పశ్చిమ దేశాలు భారత దేశం పై ఆర్ధికంగా ఆధారపడిలేవు. అదే సమయంలో భారతదేశం నుంచి తీవ్రవాద రూపంలోనో, మరే విధమైన ఆర్ధిక పరంగానో వారికి ముప్పులేదు. ఈ పరిస్థితి సహజంగానే ప్రభుత్వాలచే పరోక్షంగా నియంత్రించబడే ప్రసార మాధ్యమాలు భారత దేశం విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం లేకుండా చేసాయి. (అయితే ఈ స్థితి కూడా మారుతుంది. ఛిన్నాభిన్నమైన ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచదేశాలన్నిటినీ ఒకే స్థాయికి తెచ్చినప్పుడు ఆర్ధికంగా బలోపేతమయ్యే భారత వ్యవస్థ ఈ ప్రపంచ ప్రసార మాధ్యమాలకు కళ్ళెం వేయగలుగుతుంది)

ఇక రెండవ దేశం చైనా. కమ్యూనిస్టు నియంతృత్వంలోనున్న చైనాకు - అమెరికాకూ మధ్యన ఎన్నో ఏళ్ళగా బలమైన వ్యాపార సంబంధాలున్నాయి. అందువల్ల సహజంగానే చైనా వ్యతిరేకత ప్రపంచ ప్రసారమాధ్యమాల్లో కనపడదు. వారి సైనిక పాలన గూర్చి ఏ ప్రపంచ పత్రికా నోరు విప్పదు. చైనా ప్రభుత్వం ఎన్ని అణు ప్రయోగాలు చేసినా, టిబెట్టులో బౌధ్ధులపై అకృత్యాలు చేసినా అవి అంతగా ప్రాధాన్యత సంతరించుకోవు. చైనా ఎందుకు ఈ విధంగా ప్రత్యేక హోదా పొందగలుగుతోంది? సమాధానం, ఆర్ధిక లావాదేవీలూ, విస్తీర్ణత, జనాభా, శక్తి రీత్యా చైనా కున్న బలాబలాలు.

మానవీయ విలువలు, సమస్యలు ఈ విధంగా ఆర్ధిక అవసరాలకు దాసోహమై, ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఏమి చేసినా అది ఒప్పే అన్న పరిస్థితిని తీసుకు వచ్చాయి. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు సులభంగా క్షమించబడతాయి. 'అర్ధం' చేసుకోబడతాయి.

ఇప్పుడు ముస్లిం దేశాలలోని హిందూ మైనార్టీలను, భారత దేశంలోని ముస్లిం మైనార్టీలతో పోల్చి చూద్దాం.

పాకిస్థాన్ తమ దేశంలోని హిందూ మైనార్టీలను ఏనాడో దాదాపుగా ఏరిపారవేసింది. బంగ్లాదేశ్ లోనున్న హిందూ మైనార్టీలు సమయం దొరికినప్పుడల్లా దోచుకోబడతారు. ఇవేవీ ప్రపంచ మాధ్యమాల చూపుకు సోకవు. 1971-72 లో జరిగిన బంగ్లాదేశ్ విభజన భారతదేశం జరిపిన కుట్రగా వర్ణించే ప్రపంచ ప్రసార మాధ్యమాలు ఆ సంఘటనలో అశువులు బాసిన వారిలో అధికులు హిందువులేనన్న నిజాన్ని చూపవు.

అరబ్ దేశాల్లో హిందువులు బహిరంగ ప్రదేశాల్లో ఏ విధమైన మతపరమైన కార్యకలాపాలను (సూర్య నమస్కారంతో సహా) ఆచరించకూడదని నిషేధిస్తే దానిని భారతదేశంతో సహా ఏ దేశమూ ప్రశ్నించదు. ఈ తరహా విధానం భారతదేశంలో అమలు చేద్దామంటే జరిగే వివాదం తేలిగ్గా ఊహించవచ్చు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక దేశాలు హిందువుల పట్ల ప్రదర్శించిన తీరును భారతదేశం ఏనాడూ ముస్లింల పట్ల ప్రదర్శించలేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న, భారతదేశంలో పెరుగుతున్న ముస్లిం జనభాతో మనం ముస్లింల వ్యాప్తికి సహకరిస్తుంటే, పాకిస్థాన్ వంటి దేశాలు హిందువులను పూర్తిగా నిర్మూలిస్తున్నాయి.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఏ ఇతర ఇస్లామిక దేశంలోనూ లేనన్ని ముస్లింవర్గాలు మన దేశంలో తమ ఉనికిని చాటుకో గలుగుతున్నాయి. అహమ్మదీయ ముస్లింలు పాకిస్థాన్ నుంచి తరిమివేయబడగా శరణార్ధులై వచ్చిన వీరిని భారతదేశం ఆదరించింది. ఇంత జరిగినప్పటికినీ అయోధ్య వివాదం భారతదేశంలో ముస్లింలపై హిందువులు సాగించిన అకృత్యంగానే మిగిలిపోయింది.

దీనివల్ల అర్ధమైనదేమిటంటే ముస్లింపై హిందువు జరిపే దాడి వార్తకు అర్హమైనది. హిందువుపై ముస్లిం జరిపే అకృత్యం(ఎంత పెద్ద ఎత్తునైనా గానీ) వార్తకు అనర్హమైనది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం ఒక వార్త కూడా కాజాలదు. మన దేశంలో వలే అక్కడి ప్రభుత్వాలు ఈ విధ్వంసాలను అడ్డుకునేందుకు ప్రయత్నించవు. కనుకనే ఇది అక్కడ ఏ రకమైన వివాదాన్నీ సృష్టించదు.

ఎన్నాళ్ళీ అసహాయత? ఎందుకీ అసమానత? కారణం ప్రపంచదేశాలకు ఇస్లాం తీవ్రవాద భయం. హిందువుకు తాను హిందువునన్న స్పృహ లేకుండటం రెండవ కారణం. ఈ రెండో కారణానికి మూల కారణం భారతదేశం పై నున్న వామవాద, మార్కిస్టు భావజాల ప్రభావం. విద్యావ్యవస్థలోనూ, ప్రభుత్వ విధానాలలోనూ(చట్టపరమైన, రాజ్యాంగ పరమైన) వీరు నింపిన హిందూ మత వ్యతిరేకత.

వీరు హిందుత్వాన్ని ఒక వర్గంగానూ, విగ్రహారాధన మొదలైన అనాగరిక దురాచారాలతో నిండిన మౌఢ్యంగానూ వ్యవహరిస్తారు. నిజానికి హిందుత్వం ఒక వర్గానికి చెందినది కాదు. అది వ్యక్తిగతం. హిందుత్వ ముఖ్యోద్దేశం విగ్రహారాధన కాదు. ఉద్దేశ్యం ఆధ్యాత్మికం. హిందూ ఆచరణాలయిన యోగ, ధ్యానం, మొదలైనవి ఆత్మ స్పృహ కొరకు(self realization) వాడబడు సాధనాలు. హిందుత్వ ఉన్నత లక్ష్యం ఈ ఆత్మ సిధ్ధాంతం. ఈ ప్రకృతి సిధ్ధమైన హిందూ తత్వం, ఆత్మ విశ్లేషణ విస్మరింపబడుతున్నాయి. వీటిని అకుంఠిత దీక్షతో ఆచరించిన మహానుభావులు రామకృష్ణ పరమహంస, అరబిందో, రమణ మహర్షి వంటి వారు ఆధ్యాత్మిక పుస్తకాలలో తప్పితే చరిత్రలో స్థానం సంపాదించుకోలేకపోయారు.

ప్రపంచదేశాలూ, ప్రసార మాధ్యమాలూ అన్నీ హిందూ సంఘజీవనంలోని లోపాలను (కుల వ్యవస్థ, లింగ విచక్షణ, వరకట్న దురాచారం వంటివి) ఎత్తి చూపాయి తప్పితే హిందుత్వ ఉన్నత విలువలను చూపటానికి ప్రయత్నించలేదు. కాస్తో కూస్తో వెలుగు చూసిన ఆధ్యాత్మికత అనాగరికులు ఆచరించినదన్నట్లు చూపబడింది. ఈ "అనాగరికులే" ఎన్నో శతాబ్దాల క్రిందటనే ప్రపంచ మానవుడు బట్ట కట్టక మునుపే నాగరికతనూ, అభివృధ్ధినీ సాధించి చూపారన్న సత్యం ఎవ్వరికీ పట్టదు. విచిత్రంగా హిందువులు ఏనాడూ ఏ ఇతరదేశస్థులనీ అనాగరికులని నిందించలేదు. తిరిగి తన చరిత్రను అనాగరికమని పరిగణించినపుడు మౌనం దాల్చవలసి వచ్చింది.

హిందూ దేవాలయం ధ్వంసం చేయటం ఇస్లాం మత వ్యాప్తిలో భాగమని అంగీకరిస్తే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. జనులందరికీ ఒకటే న్యాయం వర్తింపజేయాలి. ఉన్నత విలువలతో కూడిన హిందుత్వ సహనం చేతకానితనంగా భావిస్తున్న రోజులు మారాలి. హిందువుకు ఏ ప్రత్యేక ప్రతిపత్తీ అవసరం లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న అసమానత తొలగాలి. హిందువుల పట్ల సునాయాసంగా వ్యక్తమయ్యే చులకన పోవాలి.

ప్రసార మాధ్యమాల్లో(బ్లాగులే కానివ్వండి, లేదా TV channels, పత్రికలే కానివ్వండి) ఈ హిందూ వ్యతిరేకత కొనసాగినన్నాళ్ళూ అది హిందుత్వానికి మరింత హాని చేస్తుంది. కనీసం ఈ మార్పు మన భారతీయ ప్రసారమాధ్యమాల్లో ప్రారంభమవ్వాలి. ఇది స్వేఛ్ఛాపహరణ ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్ఛ అన్నది విషయాన్ని సూటిగా, నిజాయితీగా చెప్పటంలో ఉండాలి తప్పితే మసి పూయటానికి కాదు. మన సంస్కృతిని, ఆచారాలను హేళన చేసే వారిని నిలదీసే స్థైర్యం సంపాదించుకోవాలి. ఇందుకోసం ప్రతి హిందువూ తన పరిధిలో ప్రయత్నించాలి.

హిందూవ్యతిరేకతను అంగీకరించిన పక్షంలో హిందువు తనను తానే నిందించుకోవాలి తప్ప వేరెవరినీ కాదు. ప్రసార మాధ్యమాలు హిందుత్వ ద్వేషాన్ని సవరించటానికి కూడా ఎంతో ఉపయోగపడగలవు. కాకపోతే ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఈ వ్యాసం ముఖ్యోద్దేశం హిందువులు నిష్కల్మషులని చెప్పటం ఎంత మాత్రమూ కాదు. హిందుత్వ పార్టీలు, సాంఘిక ఆచారాలు ఉన్నతమైనవని చాటటం కూడా నా ఉద్దేశ్యం కాదు. హిందూ సమాజాన్ని సంస్కరించుకునే అవకాశాన్ని హిందుత్వానికే ఇవ్వండి. అఖండ భారతావని ఆత్మకు, హిందూ ధర్మాలకు ఆ భాధ్యతనొసగండి. అంతే తప్ప ఈ కార్యాన్ని పశ్చిమ దేశాల చేతికో, కార్ల్ మార్క్స్ వీరారాధకులకో ఇవ్వకండి.


ఇదంతా చదివాక నేనేదో RSS అభిమానిననుకునే వారికి ఒక మనవి. నాకు కనీసం RSS కి అర్ధం కూడా తెలియదు (R అంటే రాష్ట్ర అని మాత్రమే తెలుసు. మిగిలిన S, S లకు అర్ధం తెలియదు. తెలుసుకోవ ప్రయత్నమూ చేయలేదు. I swear it). గత పదేళ్ళల్లో నేను గుళ్ళకూ, దేవాలయాలకూ వెళ్ళిన సంఘటనలు వేళ్ళ మీద లెఖ్ఖించవచ్చు. ఇక ఇంట్లో పూజ సరే సరి. గత పదేళ్ళల్లో ఏవో కొన్ని పండగలకు తప్ప కనీసం దేవుని పటానికి నమస్కారం పెట్టి కూడా ఎరుగను. నన్నేదో మత మౌఢ్యునిగా భ్రమించే వారి సందేహాన్ని తీర్చటం కోసం ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నాది మతపరమైన విశ్లేషణ అని భావించేవారికి ఇదే నా ఆత్మఘోష.

నేనొక హిందువుని. చెట్టుపై అందనంత ఎత్తులోనున్న ఫలాన్ని కోసుకునేందుకు ఒక కర్రను ఉపయోగిస్తాం. ఫలం లభించాక ఆ పండుని ఆస్వాదిస్తాం కానీ కర్రను కాదు. అసలా కర్ర విషయం కూడా అలోచించం. ఆ అవసరమూ లేదు. మతం కూడా ఈ కర్రలాంటి సాధనమే. నేను హిందుత్వ ఫలాలను అందుకుని సాధనాన్ని ఏనాడో త్యజించాను. అంత మాత్రాన ఎవరో వచ్చి ఆ కర్రను తగలబెట్టాలి అని గగ్గోలు పెడితే నాకెందుకులే అని ఊరుకోను. ఎందుకంటే భావితరాలకు ఫలాలను అందించే శక్తి కేవలం ఆ సాధనానికి మాత్రమే ఉంది. అట్టి సాధనాన్ని ఎవరో నిర్మూలింప ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోలేక గళం విప్పుతున్నాను.

ఈనాడు పెల్లుబికిన ఈ స్వరం కేవలం నా ఒక్కడిది మాత్రమే కాదు. ఇది చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాంతరాల్లో, నరనరాల్లో నిద్రాణమైన హిందుత్వ ఆత్మది. నేడు నా గొంతునాశ్రయించినట్లే రేపు మరొకరి గొంతు సంతరించుకుంటుందని విశ్వసిస్తూ...

జై...
..."హింద్"


(చివరిగా: నా మాటలో మీకు నిజాయితీ కనిపించి ఉంటే, అలోచింపజేసి ఉంటే - ఈ సారాంశాన్ని నలుగురితో పంచండి. హిందుత్వ వ్యతిరేకతను నిర్మూలించటానికి, మీ వంతు చిన్ని ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని forward చేసి(There is an email-a-friend option below next to the comments) గానీ, మీ బ్లాగులో copy చేసుకుని గాని వ్యాప్తి చేయండి)

34 comments:

Kathi Mahesh Kumar said...

మొత్తానికి మనమూ పాకిస్తాన్ లాగో,చైనాలాగో లేక అధమం సౌదీ అరేబియాలాగో మారాలన్నమాట. బాగుంది. మీ ప్రతిపాదనకూ నా బ్లాగులోని నా వ్యాఖ్యకూ ఏమైనా సంబంధం ఉందా?

Anonymous said...

Good tapaa. People should follow UPs formula. Constructing parks and keeping their own idols while alive.

బృహఃస్పతి said...

@మహేష్: ప్రతిపాదన ఎలా మారాలని కాదు. హిందుత్వాన్ని బ్రతికించమని. పాకిస్తాన్, బంగ్లా, సౌదీల్లా మారమని నేనెక్కడా చెప్పలేదే? అసలటువంటి ఉద్దేశ్యాన్ని కూడా నేనెక్కడా వ్యక్తం చేయలేదు. మీరెందుకు అది నా ప్రతిపాదన అని నిశ్చయించేసారో మీకే ఎరుక. ఈ పూర్తి సారాంశం అయోధ్య వివాదంలో మీరు నిందించిన హిందువులకు మద్దతుగానే రాసినది. కనుక మీ బ్లాగులోని మీ వ్యాఖ్యకు ఇది సమాధానమే! మీకు, నాకు ఈ విషయంలో భ్రమలు ఉన్నా, చదివే వాళ్ళు ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటారు. మహేష్ వంటి స్థిత ప్రజ్ఞులూ, అభ్యుదయవాదులు ఒకరిద్దరైనా ఇక నుంచి సునాయాసంగా వ్యక్తమయ్యే హిందూ హేళనను మానుకుంటారని ఆశతో రాసినదిది.

Kathi Mahesh Kumar said...

చదివేవాళ్ళ సంగతేమోగానీ, నాకు మాత్రం ఒకటి అర్థమయ్యింది. మీకు నా టపాగానీ అందులోనుంచీ మీరు ఉదహరించిన వాక్యంగానీ మీకు అర్థం కాలేదని. ఇక అర్థంకాని విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని మీరు ఎన్ని వాదనలు చేసినా...అంతే!

నాగప్రసాద్ said...

చాలా మంచి సమాచారాన్ని అందించారు. ధన్యవాదములు.

ఒక తెలుగుసినిమా(సినిమా పేరు గుర్తులేదు)లోని ఒక పాత్ర స్వభావం ఇలా ఉంటుంది. ఆ పాత్రకు ప్రపంచంలోని అన్ని విషయాలూ గుర్తుంటాయి. కానీ నా అప్పేదయ్యా అంటే మాత్రం "గుర్తులేదు" అంటాడు.

అలానే మహేష్ గారు కూడా, హిందూ మతానికి వ్యతిరేకంగా ఏమి రాసినా సరే, వెంటనే అర్థం చేసేసుకొని, దానికి మసాలా జోడించి, క్షణాల్లో ఆయన బ్లాగులో టపాగా రాసిపారేస్తారు. అదే హిందూ మతానికి సపోర్ట్‌గా రాస్తే మాత్రం, "నాకు అర్థం కాలేదు", నాకే కాదు రాసిన మీకు కూడా అర్థం కాలేదు అంటారు.

కావాలంటే, ఇప్పటికిప్పుడు మీరు "రావణుడు లంకను కాదు మన ఆంధ్రాను పరిపాలించాడు" అని రాసి, దానికి కొంత నాటకీయత జోడించి, ఇలా అని బౌద్ధ జాతక కథల్లో రాసి ఉంది అని చెప్పండి. వెంటనే నమ్మేస్తారు. నమ్మడమే కాదు, ఈ కథ ఎక్కడో విన్నానని చెప్పి ఆయన బ్లాగులో టపాగా కూడా రాస్తారు.

మరొక్కమాట, హిందూమతానికి సంబంధించి ఏ చరిత్రనూ ఆయన అంగీకరించరు. కేవలం బౌద్ధ జాతక కథలను మాత్రమే నమ్ముతారు.

Anonymous said...

@Naagaprasad, When we know intentions of some blogger. There is no point convince him/them. It is waste of time we must ignore them. We know recently what happen to the naanna blog.

amma odi said...

మంచి టపా!

madhavarao.pabbaraju said...

బృహఃస్పతి గారికి, నమస్కారములు.

మీరు వ్రాసిన వ్యాసం అక్షర లక్షలు చేస్తుంది. సందేహం లేదు.
కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని ఏలిన ముస్లింలు, ఆంగ్లేయులు పరిపాలనా కాలంలో, హిందువులు, హిందూధర్మం, కాలరాయబడిందని చెప్పటంలో ఏ అనుమానము లేదు. ఆ విదేశీయులు వెళ్ళిపోయినతరువాత మన "స్వార్ధ రాజకీయ నాయకులు", తమ అధికారం కోసం, "ముస్లింస్ మైనారిటీస్" అని చెప్పుకుంటూ,వారి వోట్లకోసం, హిందూ, ముస్లింల మధ్య స్పర్ధలు తీసుకువచ్చి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. మనకు "హిందు ధర్మమే" వున్నది కాని, "హిందు మతం" అనేది లేదు. ఆ హిందు ధర్మాన్నే మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా వున్నది.

నిజం నిప్పులాంటిది మరియు "కత్తి"లాంటిది అంటారు. "కత్తి మహేష్ కుమార్" గారి వ్యాసాలు పదునైన కత్తిలాగా వుంటాయి. అయితే, కత్తిని చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసి వుంటుంది. నిజమే చెప్పాలిగదా అని, వైద్యుడు, రోగితో నీవు కొన్ని నిముషాలలో చనిపోతావు అని చెప్పకూడదుగదా. అలాగే, వారు చెప్పదలచుకున్న నిజాలను వివరంగా చెప్తే అందరికి అర్ధమవుతుంది అని నా అభిప్రాయం.

భవదీయుడు,
మాధవరావు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఇది బృహస్పతి గారి బ్లాగు అందులో ఆయన ఇతరులతో పంచుకోవాలి అనిపించినవి పంచుకొంటారు. మహేష్‌గారి పర్ణశాల కూడా అంతే. ఆయనకు ఎదురైన సంఘటనలో, చదివిన పుస్తకాలో లేక మరేదైనా కారణాలో గానీండి కొన్నివిషయాలపై ఆయనకు ఇది ఇంతే అనే భావన ఉంది. ఆయనకు ఉన్న అనుభవం, వయసు దృష్ట్యా ఇప్పుడు మనం ఆయనను ఒప్పించాలంటే చాలాకష్టం. మహేష్‌గారు మీరు చెప్పెవాటిలో ఇతరులు ఒప్పుకోలేని నిజాలు ఉంటాయి.అలాగే కొన్ని మీరు ఒప్పుకోలేని నిజాలు ఉంటాయి. ఒప్పుకోక తప్పదు.

బృహఃస్పతి said...

చైతన్యగారూ, పంచుకోవాల్సిన అభిప్రాయాలు ఎవరినైనా నొప్పిస్తున్నాయా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడొక తల్లీ-బిడ్డా ఉన్నారనుకుందాం. బిడ్డ చిన్నప్పుడే ఎవరో వచ్చి birth certificate చించేస్తే, ఆ బిడ్డ పెద్దాయ్యాక - 'నువ్వాతల్లి బిడ్డవేనని ఏంటి సాక్ష్యం?' అని ప్రశ్నించే వారితో ఏం వాదించగలం? మన చరిత్రా అటువంటిదే... 8వ శతాబ్దం మొదలుకుని, ఎడతెగని విధ్వంసాలలో నేలమట్టమైనప్పటికినీ, జనుల హృదయాలలో ప్రవహిస్తూ తన అస్థిత్వాన్ని నిలుపుకుంటూ వస్తుంది హిందుత్వం. నేడీ కార్ల్ మార్క్స్ ఆరాధకులు హిందుత్వం అనాగరికం, సాంఘిక దురాచారాల సమ్మిళితం అంటూ(అమెరికా సంసృతి అంటే కేవలం మత్తు పధార్ధాలూ, విసృంఖల చర్యలు, విడాకులూ అని నిందిస్తే ఎలా ఉంటుంది?) వామపక్ష్యవాదులు మార్చిన చరిత్ర వల్లే మనకు 'లాభమ'ని నిర్ధారించి, సత్యాన్ని తగలబెట్టి, తిరిగి 'నిజాన్ని అన్వేషించటానికి ప్రయత్నిస్తున్నా'మంటారు.

చదువరి said...

హిందువులను అణగదొక్కే చర్యలు మధ్యయుగం నుండి ఇప్పటి దాకా జరుగుతూనే ఉన్నాయి. మధ్య యుగాల్లో తమకేం జరుగుతోందో ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలిసేది. తమ శక్తిమేరకు ఎదుర్కొన్నారు, హిందువులు. లేనప్పుడు అసహాయులై తలవంచారు. హైందవంలో ఉన్న అంతర్గత శక్తి దాన్ని నిలబెట్టింది.

కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం సూటిగా జరుగుతున్న దాడి కాదు. ఇదో కుట్ర. హైందవమ్మీద చేస్తున్న దొంగ దాడి. ఈ కుట్రదారుల చేతిలో కత్తులూ కఠార్లూ ఉండవు. రకరకాల వాదాలు ఇజాలూ ఉంటాయి. బైటనుంచి అప్పుతెచ్చుకున్న ఎంగిలి సిద్ధాంతాలుంటాయి. వాళ్ళ ద్రోహపూరిత మద్దతూ వీళ్ళకుంటుంది. మన చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఆచారాలను, మన చదువులనూ వ్యతిరేకిస్తూంటారు. మనవైనవన్నిటినీ విమర్శిస్తూ ప్రజల విశ్వాసాలను, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీయడమే వీళ్ళ లక్ష్యం!

ఈ మార్క్సేయులది మార్క్సువాదం. బైటవాడు చెప్పేదేదైనా వీళ్ళకి హేతుబద్ధంగానూ, మన పూర్వులు చెప్పేదేదైనా మౌఢ్యంగానూ కనిపిస్తుంది వీళ్ళకు. చరిత్రను తమకు తోచిన విధంగా రాసేసుకుపోతూంటారు. హైందవ వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వీళ్ళకు పడదు. మన సంస్కృతి అంటే మంట వీళ్ళకు.

ఇంకో రకం జనమున్నారు.. గతంలో తమను అణగదొక్కారనో మరోటో మనసులో పెట్టుకోని, ఆ కసితో ఇప్పుడు విమర్శిస్తూంటారు. పుస్తకాలు రాసేస్తూంటారు. పోలేరమ్మలు, పోచమ్మలు హిందూ దేవతలు కాదు, ఇప్పుడు హిందువులని చెప్పేవాళ్ళు అసలు హిందువులే కాదు పొమ్మంటూంటారు. హిందువులను చీల్చిపారేసి, వాళ్ళను పరాయి మతాల్లోకి చేర్పించి హిందూమతాన్ని బలహీనపరచాలనే కూహకం వీళ్ళది.

ఇహ దొంగ లౌకికవాదులు - అందరికంటే ప్రమాదకారులు వీళ్ళు. మధ్యయుగం నాటి ముస్లిము కిరాతకుల కంటే ప్రమాదకారులు వీళ్ళు. ఇతర మతాలను నెత్తికెత్తుకుని హిందూమతాన్ని అణగదొక్కడమే లౌకికవాదం అనేది వీళ్ళ భావన..

కొందరిలో ఈ మూడు రకాలూ కొలువై ఉంటాయి. ఇన్ని రకాల జనాల లక్ష్యం కూడా హిందూమతంపై విషంగక్కడమే. వీళ్ళ దౌష్ట్యాన్ని తట్టుకుని హైందవం ఎన్నాళ్ళు నిలబడుతుందో!

బ్లాగుల్లో కూడా ఈ మూడు రకాల జనాన్నీ చూడొచ్చు. సమాజంలో ఉన్నవన్నీ బ్లాగుల్లోనూ ఉంటాయి కాబట్టి అందులో ఆశ్చర్యమేమీ లేదులెండి.

Kathi Mahesh Kumar said...

@బృహఃస్పతి: పొద్దున వ్యాఖ్య రాసి వెళ్ళిన తరువాత నేను చెప్పిన అయోద్యకథ ఎక్కడిదా అని సందేహం వచ్చి కొన్ని తవ్వకాలు జరిపాను.

ఆ చరిత్ర RSS నడిపే శిశు మందిర్ లో చెప్పేది. వారి చరిత్ర ప్రకారం రాముడి కొడుకు కుశుడు అయోద్య రామ మందిరాన్ని నిర్మించాడు. గ్రీకుల దండయాత్ర సమయంలో (105 BC)మియాండర్ మొదటి సారిగా ఆ మందిరాన్ని కూల్చాడు. 308 AD లో చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ మందిరాన్ని పునర్నిర్మించాడు.ఆ తరువాత మొహమ్మద్ ఘజినీ బంధువు సలార్ మసూద్ ఈ మందిరాన్ని కొల్లగొట్టాడు....etc. etc. etc.

పైన చెప్పే వీరి చరిత్రకు ఆధారాలు లేవు. ఈ విషయం నేను కాదు, బీజేపీ చరిత్ర మార్చాలనుకున్నప్పుడు కొందరు చరిత్రకారులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన వ్యాసాల్లో చెప్పారు. బహుశా కొన్ని వేల మంది ఆ వ్యాసాల్ని చదివుంటారు. కాబట్టి నేను బ్లాగులో రాసిందానికి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడకండి. మీ మనసును ఆ వాక్యం కలిచివేసుంటే అది మీ సమస్యే అని గుర్తించండి.

రాధిక said...

మహేష్ గారూ నేను ఆర్ ఎస్ ఎస్ స్కూల్లోనే చదివాను.కానీ మీరు చెప్పిన ఈ కధ నాకెప్పుడూ ఎవరూ చెప్పలేదు.

నాగప్రసాద్ said...

చదువరి గారు, బాగా చెప్పారు.

Anonymous said...

అలాగే, "హిందువన్న ప్రతిదానిని" విమర్శించాలనుకోవటం కూడా మీ సమస్యే కాని జనాల సమస్య కాదు అని ఎందుకనుకోరు. ఒక్క సారి, ఒక్కసారంటే ఒక్కసారి, హిందు మతం/భావం/ భావజాలాలలో , మీకు నచ్చే ఒక్క ముక్క (ఏమన్నా పడి ఉండటం తప్ప) వ్రాయగలరేమో అలోచించండి. అప్పుడు అర్ధమవుంది, మీ భావాలు ఎంత కరడు (లాజిక్ కు అందనంత) కట్టుకుపోయి ఉన్నాయ్యో!!

నాగప్రసాద్ said...

@Anonymous: You hit right question. ఎంతసేపూ తప్పులు వెతకడమే తప్ప, అందులోని మంచిని గ్రహించలేకపోవడం నిజంగా సమస్యే!.

Kathi Mahesh Kumar said...

@రాధిక: ఈ వ్యాసం రొమిలా థాపర్ డిసెంబర్ 2001 లో రాశారు. సమాచారంకూడా అప్పటిదే ఉండొచ్చు. మీరప్పుడు స్కూల్లో (RSS శిశుమందిర్) ఉన్నారా?

Anonymous said...

"ఇన్ని రకాల జనాల లక్ష్యం కూడా హిందూమతంపై విషంగక్కడమే. వీళ్ళ దౌష్ట్యాన్ని తట్టుకుని హైందవం ఎన్నాళ్ళు నిలబడుతుందో! "
సరిగ్గా చెప్పారు చదువరి గారు కొందరికి విపరీతమైన ఆత్మన్యునతా భావమే, బ్లాగుల్లో వారి వాదాలకు పదును పెట్టుకుంటారు. వీరి ఉదెసంలో దళితులంతా క్రైస్తవులుగా మారి పోయారని అనుకుంటారు. కాని మన కెంద్ర మంత్రి పనబాక లక్ష్మి మొన్ననే తిరుపతి కి వెళింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీరు రాసేవన్ని ఎంత అబద్దాలో. ఇంకొక తమాషా ఎమిటంతే ఎవరైనా వారి తాతలను/ పూర్వీకులను గౌరవించు కుంటారు వీరిలా ఎవ్వరు ఉండరు. వీరికి వారి వాళ్ల పూర్వీకులు చలా తెలివిలేని వారని మరియు అమాయకులని అందువ లననే అగ్రవర్ణాల వారు అణగత్రొక్కారని అనుకుంటుంటారు. వీరు చదువు కొని చాల తెలుసు కున్నామనుకుంటున్నారు కాని వాల్ల తాతాలకు ఉన్నది వీరికి లేనిది కామన్సెన్స్. వీరు నిరంతరం blogs రాసుకుంటు వారేదో దళితోద్దారణ చెస్తున్నట్లు భావిస్తారు. వీరికి నిజంగా చిత్త శుద్ది ఉంటె ప్రభుత్వ హాస్టల్స్ లో వసతులను నెల కి ఒక 10ని తనిఖి చేసి వాటి స్థితిగతులను రాయలి. దానిని మెరుగు పరచటానికి వీరూ తిసుకున్న చర్యలను బ్లగులో తెలియ పరిస్తె చాలా బాగ ఉంటుంది. Hope he will start these kind of activities soon.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మహేష్ గారు ఘజినీ మహమ్మద్, అతని మూక చేసిన దాడులగురించి మీకు ఆధారాలు కావాలంటే గుజరాత్‌లో సోమనాథ్‌కి వెళ్లండి. మీరు వితండవాదం చెసే క్రమంలో మనపై దాడులుచేసిన వాళ్లని సమర్ధించేలా ఉన్నారు. ఒక్కసారి ఉత్తరభారతంలోని మసీదులను చూడండి అందులో ఎన్ని హిందూ ఆలయాలను ధ్వంసంచేసి కట్టారో తెలుస్తుంది. సగం ఎత్తువరకు హిందూ నిర్మాణశైలి అక్కడినుంచి పైన అర్ధచంద్రాకారపు గోపురాలు కట్టి, అక్కడి శిల్పాలని మెట్లుగా వాడారు.

Kathi Mahesh Kumar said...

@సుబ్రమణ్య చైతన్య: చరిత్ర సృజనకు ఒక ధృక్పధం ఉంటుంది. దానికి తగిన శాస్త్రీయత ఉంటుంది. దానికి లోబడిచేసిన ప్రతిపాదనల్ని అంగీకరించడంలో నాకు ఎటువంటి సమస్యా లేదు. కానీ పుక్కిటిపురాణాల్ని కేవలం "నమ్మకం" ఆధారంగా చరిత్ర అనుకోమంటే మాత్రం విభేధిస్తాను.

నేనొక టపాలో రాసినట్లు "చరిత్ర ఒక అభిప్రాయం కాదు. లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన ప్రతిపాదించే శాస్త్రీయ సూచన లేక సిద్ధాంతం. చరిత్ర "సృష్టిలో"చరిత్రకారుల పరిధి,వారి నేపధ్యం,వారికి లభించిన ఆధారాలు, వాటికి మద్ధత్తుగా చూపించగలిగే ప్రమాణాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. కేవలం ఆధారాలూ,ప్రమాణాలూ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, చరిత్రలో ఘటనలు జరిగిన చూచాయ తారీఖులు తప్ప వాటి నేపధ్యాలూ,వాటి ప్రభావానికి సంబంధించిన అంచనాలు ఉండేవికాదేమో. ప్రామాణికమైన నిజాలు, నమ్మదగిన కల్పనల సమాహరమే చరిత్ర కాబట్టి,దాన్ని మార్పేరాని శాస్త్రంగా అనుకోవడానికి వీల్లేదు. Pure sciences లో కూడా మునుపు ప్రతిపాదించిన సిద్ధాంతాలను కొత్త సమాచారంతో తిరగరాయడం జరుగుతుంది. అలాంటిది అంచనాలూ,ఆలోచనల ప్రాతిపదికన నిజాల నేపధ్యాల్ని ఆలోచించి రాసిన చరిత్ర "స్థిరం" లేక "పరమసత్యం" అనేది హాస్యాస్పదం. చరిత్రను చూసే సాంకేతిక ధృక్పధం అది కాదు.

చరిత్ర ఎప్పుడూ పునర్నిర్వచింపబడుతూ ఉండాలి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ప్రసాదించిన నైపుణ్యత ఆధారంగా, ఇప్పటికే లబ్యతలో ఉన్న ప్రమాణాలను పున:సమీక్షించి వాటి ప్రామాణికతను ప్రశ్నిస్తూ ఉండాలి. ఈ తార్కిక ఆధునిక ధృక్పధం లోబడిన రోజున, చరిత్ర అర్థరహితంగా తయారవుతుంది." అంతేతప్ప, చరిత్రను ఉటంకిస్తే నమ్మకాలు గాయపడ్డాయనుకునే సున్నిత మనస్కులకు నేనేం చెప్పగలను?

చదువరి said...

కత్తి మహేష్ కుమార్: చరిత్ర ఎలా ఉండాలో చెబుతున్నారు.. మీరేదో గందరగోళ పరిస్థితిలో పడ్డట్టుగా అనిపిస్తోంది.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీరు చెప్పిన దానిని ప్రాచీన భారతీయులు ఎంతో అద్భుతంగా చేసిచూపించారు. మనం ఏగుడికి వెళ్లినా, చారిత్రక ప్రదేశానికి వెళ్లినా అక్కడ కనిపించే శిలాశాసనాలే దానికి ఉదాహరణ. లభ్తలో ఉన్న ప్రమణాలు అన్నారు మరి భారతజాతి( ఇది కేవలం హిందువులు కాదు) చరిత్రలో ఎన్ని దండయాత్రలు జరిగాయో తెలియదా మీకు. ఔరంజేబు ఎన్ని కట్టడాలు( కొన్ని మతపరమైనవి మరికొన్ని మతానికి అతీతమైన కారయకలాపాలు సాగించేవి) ద్వంసం చేసాడొ మీరు చదవలేదా? మరి వీటిపై మీ అభిప్రాయం? మీకు సాక్ష్యాలు కావాలి అంటే మీరు ఉంటున్న భోపాల్‌కి దగ్గర్లోనే అనుకొంటా ఖజురహో ఉంది. ఒకసారి అక్కడికి వెళ్లి, మీకు దొరికిన సాక్ష్యాలను పరిసీలించి, మీ వ్యక్తిగత అభిప్రాయలను పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఒక టపా రాయండి. ఇక్కడ జరిగిన దాడుల్లో మనం కోల్పోయిన దానితో పోలిస్తే అయోధ్యలో జరిగింది చాలా తక్కువ. అయినా సగటుహిందువు ఆబాధ తెలిసినవాడు కనుక దానిని సమర్ధించలేదు. లేకుంటే గత 18యేళ్లలో ఇక్కడి రాజకీయ చిత్రపటం వేరేవిధంగా ఉండేది. బృహస్పతిగారు చెప్పినట్టు ప్రచార సాధనాలు పక్షపాతబుద్దిని చూపాయి అనడంలో సందేహంలేదు. కారణం అవి ఒక సగటుహిందువును తీవ్రవాదిగా పేర్కొన్నాయి. అయినా మీవంటివాళ్ల దృష్టిలో అది మసీదుకాదు పాడుబడ్డ భవనం మాత్రమే కదా. మీరు ఎందుకు ఇంతగా అలోచిస్తున్నారు.

Anonymous said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య,
మన దేవాలయల నిర్మాణనికి చాలా పెద్ద శాస్త్రియ విధానం ఉంది. నెను ఒకశారి లాండ్ మార్క్ లో ఒక పుస్త్కం చూసాను. దాని ఖరీదు చాల ఎక్కువ 2000రూపాయలు ఉంటుంది. ప్రతీ దేవాలయానికి గోపురం మీద ఉన్న కలిశాలలో ఆ దేవాలయాని కి సంబంధించిన వివరాలు ఉంచుతారు. అది ఇక్కడ రాసే బ్లగర్ల లో ఎంత మందీకి తెలుసో నాకు తేలియదు. దాని

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

దానిని స్థపత్యశాస్త్రం అంటారు. మనం ఇప్పుడు వాడుతున్న స్థాపితము అనే పదం దానినుంచే వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీషులో టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటున్నారు. అందులో ఉత్తరభారతదేశపు నిర్మాణశైలి, దక్షిణాదినిర్మాణశైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో జ్యామెట్ర్కి సంబంధించి అనేక విషయాలను వివరించి ఉంటారు.ఇంకా అనేక విషయాలు అందులో విపులంగా పొందుపరిచార్. చివరగా కొన్ని కేస్‌స్టడీస్ తంజావూరు, మధురై, కోణార్క్, ఖజురహో వంటి వాటీపై చివర్లో పేర్కొన్నారు. మీరు చెప్పేది బహుశా దాని గురించే అనుకొంటా.

Kathi Mahesh Kumar said...

@చదువరి:తికమక పడుతున్నది నేను కాదు. బృహస్పతి గారు. నేను చరిత్ర నేపధ్యంలో చెప్పిన ఒక వాక్యాన్ని మతం చర్చల్లోకి తీసుకొచ్చి నమ్మకాలతో తికమక పడుతున్నారు. ఒక వాక్యాన్ని out of context లో వాడితే ఇలాగే ఉంటుంది. మీరు నా పూర్తి టపా చదవండి.
http://parnashaala.blogspot.com/2009/07/blog-post_06.html

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: మీరు చేసిన contemporaray media analysis కూ నా టపాకూ,వ్యాఖ్యకూ ఏమైనా సంబంధం ఉందా? మరి why blame me for what media did?

బృహఃస్పతి said...

@మహేష్ గారూ, చివరిసారిగా మీకు ఒక వరుసక్రమంలో సంజాయిషీ ఇచ్చుకోవటానికి ప్రయత్నిస్తాను.
మీరు 'బాబ్రీ మసీదు స్థలం' అని పేర్కొనటమే ఒక వివాదం. స్వాతంత్ర్యానంతర కాలం నుంచీ రాముని పూజకే తప్ప ఇతర మత ప్రార్ధనలకు ఉపయోగింపబడని స్థలం వివాదాస్పద స్థలమే కానీ మసీదు కాజాలదు. కోర్టు కూడా దీన్ని వివాదాస్పద స్థలంగానే పరిగణించింది, సంభోదించింది. నిజమైన ముస్లిం కూడా హిందువుల మనోభావాలను అర్ధం చేసుకుని ఆ స్థలాన్ని నమాజు కొరకు ఉపయోగించటం 6 దశాబ్దాల క్రిందటనే మానివేసాడు. ఇక 'ఆధారహితచరిత్ర, అపాయకర చరిత్ర, భారతదేశ చరిత్రకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర' ఈ వ్యాఖ్య సైతం అభ్యంతరకరం. కారణం ఎలాగూ వ్యాసంలో వివరించాను, చరిత్రహీనులుగా ఉండవద్దని. ఇక మీరు చేసే హిందూ వ్యతిరేక వితండవాదాలకు ఊతమిచ్చే ప్రసార సాధనాలను ఉటంకిస్తూ వాటి మూల కారణాలను విశ్లేషించాను. ఈ వ్యాసానికి ముందు కూడా నేను అదే చెప్పాను 'సమూలంగా సమీక్షించుకుందాం' అని. ఇవేవీ మీరు కొత్తగా ప్రతిపాదించినవి కాదని నాకు తెలుసు. నా సమాధానం కూడా మీతో పాటు మీలా హిందుత్వాన్ని చులకన చేసే వారందరికీనూ. శ్రీకారానికి అవకాశాన్ని సృష్టించింది మాత్రం మీరే. 'నేను హిందుత్వాన్ని ఎక్కడ అవహేళన చేసా'నని మీరు ప్రశ్నించక ముందే వివరణ ఇస్తాను. పరాయి దేశస్థుడెవడో సరస్వతీ దేవిని గోమాంస బర్గరు పై కూర్చోబెడితే వాడి అజ్ఞానాన్ని క్షమించవచ్చు. మా అదృష్టం కొద్దీ మేమా దేశంలో లేం కాబట్టీ, వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు కాబట్టీ ఆ పోస్టరు చూడలేదు. అయితే మీ పుణ్యాన అది చూడని మా బోటి వారందరికీ అది చేరింది. చదువుకునే పుస్తకం పాదాన్ని తాకితేనే ఆ తల్లికి మనసులో క్షమాపణ చెప్పుకునే సగటు హిందువు మీ పోస్టర్ చూసి గాయపడతాడని మీకు తెలియదా? ఆ poster మీరు సృష్టించినది కాకపోవచ్చు. కానీ వార్తను చేరవేయటంలో మీరు జాగ్రత్త పాటించాలి(పై వ్యాఖ్యలో మాధవరావు గారు చెప్పినట్లు).

చట్టపరంగా కూడా మీరు చేసింది తప్పే.(రెండేళ్ళ క్రితం అనుకుంటాను. మహాత్ముని కించపరచిన యూ ట్యూబ్ వీడియో ని ప్రసారం చేసినందుకు NDTV నో మరేదో channel కోర్టు చేత చీవాట్లు తింది. మీరు చేసినది కూడా ఆ కోవలోనిదే. సాక్షి పేపరు సైతం క్రీస్తుని మద్యం గ్లాసు, సిగరెట్టుతో ముద్రించి మరునాడు క్షమాపణలు చెప్పుకుంది) అంచేత ఆ నాన్ వెజ్ దేవతల వార్తలో కూడా మీరు పోస్టర్ ముద్రించి ఉండకూడదు. మళ్ళీ విషయం ప్రక్క దోవ పడుతుందనుకునేరు? ఈ వ్యాసం అయోధ్య విషయంలో మీ టపాని ఖండించటానికి రాసినదే అయినా గత ఏడాదికాలంగా మీరు ప్రదర్శిస్తున్న హిందూ అవహేళనను భరిస్తూ వచ్చి ఈనాడు ప్రశ్నించ ఉద్దేశించినది. నా బ్లాగు నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటా, నచ్చనప్పుడు మీరేందుకు చూస్తారు అంటారా? మీరు కేవలం మతం పైననే కాక మరికొన్ని ఉపయోగకరమైన విషయాలు చేరవేస్తుంటారు గనుక, ఆ ఆశతో వచ్చి ఇలా గాయపడతాం. మిమ్మల్ని హిందువుల విశ్వాశాలను పాటించమనో, కనీసం గౌరవించమనో ప్రాధేయపడటంలేదు. కించపరచుకోవటం మానుకోమని మాత్రమే చెబుతున్నాం. కనీసం మీ బ్లాగు చదివే సగటు పాఠకుడు కోరుకున్నాడనుకోండి.

Anonymous said...

Bruhaspathi, you have rasied a good point here. మాంసాహారాన్ని భుజించే హిందువులకు గోమాంసంపై దేవిని ముద్రిస్తే తప్పేంటని చర్చించే మహేష్ నిజంగా నిభధ్ధత ఉన్నవాడైతే మందుగ్లాసు, సిగరెట్టుతో ఉన్న క్రీస్తు ఫోటోని ప్రచురించి, మద్యం, సిగరెట్టు సేవించటంలో అభ్యంతరం లేని క్రైస్తవులకు క్రీస్తు వాటితో కనిపిస్తే అభ్యంతరం ఎందుకని చర్చకు తెరలేపాలి. Common Mahesh, you can do that. Otherwise you better keep your blog for 'invites only' claiming for objectionable & explicit content.

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: నాదొక వితండవాదమైతే మీరు స్పందించడాలూ, సంజాయిషీలు చెప్పడాలూ అనవసరాలు. ఎందుకంటే nothing should actually matter to me.

"బాబ్రీమసీదు స్థలంలో" అని నేను అనడం వివాదమైతే "బాబ్రీమసీదు వివాదం" అనడంకూడా వివాదమే. Let's penalize entire nation for it.

హిందువుల్ని అవహేళన చెయ్యడమేమిటి? can you quantify your allegation!ఏ హిందువుల్ని? ఎంతమంది హిందువుల్ని? ఆ అవహేళన ప్రాతిపదిక ఏమిటి? మీ అవహేళన నిర్వచనమేమిటి? ఆ ఆపాదిత అవహేళన ఉద్దేశమేమిటి? అది ఏ context లో చెప్పబడింది?

హిందూవిశ్వాసాలనే monolithic మాయాజాలాన్ని చూపించకండి. నేను హిందువుని. నా బ్లాగులో చెప్పింది నా అభిప్రాయం. It has same value as your deliberate feeling of hurt.మీ టపా నన్నుద్దేశించింది కాబట్టి నేను బాధపడితే మీ అభిప్రాయాలు చెప్పడం మానేస్తారా? అలాగే నేనూ నా అభిప్రయాలు రాయడం మానను. కాబట్టి don't bring in such a trivial arguments to table.

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: మరోమాట. మీ మనోభావాల్ని మరింతగా గాయపర్చుకోవడానికి శనివారం రోజునాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చూడండి.

సగటు హిందువు మీ అంత బలహీనమైన గుండెగలవాడు కాదు అని చెప్పడానికి అక్కడ ఉదాహరణ దొరుకుతుంది.

Bhardwaj Velamakanni said...

Romila Thaper wrote her piece of crap in 2001.

Now this was what ASI had to say in 2003:


The Archaeological Survey of India (ASI) excavated the mosque site at the direction of the Allahabad Bench of the Uttar Pradesh High Court in 2003. The archaeologists reported evidence of a large 10th century structure similar to a Hindu temple having pre-existed the Babri Masjid. A team of 131 labourers including 29 Muslims - who were later on included on the objections of the Muslim side[citation needed] - was engaged in the excavations. In June 11, 2003 the ASI issued an interim report that only listed the findings of the period between May 22 and June 6, 2003. In August 2003 the ASI handed a 574-page report to the Lucknow Bench of the Allahabad High Court.
The ASI, who examined the site, issued a report of the findings of the period between May 22 and June 6, 2003. This report stated:
Among the structures listed in the report are several brick walls ‘in east-west orientation’, several ‘in north-south orientation’, ‘decorated coloured floor’, several ‘pillar bases’, and a ‘1.64-metre high decorated black stone pillar (broken) with yaksha figurines on four corners’ as well as "Arabic inscription of holy verses on stone" [5] Earlier reports by the ASI, based on earlier findings, also mention among other things a staircase and two black basalt columns ‘bearing fine decorative carvings with two crosslegged figures in bas-relief on a bloomed lotus with a peacock whose feathers are raised upwards’.
The ASI report of August 25, 2003 stated that there was evidence of a large Hindu temple having pre-existed the Babri mosque. The ASI report mentions a huge structure (11-12th century) on which a massive edifice, having a large pillared hall (or two halls), with at least three structural phases and three successive floors attached with it was constructed later on. The report also stated that "there is sufficient proof of existence of a massive and monumental structure having a minimum of 50 x 30 metre in north-south and east-west directions respectively just below the disputed structure". The ASI report of 2003 concluded that: "Viewing in totality and taking into account the archaeological evidence of a massive structure just below the disputed structure and evidence of continuity in structural phases from the tenth century onwards up to the construction of the disputed structure along with yield of stone and decorated bricks as well mutilated sculpture of divine couple...., fifty pillar bases in association of the huge structure, are indicative of remains which are distinctive features found associated with the temples of North India."

__________________________________


Now .. what next? :))

Anonymous said...

బృహస్పతిగారు

యే లాతోఁకా భూత్ హైఁ! బాతోఁసే నహీ సంఝేగా!!

దయచేసి మీ విలువైన సమయాన్ని మూర్ఖులకు కేటాయించకండి.

Expecting a meaningful dialogue with Mahesh is like expecting beauty in a male chimpanzee. Please don't do it.

-- యోగి

Bhardwaj Velamakanni said...

History has been abused most by the Leftist Jokers and they painted it Red. When the rightist jokers entered, the color faded and became Safforn!

The nest way to read history is to scrap it from the text books! Dont include anything that does not have any scientific proof. If it is a must to include it then add a caveat "In the Opinion of Romila Thapar" or "In the Opinion of "Praveen Togadia" - But dont project an opinion as the truth and a non scientific stuff as scientific!

Anonymous said...

ee kattigadiki burada challadam tappa vere pani ledu. lets