సంస్కృతి - ఆవశ్యకత



త్యాన్ని గ్రహించటానికి కుల, మత, జాతి, వర్ణ వంటి దేశ, సంస్కృతులను దాటి ఆలోచించాలి. స్వవ్యక్తిత్వాలకు అతీతమైనవి గ్రహించగలిగినప్పుడే స్థాన, కాల పరిస్థితులతో నిమిత్తం లేని సత్యం బోధపడుతుంది. అయితే అంతమాత్రాన ఆధ్యాత్మికతను గుర్తించటంలో సంస్కృతి ప్రాధాన్యత లేదని కాదు. మానవీయ కోణంలో చరిత్రను గమనిస్తే ఆధ్యాత్మిక అనుభవం పొందిన పురుషులు గానీ, స్త్రీలు గానీ అన్ని సంస్కృతుల నుంచీ సమానంగా రాలేదు. దీనివల్ల ఆధ్యాత్మికతను పొందటంలో అంతర్లీనంగా దాగున్న సంస్కృతి ప్రభావం కనపడుతుంది. మన దేశ సంస్కృతిలో ఆధ్యాత్మికతను నిలబెట్టటంలో వేదకాలం నుండీ నేటి వరకు ఒక వర్గం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేదకాలం నుండీ ఈ శకానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవాది జిడ్డు కృష్ణమూర్తి వరకూ కూడా వీరందరూ బ్రాహ్మణ కులానికే చెందటం ఏ మాత్రం యాదృచ్చికం కాదు (పాఠకులకి ఒక చిన్నవివరణ: నేను బ్రాహ్మణుణ్ణి కాదు).

యూరోపియన్, ఇస్లాం సంస్కృతలలో ఈ విధమైన ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తులు చాలా తక్కువగా ఉండటానికి కారణం సంస్కృతియే. ఆయా సంస్కృతులు, మతాలూ ఇప్పటికినీ ప్రభువు బిడ్డయనో, చివరి ప్రవక్త యనో అవ్యక్తంగా కొందరికి స్థానాలను కట్టబెట్టటం ద్వారా మిగిలిన వారికి స్వతంత్ర్యంగా ఆధ్యాత్మికానుభవం పొందే అవకాశాలను నిర్వీర్యం చేసాయి. అదృష్టవశాత్తూ హిందుత్వానికి ఈ బెడద లేదు. మన భారతీయ సంస్కృతిలో సత్యం ఈ విధంగా కేవలం ఒక్క కోణంలోనే చూడబడలేదు. ఎంతో మంది ఆధ్యాత్మికవాదులు స్వేఛ్ఛగా, స్వతంత్ర్యంగా పూర్వుల ప్రభావం తమపై పడకుండా సత్యశోధన చేయగల ఆస్కారం కల్పించబడింది. మిగిలిన సంస్కృతులలో, మతాలలో గతంలో పుట్టిన ఓ మానవుని దైవ ప్రాతిపదికను ప్రాధమీకరించి సత్యశోధనను ఆ వ్యక్తి ద్వారా ప్రకటించగా, హిందుత్వం ఆత్మ స్పృహను ఆశ్రయించింది. పూర్వులు గొప్పవారే కావచ్చును. అంత మాత్రాన వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ తత్సమానులైన వ్యక్తులు పుట్టబోరనటం మనలను మనం తక్కువ చేసుకోవటమే. మానవుని సమర్ధతను ఈ విధంగా తక్కువ అంచనా వేయటం తగదు.

బౌధ్ధ సంస్కృతిని తరచి చూసినా హిందువులలో ఉన్నంతమంది ఆధ్యాత్మికవాదులు కనపడరు. కారణం బౌధ్ధంలో సైతం హిందుత్వంలో నున్నంత ఆత్మ స్పృహ లేక ఎక్కువగా practicalityని పొందినది. వీటిని బట్టి ఆధ్యాత్మికతను అందించటంలో సంస్కృతి పాత్రను కొట్టిపారేయలేం. నేడు హిందూ సంస్కృతి అంటే అధిక జనాభా, అపరిశుభ్రత, కుల వర్గ విచక్షణ వంటి సామాజిక సమస్యలు కనిపించవచ్చుగాక! అయితే ఇవి హిందుత్వ గొప్పతనాన్ని కప్పివేయకూడదు. అంతకు మించి ఈ సమస్యలు భావితారాలకు హిందుత్వ మహోన్నత విలువలను అందించటంలో ఆటంకాలు కాకూడదు (దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది).

గత వందేళ్ళ కాలంలో చూసినా - రామకృష్ణ, వివేకానందుడు, రామ తీర్థుడు, అరబిందో, రమణ మహర్షి, మాతా ఆనందమయి, స్వామీ శివానంద, నీమ్ కరోలీ బాబా, స్వామీ నిత్యానంద వంటి ఎందరో ప్రముఖ ఆధ్యాత్మిక వాదులను భారత దేశం అందించింది. వీరెవరూ మత సంస్థలద్వారానో, మరే విధంగానో తయారు చేయబడలేదు. వీరంతా స్వతంత్ర్యంగా ఆత్మానుభూతిని పొందినవారే. (జిడ్డు కృష్ణ మూర్తి అనిబీసెంటు సంరక్షణలో సంస్థ ద్వారా శిక్షణ పొందటం వలన ఇక్కడ పేర్కొనలేదు). పశ్చిమ, ఇస్లామిక దేశాలను, బౌధ్ధాన్ని చూస్తే కొద్దో గొప్పో ఉనికి చాటుకున్న ఆధ్యాత్మిక వాదులు మత సంస్థల ద్వారా వచ్చినవారే.

ఈ విదేశీ సంస్కృతులలో స్వఛ్ఛందంగా, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతను సంపాదించటం క్లిష్టతరం కావటం వల్ల అటువంటి వ్యక్తులు మృగ్యం. ఈ రకమైన ఆధ్యాత్మికవాదులను పళ్ళగా భావిస్తే సంస్కృతిని ఆ ఫలవృక్షాలనందించిన భూమాతగా గుర్తించవచ్చు.

అయితే పశ్చిమ దేశాలకు వెళ్ళిన హిందూ యోగా గురువులు తమతో అతి తక్కువ పరిమాణంలో హిందుత్వాన్ని తీసుకు వెళుతున్నారు. వీరు మన సంస్కృతిని విదేశీయుల వద్ద నిజాయితీగా ప్రదర్శించటానికి సంకోచించారు. విగ్రహారాధన వంటి హిందుత్వ ఆచారాలు ప్రశ్నింపబడతాయన్న అనుమానంతో యోగా, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత కల్పించి విదేశీయులకు ఈ యోగా, ధ్యానం వంటి హిందుత్వ పధ్ధతులతో పాటుగా తమ తమ మతాలను ఆచరించుకునే వెసలుబాటు కల్పించారు.

విగ్రహారాధన, హిందూ అర్చన, పూజ పునస్కారాలు వంటివి చాలా వరకు అపార్ధం చేసుకోబడుతున్నాయి. యోగాని నిష్టతో ఆచరించే హిందువేతరులు, విదేశీయులు కనీసం హిందూ దేవాలయాల లోనికి అడుగు పెట్టి కూడా ఉండరు. ఒక వేళ వెళ్ళినా ఆసక్తి తో తక్కితే మూలాన్ని గ్రహించే అధ్యయనం చేయరు. హిందుత్వం అందించిన అనేక ఫలాలు ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం వంటివి ఇప్పుడిప్పుడే వెలుగు సంతరించుకుంటున్నాయి. సంస్కృత కావ్యాలూ, హిందూ సంగీత సాహిత్యాలూ, నృత్య రీతులు, భంగిమలూ ఇలా అన్నింటి వెనుకనా నిగూఢంగా ఉన్న వేద ఉపనిషత్తుల ప్రభావాన్ని గుర్తించండి. మన సంస్కృతిలో ప్రతీ రంగంలో నున్న ఆధారతత్వాన్ని గమనించండి.

ఆదునిక హిందువు తన సంస్కృతి పట్ల, ఆలయాల పట్ల, ఆచారాల పట్ల, వేద పారాయణం, పండుగల నిర్వహణల పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. వేద సారాంసాన్ని ఆరాధించే ఆదునిక హిందువు సైతం ఈ తరహా సంస్కృతులను సన్యసించిన జిడ్డు కృష్ణ మూర్తి, రజనీష్ వంటి ఆధ్యాత్మిక వాదుల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు తప్పితే సంస్కృతిని పరిరక్షిస్తున్న వారిని కాదు. ఈ ఆధునిక హిందువు పాశ్చాత్య సంస్కృతి సౌకర్యాలకు అలవాటుపడి హిందు సంస్కృతిలోని అంతఃసౌందర్యాన్ని విస్మరిస్తున్నారు. ఆధునిక హిందువులకు ఓ విజ్ఞప్తి: ఆధ్యాత్మికతనూ సంస్కృతినీ వేరు చేసి చూడవద్దు. ఆధ్యాత్మికత రాముడైతే సంస్కృతి సీత. రాముని లక్ష్య సాధనలో సీత రక్షింపబడాలి. అత్యున్నత వేదసారాంశాన్ని అవపోసాన పట్టటమొక్కటే చాలదు. సంస్కృతిని కూడా పరిరక్షించుకున్నప్పుడే పరిపూర్ణత సిధ్ధిస్తుంది.

మిగిలిన దేశాలలో, సంస్కృతులలో తాత్వికులూ, ఆధ్యాత్మికవాదులు లేకపోలేదు. అయితే సరియైన సంస్కృతి లేకనే హిందుత్వం అందించినటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికవాదులు అక్కడ వెలుగులోనికి రాలేకపోయారు. మిగిలిన ప్రపంచ సంస్కృతులలో ఆధ్యాత్మికత ఎడారిలో ఎండమావిలాంటింది. హిందువు ఆధ్యాత్మికతనూ, సంస్కృతినీ వేరు చేయటం మానాలి. నిశితంగా గమనించి చూడండి. మన సంస్కృతిలోని భక్తి తత్వం, విగ్రహారాధన వంటివి ఆధ్యాత్మికతతో ఏమాత్రం విభేదించటంలేదు. నిజానికి ఈ తరహా సంస్కృతియే ఆధ్యాత్మికతను సముపార్జించటంలో దోహదపడుతుంది. యోగాభ్యాసాలను కూడా ఈ విధమైన సంస్కృతి నుండి వేరు చేయవద్దు. అంత మాత్రాన యోగా శిక్షణలో భక్తి తత్వాన్ని చొప్పించమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. భక్తి కూడా ఒక విధమైన యోగా అని తెలుసుకోండి. దీనిని తెలియజెప్పటం ద్వారా యోగా సిధ్ధాంతాలు మన సంస్కృతిని నిలబెట్టేందుకు సహాయపడగలవు.

ఆధ్యాత్మికపరంగా పరిణితి సాధించిన వారికి సంస్కృతి ఒక భ్రమ కావచ్చును. అయితే వారు ప్రపంచావసరాలను కూడా గుర్తెరిగి మసలుకోవాలి. ఆధ్యాత్మికత కంటే సంస్కృతి త్వరగా విస్తరిస్తుంది. ఆధ్యాత్మికత పురుషుడైతే సంస్కృతి ప్రకృతి. వ్యక్తి వ్యక్తికీ ఆధ్యాత్మికతలోని లక్ష్యం, చూసే ధృక్పధం మారవచ్చును. కానీ సంస్కృతి ఈ లక్ష్యాన్ని అందరూ ఒకే కోణంలో చూసేందుకు ఉపయోగపడుతుంది. సంస్కృతి అవసరం లేకుండా ఆధ్యాత్మికతను పొందటం కష్టతరమైన కార్యం. సంస్కృతి - కళాలూ, తత్వాలూ, శాస్త్రాలూ వంటి అనేక రూపాల్లో మానసిక వికాసానికి తోడ్పడి ఆధ్యాత్మికతకు దారి తీస్తుంది.


వ్యక్తిగత ఆధ్యాత్మికత నిట్టనిలువుగా ప్రయాణించే సరళరేఖ ఐతే, సంస్కృతి కొంత దూరం అడ్డంగా ప్రయాణించి తర్వాత నిలువుగా సాగుతుంది. ఈ రెంటి పరమార్ధం ఒక్కటే. స్థాన, కాలాలను బట్టి సంస్కృతులను కొంత మేరకు దిద్దుకోవటంలో తప్పులేదు. కానీ ఈ దిద్దుబాటు సంస్కృతిని కలుషితం చేసేది కాకూడదు. సంస్కృతి దాచుకునేది కాదు. క్రైస్తవం, ఇస్లాం మతాల తాకిడితో భారత దేశంలోనే హిందుత్వం ఆత్మ రక్షణలో పడింది. ఈ ఆపద నుండి బయటపడి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటుకునే పరిస్థితి రావాలి. సహజంగానే హిందుత్వ ప్రకాశానికి, ప్రచారానికి ఈ ఇతర సంస్కృతులనుండి అవరోధాలేర్పడతాయి. ఈ పోటీలో ఆత్మ రక్షణ ఒక్కటే చాలదు. ధృఢ సంకల్పంతో మన సంస్కృతి విలువలను వినిపించగలగాలి. ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయంగా భావించవద్దు. విలువలకు సంబంధించినదని గుర్తెరగండి.

మనలో కూడా చాలా మంది హిందూ సంస్కృతి అనే కంటే భారతీయ సంస్కృతి అని పిలవటానికి ఇష్టపడతారు. వీరి దృష్టిలో 'హిందూ' అన్నది మతానికి సంబంధించినది. భారతీయత అన్నది విభిన్న మతాలకు, సంస్కృతులకూ సంబంధించినది. అయితే మన దేశ మూలాలు హిందుత్వంతోనూ, సంస్కృతంతోనూ ముడిపడి ఉన్నవి. ఇతర మతాలయిన బౌధ్ధ, జైన, సిక్కులతో పాటూ, కొంత మేరకు క్రైస్తవం, ఇస్లాం కూడా మన దేశంలో విస్తరించాక ఈ సంస్కృతిని వంటబట్టించుకున్నవే.

మన సంగీతం 'హిందుస్తానీ' లోని వ్యక్తీకరణ, అంతరార్ధాలూ సామ వేదానికి సంబందించినవి. మన నృత్యం హిందూ దేవాలయాల భంగిమలకు సంబంధించినది. మన ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రాలు సైతం వేదాల నుండి వేళ్ళూనుకున్నవే. హిందూ కావ్యాలూ, కవిత్వాలూ, నాటకాలూ, హిందూ పురాణాల చుట్టూ పరిభ్రమిస్తాయి. యోగాభ్యాసాలతో నిండిన హఠయోగం సైతం మతపరమైన ఆచార వ్యవహారాల సాధనల నుండి పుట్టినదే. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయషోయ్?" అన్నది ఒక అజ్ఞాని వెటకారమే కావచ్చును. కానీ అది మానవ లక్ష్యసాధనకు సంబంధించినంత వరకు విస్పష్ట సత్యం.

హిందుత్వంపై ఇతర సంస్కృతుల ప్రభావం లేదు. కానీ క్రైస్తవం పై అంతకు ముందరి గ్రీకు రోమన్ల ప్రభావం, ఇస్లాం పై క్రైస్తవ ప్రభావం గమనార్హం.
దురదృష్ట వశాత్తూ ఆధునిక హిందువు పశ్చిమ దేశ సంస్కృతి మోజులో పడి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు. ఇది కేవలం మన భారత దేశానికే కాక ప్రపంచమంతటికీ నష్ట దాయకం. ప్రపంచంలో మందిని ప్రభావితం చేయగల మేధావులకు కొదువ లేదు. వీరి రాజకీయ పరమైన విశ్లేషణలు సగటు మానవుని భావోద్వేగాలను సొమ్ము చేసుకుని సత్యాన్ని దూరం చేస్తున్నాయి. నేటి తరంలో షేక్సిపియరు ఎందరికి తెలుసు? ఎందరికి కాళిదాసు, భక్తృహరులు తెలుసు? వీరు షేక్సిపయరు కంటే ఎందుకు హీనంగా చూడబడుతున్నారు? ఇంగ్లాండులో షేక్సిపియరు ఉత్సవాలు జాతర్ల మాదిరిగా జరుగుతాయి. మనమెందుకు కాళిదాసుని ఆ విధంగా నెత్తిన ఎత్తుకోలేకపోతున్నాం?

హిందువెందుకు పశ్చిమ దేశాల విద్యా వ్యవస్థని అనుసరించాల్సి వస్తోంది? ఎందుకు మార్క్స్, లెనిన్ వంటి వారి దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూడవలసి వస్తోంది? ఎందుకు మనకున్న ఆది శంకరాచార్యుని మొదలు అరబిందో వరకు ఉన్న వారివంక దృష్టి సారించలేకపోతున్నాం? మన సంస్కృతి అన్ని దేశాలూ నేర్చుకుని లాభపడేందుకే కాని విషతుల్యం చేసేది కాదు కదా. మరి మన విజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు ఎందుకు విదేశీయులు రాలేకపోతున్నారు? ఇందుకు హిందువే ముందడుగు వేయనపుడు విదేశీయులనాశించటం అత్యాశయే అవుతుంది. వీటన్నిటికీ సమాధానంగా నిబధ్ధతతో హిందుత్వాన్ని ఆచరించండి. ఒక దేశ సంస్కృతిగా కాక ప్రపంచ సంస్కృతిగా భావించండి. తెలియని వారికి హృదయం నుండి వివరించండి. వారికి ఒక గొప్ప బహుమతినిచ్చిన వారవుతారు. దీని కోసం కంప్యూటర్లనీ, విజ్ఞానాన్ని త్యజించనవసరం లేదు. నేర్చుకునే వయసులోనున్న మీ పిల్లలకు కనీసం వేసవి శెలవులలో హిందూ సాంస్కృతిక విద్యనందించంఢి.

నేటి ప్రపంచంలో నిజమైన సంస్కృతి దాదాపు అంతరించే స్థితికి దాపురించింది. ప్రపంచదేశాల మధ్య దూరం తగ్గి ఆ దూరాన్ని తగ్గించిన పాశ్చాత్య సంస్కృతి అంతటా విస్తరించి వేళ్ళూనుతోంది. నిజానికి ప్రపంచంలోని ఈ సంస్కృతి లేమి, శూన్యత హిందుత్వానికి ముందడుగు వేసేందుకొక గొప్ప అవకాశం. దీనిని వినియోగించండి.

అయితే అంతకు ముందు నిద్దరోతున్న హిందుత్వ ఆత్మ మేల్కొనాలి. లక్ష్య సాధనకు ఉద్యమించాలి. ఈ శతాబ్దం ఈ విధమైన మేల్కొలుపునకు కీలకమైనది.

Its like Now or Never...

38 comments:

Praveen Mandangi said...

హిందూ సంస్కృతి ఏమి గొప్ప? స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టించడం లాంటి ఆటవిక ఆచారాలని హిందూ మతం పోషించింది. http://vasavya.blogspot.com/2009/07/2.html

Kathi Mahesh Kumar said...

మీరు చాలా confusion లో ఉన్నట్లున్నారు. Theosophy - religion - culture మధ్యన కొన్ని intersection బిందువులు ఉన్నా, అవి స్వతంత్ర్యప్రతిపత్తిని కలిగి ఉంటాయి.

మీరు చెప్పిన ఆద్యాత్మిక వాదుల్లో సగానికిపైగా మతాన్ని ఎండగట్టినవాళ్ళే. ఉన్న సాంస్కృతిక మూసల్ని ప్రశ్నించి కొత్త సాంప్రదాయాల్ని ప్రతిపాదించినవాళ్ళే.

బౌద్ధమతం మొత్తంగా ఆధ్యాత్మిక వాదుల మతం. నిజానికి అది మతంకాదు. అదొక ఆధ్యాత్మిక మార్గం. ఇస్లాం,క్రైస్తవాలలో మీకు తెలీనంత మాత్రానా తత్వవేత్తలు,వేదాంతులూ లేరని నిర్ణయించేస్తే ఎట్లా? Modern philosophical,theosophical traditions have a European base.కనీసం కొంత basic విషయాల్ని తెలుసుకోండి. ఆ తరువాత హిందుత్వం డంకా బజాయించండి.

బృహఃస్పతి said...

@Mahesh:

మీరు చాలా confusion లో ఉన్నట్లున్నారు.
No comments..

Theosophy - religion - culture మధ్యన కొన్ని intersection బిందువులు ఉన్నా, అవి స్వతంత్ర్యప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
అవును స్వంతత్ర్య ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి. కానీ వీటిని వేరుగా కంటే కలిపి చూస్తేనే సంస్కృతి అభివృధ్ధి చెందుతౌందని నేను చెప్పదలిచాను.

మీరు చెప్పిన ఆద్యాత్మిక వాదుల్లో సగానికిపైగా మతాన్ని ఎండగట్టినవాళ్ళే. ఉన్న సాంస్కృతిక మూసల్ని ప్రశ్నించి కొత్త సాంప్రదాయాల్ని ప్రతిపాదించినవాళ్ళే.

నేను పాక్షికంగా అంగీకరిస్తున్నాను. వీళ్ళు మతాన్ని త్యజించినవాళ్ళు. ఎండగట్టి ప్రశ్నించిన వాళ్ళు కాదు. నా వ్యాసంలో నేనెక్కడా నేనుదహరించిన మహాత్ములు సంస్కృతిని కాపేడే యత్నం చేసారని రాయలేదు. వీరు స్వతంత్ర్యంగానే ఆధ్యాత్మికతను సాధించారని, అయితే అది అందరికీ సాధ్యం కాదు కనుక సంస్కృతి ద్వారా పొందమని చెప్పాను. నిలువు గీత, అడ్డగీత చెప్పేదదే.

బౌద్ధమతం మొత్తంగా ఆధ్యాత్మిక వాదుల మతం. నిజానికి అది మతంకాదు. అదొక ఆధ్యాత్మిక మార్గం.

మీకు బౌధ్ధ మత సంఘ జీవన సిధ్ధాంతాలు తెలియనట్లుంది. మీరు చెప్పిన బౌధ్ధ ఆధ్యాత్మికత కేవలం బౌధ్ధ మత గురువులకు సంబంధించింది. సామాన్య మానవునికి బౌధ్ధం ఏం చెప్పిందో ఒకసారి చదవండి.

ఇస్లాం,క్రైస్తవాలలో మీకు తెలీనంత మాత్రానా తత్వవేత్తలు,వేదాంతులూ లేరని నిర్ణయించేస్తే ఎట్లా?
ఆయా మత సంస్కృతులు ఆధ్యాత్మికతను ప్ఱొత్సహించవని చెప్పాను. అందుకే ప్రాముఖ్యతనొందిన ఆధ్యాత్మికవాదులక్కడ లేరని చెప్పాను. మీకు తెలిసిన ఇతర మత ఆధ్యాత్మికవాదులను పరిచయం చేయండి. తెలుసుకుంటాను.

Modern philosophical,theosophical traditions have a European base.

What ever you are trying to convey as a Europian philosphy is treated as a meterialistic philosophy but not spiritual.

కనీసం కొంత basic విషయాల్ని తెలుసుకోండి. ఆ తరువాత హిందుత్వం డంకా బజాయించండి.
No comments please...:)

మహేష్ మొత్తానికి మీరు నేను చెప్పని వాటిని మీ మేధస్సు ద్వారా చెప్పానని నమ్మించి భలే self defenseలో పడేస్తారండి.. :)

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2009/08/blog-post_02.html

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మతం అనేది సంస్కృతిలో భాగం. కానీ సంస్కితీ, మతమూ ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తాయి. ఎంతగా అంటే వాటిమధ్య విభజనరేఖ గీయడం ఒకదశలో హాస్యాస్పదమవుతుంది. ఆధ్యాత్మికతకి మతం లేదని వాదించేవారిని కాసేపు అంగీకరించినప్పటికీ, ఆధ్యాత్మిక, తాత్త్విక చింతనలు చింతనలుగా మిగిలిపోకుండా కాలక్రమంలో మతాలుగా మారతాయని మరువరాదు. ఆలోచనని ఆశ్రయించుకొని ఆచరణ ఉంటుంది కనుక ఆ ఆలోచనలే ఆ తరువాతి కాలంలో కర్మకాండగా కూడా రూపు దాలుస్తాయి. కనుక సంస్కృతికీ, మతానికీ ఏవిధంగానైతే విభజనరేఖ గీయలేమో అలాగే మతానికీ, తాత్త్విక చింతనకీ కూడా విభజనరేఖ గీయలేం.

ఇహపోతే తాత్త్వికత ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడారనే ఆరోపణ. హిందూవైదికమతంలో బ్రాహ్మణేతర గురువులూ, భక్తులూ, తాత్త్వికులూ ఉన్నప్పటికీ బ్రాహ్మణ గురువులతో పోలిస్తే చారిత్రికంగా వారి సంఖ్య చాలా చాలా తక్కువ. దీనిక్కారణం బ్రాహ్మణ- అబ్రాహ్మణ కుటుంబాల మధ్య అనాదిగా గృహసంస్కృతిలో ఉన్న ప్రాథమికమైన వ్యత్యాసం అని నేను అంగీకరిస్తాను. చారిత్రికంగా వాస్తవమైన విషయాల్ని గణాంకాల్ని నిర్మమంగా అంగీకరిస్తే మనకి పోయిందేమీ లేదు, అందులోంచి politially correct conclusions లాగాలని, ఎవరి మీదనో బురద జల్లాలనీ వృథా కుటిలప్రయత్నం చెయ్యకుండా ! అయితే హిందువులందరికీ బ్రాహ్మణుల కుటుంబసంస్కృతిని అలవాటు చెయ్యడం ద్వారా ఈ అంతరాన్ని గణనీయంగా పూడ్చవచ్చు. బహుశా అది సహజంగా నెమ్మదిగా జరిగి ఉండేదేమో, ఇంగ్లీషువాళ్ళు ఈ దేశానికి రాకపోయుంటే !

తాత్త్వికతని ఒక మతానికి పరిమితం చేశారనే ఆరోపణ విషయానికొస్తే - ఈ దేశంలో భగవంతుడు అవతరించినన్నిసార్లు ఏ దేశంలోను అవతరించి ఉండలేదు. అలాగే ఇతరదేశాలవారు ఒక మతాన్ని పుచ్చుకుని ఆ తరువాత దాన్ని మర్చిపోతారు. అందుచేత భారతదేశంలో మాదిరి ఆ దేశాల్లో మహాత్ములు విరివిగా జన్మించినట్లు కనిపించదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ ప్రవక్త, ఆయన ప్రత్యక్షశిష్యులూ అంతవరకే. ఎన్నిసార్లు చూపించినా ఆ పవిత్రగ్రంథం ఒక్కటే చూపిస్తారు. కనుక ఈ దేశం, ఈ హిందూధర్మం మిక్కిలి ధారాళమైన ఉత్పాదకత కలిగిన అఖండ తాత్త్విక చింతనాధార అనడంలో సందేహం లేదు.

Kathi Mahesh Kumar said...

సంస్కృతి సమూహాల జీవన విధానానికి సంబంధించింది. మతం నమ్మకానికి,కొన్ని నిర్ధిష్టమైన సాంప్రదాయాలకీ సంబంధించింది. ఈ విధంగా చూసినా మతం పరిధి సంకుచితం.

ఒకే మతానికి చెందినా ప్రతి హిందూ కులానికీ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఆ జీవన సంస్కృతిలోని భిన్నత్వాన్ని కాదని ఏకమతమూసలోకి పోయాలనుకోవడమే ఇన్ని ఘర్షణలకి కారణం.ముఖ్యంగా ఆ మూస కొన్ని వర్గాల సంస్కృతిని "ఉన్నతం"గా అనుకొని సాగడమే సమస్యకు మూలం.

బ్రాహ్మణేతర తత్వానికి ప్రాధాన్యత ఇవ్వని సంస్కృతిమూలంగా కేవలం బ్రాహ్మణ గురువులు చెప్పుకోవడానికి మిగిలినంతమాత్రానా, తత్వశాస్త్రమంతా ఒకే కులం వాళ్ళ సొత్తు అనే వాదనా సరైనదికాదు. పైగా,ఆ తత్వవేత్తలు బ్రాహ్మణులు గనక (వారి గృహ సంస్కృతిలో ఆ లక్షణాలు అలవడ్డాయిగనక) అలాంటి ఆలోచనలు చెయ్యగలిగారు అనే వివరణ మరింతగా బ్రాహ్మణేతర తత్వాలకిచ్చిన (ఇవ్వని) ప్రాముఖ్యతని తెలియజెప్పుతుంది.

ప్రస్తుతం చెప్పుకోవడానికి బ్రాహ్మణేతర తత్వవేత్త ‘వేమన’ మాత్రమే మిగలడం ఈ చారిత్రక omission కి ఒక ఉదాహరణ మాత్రమే. కాకపోతే ప్రపంచం మొత్తంగా తీసుకుంటే సీక్రటీస్ నుంచీ రస్సెల్స్ వరకూ తత్వవేత్తలు కోకొల్లలు. సంఖ్యాపరంగా తీసుకున్నా they out do our numbers. కాకపోతే ఈ తత్వాలు పాడుకుని వాటికి మతం రంగుపులమడంలో మన భారతీయులు దిట్ట. కాబట్టి అవి మతాలుగా లేక cult లుగా మారిపోతాయి. సాయిబాబా(లు) దానికి ఒక గొప్ప ఉదాహరణ.

బృహఃస్పతి said...

మహేష్,

ఇక్కడ ప్రాధమిక అవగాహనలోనే లోపం ఉంది. నేను హిందుత్వాన్ని సంస్కృతిగా అభివర్ణిస్తుంటే మీరు మత ప్రాతిపదిక తెస్తున్నారు. దయచేసి నేను చెప్పదలుచుకున్నది నా భావనలోనే చదవండి. ఈ విషయంలో ప్రవీణ్ కాస్తా నయం అనిపించింది. విభేదించినా తను నా హిందూ సంస్కృతి ప్రతిపాదనను అర్ధం చేసుకున్నాడు (ప్రవీణ్ కామెంట్ చదవండి).

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: ప్రాధమిక అవగాహనా లొపం నాది కాదు. కలగాపులగంగా సరైన ప్రాతిపదిక లేకుండా సాగిన మీ వ్యాసానిది.

రవి said...

మీరు చెప్పదల్చుకున్నది చాలా చక్కగా చెప్పారు. కాకపోతే, ఎంత నిజాయితీతో చెప్పినా, ఇలాంటి విషయాలు వాదనలకు దారి తీయక తప్పవేమో. దీనికి, నా వరకు తోచిన కారణం - సంస్కృతి లక్ష్యమూ, ప్రాధాన్యతా ఆధ్యాత్మికతను చాటి చెప్పటానికే అయినా, ఇవి విస్తృతవ్యాప్తి చెందే సరికి ఆధ్యాత్మికత అన్నది సంస్కృతి వలనే సాధ్యం అన్న అనుకోలు బలంగా వేళ్ళూనుకోవడం.

"బౌధ్ధ సంస్కృతిని తరచి చూసినా హిందువులలో ఉన్నంతమంది ఆధ్యాత్మికవాదులు కనపడరు."

పొరబాటేమో. బౌద్ధం భారతదేశంనుండి శతాబ్దాల క్రితమే తరలి పోవడం వల్ల మీరు ఈ భావనకు వచ్చారేమో. అయితే బౌద్ధం ప్రేరణగా "ఆధ్యాత్మికత" ను సాధించిన యోగులు లేకపోరు అని (నా దగ్గర ఋజువులు లేవు) నా ఊహ. (భర్తృహరి బౌద్ధం ఆచరించాడని ఒక వాదన)

"ఆదునిక హిందువు తన సంస్కృతి పట్ల, ఆలయాల పట్ల, ఆచారాల పట్ల, వేద పారాయణం, పండుగల నిర్వహణల పట్ల న్యూనతా భావంతో ఉన్నాడు. వేద సారాంసాన్ని ఆరాధించే ఆదునిక హిందువు సైతం ఈ తరహా సంస్కృతులను సన్యసించిన జిడ్డు కృష్ణ మూర్తి, రజనీష్ వంటి ఆధ్యాత్మిక వాదుల ననుసరిస్తున్నారు తప్పితే సంస్కృతిని పరిరక్షిస్తున్న వారిని కాదు."

న్యూనతాభావం అన్నది పొరబాటు. రజనీష్ స్వయంగా మీరా, కబీర్, గోరఖ్, రామకృష్ణ, ఉపనిషత్తులు - ఇలా హిందూ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ప్రముఖులపై గొప్ప వ్యాఖ్యానాలు చేశాడు. అతను గర్హించినది మతం వ్యవస్థీకృతం కావడాన్నే తప్ప, ఆధ్యాత్మిక భావనలను, ఆధ్యాత్మిక చింతననూ కాదు.

అలాగే "అనుసరణ" అన్న మాట కూడా సరికాదు. ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో మానవుడి బుద్ధికి త్వరగా అందుతున్నది రజనీష్, కృష్ణమూర్తి, గుర్జీఫ్ ఇలాంటి వారి భావాలు. వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం "అనుసరణ" కాదు. హిందూ మత సారాన్ని కూలంకషంగా శోధించి, ఆకళింపు చేసుకునే ఓపిక, పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇది కాదనలేని సత్యం.

అయితే హిందూ సాంస్కృతిక వికాసాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది ఆన్న విషయంతో మీతో ఏకీభవిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: Let's talk basics now. మీ "సంస్కృతి" నిర్వచనం ఏమిటి? ఎవరి సంస్కృతి ఎక్కడి సంస్కృతి? ఈ సంస్కృతి ద్వారా సాధించే ఆధ్యాత్మికత గమయం ఏమిటి? జీవన మూల్యమా లేక పరలోక విముక్తా?

హిందుత్వం అనే బ్రహ్మపదార్థం "ఒక సంస్కృతి" అని ఎవరు ఎక్కడ చెప్పారు. దాని స్థూల నిర్వచనం,పరిధులు ఏమిటి?

యూరోపియన్,ఇస్లాం,బౌద్ధ "సంస్కృతుల్లో" ఆధ్యాత్మికత "చాలా తక్కువ" అనే మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి?

rākeśvara said...

బ్రాహ్మణరాజరికేతర కుటుంబాలలో లేదా 'క్రింది' వర్గాల కుటుంబాలలో లేదా ఆ మాటకు వస్తే భారతదేశం బయటఁ ఎక్కువ మంది ఆధ్యాత్మిక గరువులు ఎందుకులేరంటే.. ఎక్కడ జబ్బువుందో అక్కడే వైద్యులు అవసరం. రోజూ కాయకష్టం చేసుకుని పెద్దగా ఆశించనివారికి సహజంగానే ఆధ్యాత్మికంగా ఒక మెట్టుపైనుంటారు. బుద్ధుడి అవసరం నాటి భారతానికే ఎక్కువ వుంది :)

European మఱియు Philosophical అనే పదాలు ఒకే వాక్యంలో చూస్తే నాకు నవ్వు వస్తుంది.
గాంధీగారిని ఎవరో అడిగారఁట, What do you think about western civilization అని. దానికి ఆయన, "Its a grand idea, when will it begin?" అని అడిగారఁట. :D

దీని గుఱించి ఇంకా చాలా వ్రాయవచ్చు కాని ఒక్క మాట చెప్పి ఊరుకుంటాను. మన వారు యంత్రాలు తయారు చేయడం, లేదా industrial innovation లో ఎంత వెనకబడివుంటారో (సెల్లుల నుండి రాకెట్ల వఱకూ అంతా కాపీనేనని గ్రహించాలి), పాశ్చాత్యులు ఆధ్యాత్మికంగా అచ్చంగా అంతే వెనకబడివుంటారు.

రాకేశ్వర

బృహఃస్పతి said...

@ravi:
"బౌధ్ధ సంస్కృతిని తరచి చూసినా హిందువులలో ఉన్నంతమంది ఆధ్యాత్మికవాదులు కనపడరు."
నేను కూడా ఋజువులు లేనందునే ఇలా వ్యాఖ్యానించాను.

"న్యూనతాభావం అన్నది పొరబాటు."
నిజమే...! ఈ పద ప్రయోగం పొరపాటు. అవిశ్వాసం అన్నది నా ఉద్దేశ్యం. ఇప్పుడే మార్చాను.

"అలాగే "అనుసరణ" అన్న మాట కూడా సరికాదు."
నిజమే. అనుసరణ అన్నది కూడా గ్రుడ్డి ఆరాధన క్రింద స్ఫురిస్తుంది. దీనిని "ప్రేరణ/స్ఫూర్తి" గా మారుస్తాను.

JK, రజనీష్ వంటి వారిని తప్పు పట్టటం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి నా disclaimer చూస్తే నేను కూడా ఆ విధంగానే స్ఫూర్తి పొందినట్లు అర్ధం చేసుకోగలరు. అయితే నే త్యజించిన మతం/సంస్కృతి సహాయం లేకుండా నేను నమ్మిన సత్యాన్ని నా పిల్లలకు గానీ, భావితరాలకు గానీ అర్ధమయ్యే రీతిలో చెప్పగలనా అని ప్రశ్నించుకుంటే సమాధానం "లేన"నే వస్తుంది. అందుకనే సత్యాన్ని శోధించటంలో సంస్కృతి ఆవశ్యకత కీలకమని చెప్పదలిచాను.

బృహఃస్పతి said...

@Mahesh:
1. మీ "సంస్కృతి" నిర్వచనం ఏమిటి?
A: "ఆచార వ్యవహారాలూ, జీవన విధానం, సమాజ నియమాలూ, కట్టుబాట్లు"

2. ఎవరి సంస్కృతి ఎక్కడి సంస్కృతి?
A: "హిందూ సంస్కృతి. మన భారతదేశంలో పుట్టిన సంస్కృతి"

3. ఈ సంస్కృతి ద్వారా సాధించే ఆధ్యాత్మికత గమయం ఏమిటి?
A: "ఆత్మ స్పృహ/సాక్ష్యాత్కారం"

4. జీవన మూల్యమా లేక పరలోక విముక్తా?
A: జీవన మూల్యమే

5 & 6. హిందుత్వం అనే బ్రహ్మపదార్థం "ఒక సంస్కృతి" అని ఎవరు ఎక్కడ చెప్పారు. దాని స్థూల నిర్వచనం,పరిధులు ఏమిటి?

A: ఇవి వితండవాదమని నేను భావిస్తాను. దీనికి నా సమాధానం మీకు తెలుసు. అయితే మీరు ఒప్పుకోరు. ఈ విషయాలు స్వయంగా తెలుసుకున్నవి.

7: యూరోపియన్,ఇస్లాం,బౌద్ధ "సంస్కృతుల్లో" ఆధ్యాత్మికత "చాలా తక్కువ" అనే మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటి?

నేను చదివిన బైబిలూ, ఖురానూ, బౌధ్ధ గ్రంధాలూ సంఘానికి ఉపయోగపడే విషయాలను చెప్పాయి తప్పితే వ్యక్తిగత శోధన గూర్చి తక్కువ చెప్పాయి. బౌధ్ధం కొంత మేర చెప్పినా అది గృహస్థులనూ, గురువులనూ విభజించి ఆధ్యాత్మికతను కొందరికే పరిమితం చేసింది.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

యూరోపియన్లూ, తతిమ్మా జనం ఎలా ఏడుస్తున్నారో మనకనవసరం. వాళ్ళ ఖర్మకి వాళ్ళనొదిలెయ్యండి. మన గురించి, మన దేశం గురించి, మన మతం గురించి మాట్లాడుకుందాం.

ఆధ్యాత్మికుల్ని వైద్యులుగానో, పాపాలు కడుక్కోవడానికి కృషి చేస్తున్న పాపాత్ములుగానో పేర్కొనడం సరికాదు. ఆధ్యాత్మికులు బాహ్యవస్తువుల నుంచి తమలోపలికి చూపు మరలించి ఆంతరంగిక సమత్వాన్ని, శాంతిని సాధించే ప్రయత్నం చేస్తున్నవారు. ఆధ్యాత్మికత లేనివారంతా all perfect అనుకోవడం కూడా సరికాదు. ఆధ్యాత్మికత ఒక higher sensitivity level. అది కొన్ని మానసిక వాతావరణాల్లో బాగా వికసిస్తుంది. మన భారతదేశం అనాదిగా అలాంటి వాతావరణం. ఈ భారతదేశంలో కూడా కొన్ని కుటుంబాలూ, వంశాలూ ఇంకా మంచి వాతావరణం.

షిర్డీసాయిబాబా గానీ, సత్యసాయిబాబా గానీ మతాతీత తాత్త్వికులమని ఎప్పుడైనా చెప్పినట్లు వారి చరిత్రల ద్వారా తెలియరావడంలేదు. వారెప్పుడూ తమ తత్త్వోపదేశాల ద్వారా హిందూమతాన్నే బోధించారని తెలుస్తున్నది. వారివి భక్తి కల్ట్ లు కావు. అవి సనాతన, సువిశాల హిందూధర్మంలో భాగాలేననీ, దాన్ని నిలబెట్టడానికి ఉద్దేశించినవనీ, దాని కొనసాగింపేననీ వారు పదేపదే తమ లీలల ద్వారా నిరూపించారు. కొండొకచో నేరుగా వాచ్యంగా చెప్పారు కూడా !

వేమన ఒక్కడే మనకి మిగిలిన బ్రాహ్మణేతర తాత్త్వికుడని పేర్కొనడం కూడా సరికాదు. మన రాష్ట్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు, ఎడ్ల రామదాసు, చివటం అమ్మ, గొలగమూడి వెంకయ్యస్వామివారు, కాశినాయన, ముమ్మిడివరం బాలయోగి, అవధూత పోలయ్యస్వామి - ఇలా చాలామంది బ్రాహ్మణేతర ఋషులు జన్మించారు. ధవళేశ్వరం దగ్గర ఆశ్రమం నడుపుతున్న సుందర చైతన్యానంద స్వాములవారు కూడా అబ్రాహ్మణుడే అని విన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు ప్రొ|| బిరుదురాజు రామరాజుగారు (ఈయన బ్రాహ్మణుడే) "ఆంధ్రయోగులు" అని ఒక ఉద్గ్రంథం వ్రాశారు. అందులో అనేక మంది బ్రాహ్మణేతర యోగుల చరిత్రలు కూడా వ్రాశారు. ప్రస్తుతానికి, రావాల్సినంత ప్రసిద్ధి వారికి లేకపోవడం మన (ప్రజల) తప్పే గానీ వారి గొప్పతనంలోని లోపం కాదు.

మన పురాణాల్లో చెప్పిన ప్రకారం కలియుగం అంత్యదశకి చేరుకునే కొద్ది బ్రాహ్మణుల్లో మహాత్ములు జన్మించడం బాగా తగ్గిపోతుంది. బ్రాహ్మణులు శూద్రవర్తననీ, శూద్రులు బ్రాహ్మణవర్తననీ అలవాటు చేసుకుంటారు. క్రమక్రమంగా హిందూమత బాధ్యతల్ని అబ్రాహ్మణులు స్వీకరిస్తారు. అయితే ఆ బాధ్యతల్ని నెత్తిన వేసుకోవడం వల్ల బ్రాహ్మణులకి ఎన్ని ఇబ్బందులొచ్చాయో అన్ని ఇబ్బందులూ వాటిని తీసుకున్నవారు కూడా పడక తప్పదు. ఆ ప్రక్రియకి పూర్వరంగం గత అరవయ్యేళ్ళుగా జరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం అబ్రాహ్మణులు హిందూమత సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. కానీ భవిష్యత్తులో వారే గురువులు కూడా అవుతారు.

ఈరోజు బ్రాహ్మణ సంస్కృతి అనేదేదీ ప్రత్యేకంగా లేదు. అంటే - బ్రాహ్మణ సంస్కృతి ఒక కులానికి పరిమితం కావడం మానేసి చాలా దశాబ్దాలవుతోంది. సార్వజనీన విద్యావ్యవస్థ ద్వారా మన దేశంలో చదువుకున్న ప్రతివారికీ బ్రాహ్మణత్వం అంటుకుంది. ఆ సంగతి వారికి తెలియక పోయినా !

Vani said...

August 2, 2009 11:49 PM
ఈ కామెంట్ లో మీరు చెప్పిన సమాధానాలు చాల స్పష్టం గా ఉన్నాయి.
మీ పోస్ట్ కూడా బాగుంది. నాకు అర్ధ మైన వరకు మీరు చెప్పదలుచుకొన్నది ఏమిటంటే, మన హిందూ సంసృతి (ఆచార వ్యవహారాలు, కట్టు బాట్లు, .మన దైన జీవన విధానం ) మూలం గానే మనకు ఆద్యాత్మికత అలవడింది.
దాని మూలం గా మనకు సంకుచితం కాని విశాల భావాలు అలవడ్డాయి, జీవితానందం పొందుతున్నాము. కాని మనం ఈ జ్ఞానం సంపాదించాక మూలాన్ని విడిచి సంస్కృతికి దూరం గా వెళ్తున్నాం.
మన పిల్లలకు ఈ సంసృతి నేర్పకుంటే వారి కి మనకు ఏర్పడ్డ ఆద్యాత్మిక చింతన రాదు.
బహుశా ఇది ఎలా ఉన్నదంటే ఇండియా లో తండ్రి గురువుల భయం తో చదువుకొని పెద్ద ఉద్యోగాలు పొంది విదేశాలు వెళ్ళాక చుట్టూ ఉన్న వారిని చూసి వారి విద్యా, జీవన విధానాలను పిల్లలకు నేర్పి చివరకు వాళ్ళు తమంత ప్రయోజకులు ఎందుకు కాలేదో అని ఆలోచించటం లా ..
అయితే హిందూ సంసృతి అంటే ఇంకా విశాల మైన అర్ధం ఇస్తే బాగుంటుంది.
కట్టూ బొట్టు, మన ప్రాచీన విద్యలు అద్యయనం చెయ్యటం, బ్రహ్మచర్య, గృహస్తాశ్రమ మొ!! వర్ణాశ్రమ ధర్మాలు పాటించటం ఇవి సంసృతి అనుకొంటే వీటిలో వచ్చిన సంస్కరణల, మార్పుల మాట ఏమిటి? అన్ని పాటించటం సాద్యం కాదు కదా, కాలాన్ని, ప్రాంతాని బట్టి కొన్ని పాటించటం సాద్యమూ కాదు. అప్పుడు ఏది సరైనమార్గం?

బృహఃస్పతి said...

మైత్రేయి గారూ,

నేను చెప్పదలచుకున్నది నా భావనలో గ్రహించినందుకు ధన్యవాదములు. మీరు చెప్పిన విదేశాలకు ఏగే హిందువు ఉదాహరణ చక్కగా అతికింది.

"హిందూ సంసృతి అంటే ఇంకా విశాల మైన అర్ధం ఇస్తే బాగుంటుంది."
కామెంట్లో నేను క్లుప్తంగా చెప్పినా, వ్యాసంలో నేను సంస్కృతి అంటే సకల కళాలూ, నడవడికా, ఆచారాలూ ఇలా అన్నివిషయాలూ స్పృశించానని భావించాను. CLARITY లేనిచో మన్నించండి.

"కాలాన్ని, ప్రాంతాని బట్టి కొన్ని పాటించటం సాద్యమూ కాదు. అప్పుడు ఏది సరైనమార్గం?"
ఈ విషయం కూడా నేను touch చేసానని భావిస్తున్నాను. సంస్కరణలు, మార్పులూ సంస్కృతిని కలుషితం చేయకూడనంతవరకూ ఫరవాలేదని, పరమార్ధం దారి తప్పకూడదని చెప్పాను. ఈ విషయంలో కూడా బహుశా నా వ్యాసంలో CLARITYతగ్గి ఉండవచ్చు.

తెలుగోడు said...

@బృహఃస్పతి: వేదాల్లో ఎంత సంస్కృతి ఉందో నాకు తెలీదు. నేనెప్పుడూ చదవలా. వేమన పద్యాల్లో ఉన్నదే నాకు తెలిసినది, నాకు సంబంధించినది. ఆధ్యాత్మికత, సంస్కృతి అన్నీ కూడా వేదాల్లోనే ఎందుకు పుడతాయో నాకైతే అర్థం కాని విషయం. ఈ రెండిటిని మతానికి ఎందుకు ముడి పెడతారు ? సాయిబులు, తెల్లోళ్ళు ఒక పుస్తకం మాట వింటారు కాబట్టి వాళ్ళకు ఆధ్యాత్మిక చింతన తక్కువ, కాని హిందువులు వేదాలు (ఇవి పుస్తకాలే కదా, మనిషి రాసినవే కదా !) అనుసరిస్తాం కనుక మనకి చింతన ఎక్కువా ? చిన్న వీధి కొట్లాటల నుంచి ప్రపంచ యుద్ధాల దాక అన్నిటికి కారణం ఇదే వాదన - " నాది గొప్ప, నీది తక్కువ!"

ఆధ్యాత్మికత/తత్వము గురించి మాట్లాడేటపుడు మనకు కావాల్సింది Quality. Quantity కాదు. ఒక బుద్ధుడు, మొహమ్మద్, ఏసు వీళ్ళెవ్వరూ బ్రాహ్మణులూ కాదూ, అట్లాగే వీళ్ళు ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వంలో వందో వంతు కూడా మీరు చెప్పిన బ్రాహ్మణ తత్వవేత్తలు అందరు కలిసి కూడా ఇవ్వలేక పోయారు.

అట్లాగే , ప్రతి సంస్కృతీ కూడా కాలానుగుణం గా మారుతూ ఉంటుంది. మారే దానిని బలవంతం గా ఆపనూ లేము, ఆగిపోతున్నదానిని బలవంతంగా కదిలిచ్చనూలేము. అది వృధా ప్రయాస మాత్రమే ! ఇది ఒక చక్రం లాంటిది. ఉచ్ఛ నీచాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి.

ఆధ్యాత్మికత అనేది సంస్కృతి/మతం తో ముడి పడినది అయితే, మీ వాదన ప్రకారం హిందువులందరికీ ఆధ్యాత్మిక అనుభవం అయి ఉండాలి. కాని అది సత్య దూరం. కాబట్టి ఆధ్యాత్మికత వ్యక్తిగతం, స్వతంత్రం అదే సత్యం.

తెలుగోడు said...

@తాడేపల్లి: తాడేపల్లి గారు ఒక దారుణమైన సూచన చేసారు. అందరికి కూడా బ్రాహ్మణ కుటుంబసంస్కృతి ని అలవాటు చేస్తే (సహజం గా) అందరికి తత్వ చింతన పెరుగుతుంది అట. ఆఫ్ఘనిస్తాన్ లో ఆ మధ్య తాలిబాన్ వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా ఇలాంటిదే. ఓడిపోయారు/పోతున్నారు. మనదేశం లో మొదట సాయిబులు, పిదప తెల్లోళ్ళు చేసిన ప్రయత్నం కూడా ఇదే. ఓడిపోయారు.

ఇంకా ఇట్లాటి మధ్యయుగపు ఆలోచనలు వింటుంటే ఎక్కడో కాలుతోంది. "నీది నీకు ఎంత గొప్పో, నాది నాకు అంతే గొప్ప."

బృహఃస్పతి said...

@తెలుగోడు:

మీ ప్రశ్నకి పైన రవిగారి కామెంట్లో సమాధానం ఉంది.
"సంస్కృతి లక్ష్యమూ, ప్రాధాన్యతా ఆధ్యాత్మికతను చాటి చెప్పటానికే అయినా, ఇవి విస్తృతవ్యాప్తి చెందే సరికి ఆధ్యాత్మికత అన్నది సంస్కృతి వలనే సాధ్యం అన్న అనుకోలు బలంగా వేళ్ళూనుకోవడం."

కేవలం సంస్కృతి ద్వారా మాత్రమే నేను ఆధ్యాత్మికతను పొందవచ్చని చెప్పలేదు. సంస్కృతి ద్వారా సులభమని మాత్రమే చెప్పాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"నాదీ, నీదీ" కాసేపు పక్కన పెడదాం. అబ్రాహ్మణులు అబ్రాహ్మణ సంస్కృతిలో కొనసాగుతూ అదే సమయంలో బ్రాహ్మణులకి ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణ గురువుల స్థానాన్ని భర్తీ చెయ్యడం సాధ్యపడదు, మతగురువులుగా ఈ గురుత్వాన్ని పొందడం కోసం బ్రాహ్మణులు తరతరాలుగా అలవాటు చేసుకొన్న క్రమశిక్షణ ఒకటుంది. హిందూధర్మాన్ని మరింత ప్రజాస్వామీకరించాలంటే దాన్ని అందరికీ అందించడం ఆవశ్యకం. హిందూధర్మానికి ప్రతినిధులుగా గురువులుగా బ్రాహ్మణుల ప్రాచీన కుటుంబసంస్కృతి ధార్మికులైన హిందువులందరికీ ఆదరపాత్రమే. ఆ సంస్కృతి నుంచి దూరమైన బ్రాహ్మణులే హిందూమతాన్ని ఆచరించడంలోను, కాపాడ్డంలోను స్వయంగా విఫలమవుతున్నారంటే ఇహ ఇతరుల సంగతి చెప్పేదేముంది ? మనం హిందూధర్మాన్ని పునరుద్ధరించాలంటే మనక్కావాల్సింది ఆ కుటుంబ సంస్కృతిని పునరుద్ధరించడం. అది అందరికీ యథాతథంగా చేరకపోయినా వారు (హిందూమత గురువులైన బ్రాహ్మణులు) బోధించిన వాటినే కదా ప్రత్యక్షంగానీ, పరోక్షంగానో అందరూ అవలంబిస్తున్నది !

Anonymous said...

ఒక్క విషయాన్ని గమనించాలి.

మిషనరి లీడర్షిప్, ఎక్కువ మందిని కన్వర్ట్ (మతమార్పిడి) చెసినవారిని Saints గా గుర్తిస్తుంది. Example. Teresa.

The western system rewards a person for physical achievements. The scale to judge greatness is through material achievements (e.g. ఎంత మందిని మతమార్పిడి చెసావు).

But the scale to judge greatness is different in Indic traditions.

విశ్వామిత్ర said...

కుల తత్వాన్ని పక్కన పెడితే హిందూ మతంలో విశాల దృక్పదం కనబడుతుంది. మనిషికి హానికరం కాని కొన్ని నియమాలతొ కట్టుబాట్లలో ఉంచే ప్రయత్నం కనబడుతుంది. సర్వమత సమ్మేళనం కనబడుతుంది. వేంకటేస్వర స్వామి భార్య బీబీ నాంచరమ్మ గాని, ముస్లిం ఫకీర్ అయిన షిరిడీ సాయి బాబా గానీ హిందూదేవుళ్ళ స్థానాలలో ఉండటం ఇదే కారణం. అయ్యప్ప భక్తులు కూడా అయ్యప్పని దర్సించే ముందు వావర్ స్వామి (ముస్లిం)ని దర్గాలో దర్శించిన తరువాతే అయ్యప్ప దర్శనానికి వెడతారు. హిందువుల కళ్యాణ సందర్భంలో మీరా సాహెబ్ తెప్పని నెత్తిపై ఉంచుకొని ఉరేగుతూ తమ భక్తిని చాటుతారు. ఇవన్నీ ఇప్పటికీ మన కళ్ళముందు కనిపించే సాక్ష్యాలు. ఏ ఒక్క ఇతర మతమైనా మరో మతానికి చెందిన దేముళ్ళని పూజించిన సందర్భాలున్నాయా? వీటన్నిటినీ వదిలిపెట్టి హిందూ మతమ్మంటే బ్రాహ్మణ మతమనీ బ్రాహ్మణులు ఏదో చేసేస్తున్నారని ఏడవడం బ్లాగుల్లో ఎక్కువైపోయింది.ఇవన్నీ క్రీ.పూ. కి ముందునుండీ ఉన్న అచారాలు గావచ్చు. అందుకనే క్రీస్తు ప్రస్తావన రాలేదు. లేకపోతే ఆయనకి కూడా ఒక స్థానం కలించేవారేమో!!

Praveen Mandangi said...

స్త్రీలకి బలవంతంగా గుండు గియ్యించి తెల్ల చీర కట్టించడం లాంటి ఆటవిక ఆచారాలని పాటించిన చరిత్ర ఒక్క హిందూ మతానికే ఉంది కదా.

Anonymous said...

@mr. fake sarma,
what about nuns in christianity and veil culture in islam.?
The tradition you are telling is not there in hinduism now and it was not there from beginning.
but others are still following..

తెలుగోడు said...

@తాడేపల్లి : తాడేపల్లి గారు హిందూ మతాన్ని బ్రాహ్మణ మతంగా అన్వయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణ్యం హిందూ మతం లో ఒక చిన్న భాగం మాత్రమే. బ్రాహ్మణుడు అంటే జ్ఞానం కలవాడు, బ్రహ్మ తత్వాన్ని అనుసరించి అనుభవించే వాడు అని అర్థం. జ్ఞానం, అనుభవం ఎవడబ్బ సొమ్మూ కాదు. గురువు ఎవరైనా గురువే, బ్రాహ్మణులు ఒక్కరు మాత్రమే కాదు.

హిందూ మతం మొత్తానికి బ్రాహ్మణులు ప్రతినిధులని ఎందుకు సూత్రీకరిస్తున్నారు ? బ్రాహ్మణ కుటుంబ సంస్కృతి ధార్మిక హిందువులు 'అందరికీ' ఆదరపాత్రమే అని ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నారు ? హిందూ సమాజం లో వారు ఒక చిన్న భాగం మాత్రమే. వారి కుటుంబ సంస్కృతి కూడా అంతే.

మనకు కావాల్సింది ధర్మ ఉద్ధరణ . హిందూ ధర్మ ఉద్ధరణ కాదు. హిందూ ధర్మం పేరుతొ శతాబ్దాలుగా జరిగిన అధర్మాన్ని రూపు మాపేట్టుగ జరిగే ధర్మ ఉద్ధరణ కావాలి.

P.S-'నీది'+'నాది' కలిస్తేనే 'మనది' అవుతుంది. 'మనది' అనే భావన ఉన్నంత వరకు హిందూ ధర్మానికి వచ్చిన ఆపద ఏమి లేదు. 'నాది మాత్రమే' అనే భావన మాత్రం ఖచ్చితంగా మనలేదు.

@విశ్వామిత్ర : "హిందూ మతమ్మంటే బ్రాహ్మణ మతమనీ బ్రాహ్మణులు ఏదో చేసేస్తున్నారని ఏడవడం బ్లాగుల్లో ఎక్కువైపోయింది" - ఒక భిన్న అభిప్రాయాన్ని చర్చించలేక దాన్ని ఏడుపుగా జమకట్టి మీరు ఏడ్చే ఏడుపు కి నవ్వొస్తోంది.

బీబీ నాంచరమ్మ గాని, షిరిడీ సాయి బాబా గానీ, వావర్ స్వామి అందరు క్రీ.శ. తర్వాతనే కదా. వీరందిరికి స్థానం కల్పించినపుడు, మీ వాదన ప్రకారం క్రీస్తుకి & మొహమ్మద్ కి కూడా స్థానం కల్పించాలి కదా. అయినా అంత వరకు ఎందుకు, మా ఊర్లో గ్రామ దేవతనే లెఖ్ఖ చేయరు.

ఇతర మతాల దేవుళ్ళని కలుపుకుని పూజించే గొప్ప మతం మరి తన సొంత మతానికి చెందిని జనాలని గుళ్లలోకే రానివ్వదేందుకో. ఇప్పటికి అంటరాని వారుగా చూసేదేందుకో ! ఇతర మతాలు 'గొప్పవి' కాకపోవచ్చు/కావచ్చు. కనీసం ఆయా మతాల వారిని (వేరే మతాల వారిని కూడా) అందరినీ ప్రార్ధన మందిరాల్లోకి రానిస్తాయి.

బృహఃస్పతి said...

ఇక్కడ వ్యాసం ముఖ్యోద్దేశ్యం దారి తప్పుతున్నందున జోక్యం చేసుకోవలసి వస్తోంది.

నేను చెప్పదలుచుకున్నది... సంస్కృతి ఆధ్యాత్మికతకు సులభమైన దారి చూపిస్తుంది. ఆ విధమైన సంస్కృతి హిందువులకే సొంతం అని. గమనించి వ్యాస ముఖ్యోద్దేశ్యాన్ని వక్రీకరించవద్దని పాఠకులకు మనవి.

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: మీ వ్యాసం మొత్తం వక్రీకరణే. అలాంటప్పుడు కొత్తగా దాన్ని వక్రీకరించి వ్యాఖ్యలు చెయ్యడం ఎవరికి చెల్లింది?

హీనయానమైనా మహాయానమైనా బౌద్ధం మొత్తం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిందే. ఇప్పటికీ దలైలామా మొదలు లామాల(గురువుల)పరంపర కలిగిన దారే వారిది. మీకు మాత్రం అందులో ఆధ్యాత్మికత కనిపించదు.

ఇస్లాం మతంలో రాజకీయ అధికారం ముల్లాలదే అయినా, ఆధ్యాత్మికత మాత్రం సూఫీ వంటి ఆధ్యాత్మిక వాదానిదే. అదీ మీ దృష్టికి రాదు.

సిక్కు మతంలో గురు నానక్ నుంచీ నానక్ దేవ్ వరకూ అందరూ గురువులే. అది మీకు ఆనదు.

యూరోపియన్ తాత్విక,ఆధ్యాత్మిక వాదులు చర్చికి వ్యతిరేకంగా మానవత్వం కోసం జరిపిన spiritual wars మీకు కనిపించవు. బహుశా మీకు తెలియవు కూడా.

ఈ అన్ని మతాల్నీ కట్టగట్టుకుని పనికి రానివని తేల్చేసి, ఒక "ఊహా భారతీయ సంస్కృతిని" మీ కలల్లో నిర్మించి అదే గొప్పదని నిర్ణయించేశారు. బ్రాహ్మణ గురువులు కష్టపడి వేసిన ఆ నేషనల్ హైవే లో వస్తేగానీ ఎవరికీ మోక్షాలు లేవని ఖచ్చితంగా చెప్పేసారు.

మీరు కనీసం ఎప్పుడైనా ఇల్లైనా దాటారా అనే సందేహం నాకొచ్చింది. హైదరాబాద్ లో ఉంటే ఒకసారి ఇంటిబయటికొచ్చి, మీ చుట్టూ ఉన్న సంస్కృతుల్ని లెక్కెంచండి. ఇంకా వీలైతే దేశాన్ని, కనీసం దక్షిణ భారతదేశాన్ని చుట్టి రండి. ప్రతి వంద కిలోమీటర్లకూ ఒక సంస్కృతి (మీ నిర్వచనం ప్రకారమే) కనిపిస్తుంది.

ఇక ఆధ్యాత్మికత అంటారా...అది అందిపుచ్చుకోవడానికి మనిషైతేచాలు. సాటి మనిషిని సమానంగా ప్రేమిస్తే చాలు. జీవితాలు ధన్యమైపోతాయి. అంతకన్నా మోక్షం అవసరం లేదు. దాని కోసం మతాలూ, సంస్కృతీ అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు.

ఆ మానవత్వం బ్రాహ్మనిజం ఆధారిత హిందుత్వంలో లేదు. "సనాతన హిందూధర్మం" అని ఒకటుండేదట...దాంట్లో ఉండేదేమో నాకు తెలీదు. అసలలాంటిది ఒకటున్న జ్ఞానమైతే నాకు లేదు.

Anonymous said...

@katti,
I know only one Hinduism which if a amalgam of different philosophical thoughts all leading to renunciation.
Which suggests that all men are not same and so the approach to reach the ultimate goal can be different.
Which suggests few rules for life called ‘Dharma” that again is different for people with different occupations. The dharma also changes with each stage of man’s life .
What the author is referring to is, whichever path you take to reach the GOAL, don’t forget the dharma. Goal is important but Dharma alone leads to goal.

Can you explain what is the OTHER Hinduism you are referring to what is this new BRAMHANICAL and NON BRAMHANICAL Hinduism . Which pop has coined these new words.

WE Poor hindus are not aware such differences. Are you referring to the people who practice different religion but prefer to name themselves hindu names as they NEED to be CALLED HINDUS

బృహఃస్పతి said...

@ మహేష్: వెర్రితలలు వెట్టుతున్న మీ అజ్ఞానానికి నా చివరి సమాధానం: మీ తొమ్మిది పేరాలకు చివరాఖరి జవాబు.
1: వ్యక్తిగత ఆరోపణలు చేసే మీ స్థాయి కి దిగలేను గనుక no comments
2: నేను చెప్పిందీ అదే... బౌధ్ధంలో గురువులకు మాత్రమే ఆధ్యాత్మికత అందుతుందని. గృహస్థులకు కాదు.
3: ఆధ్యాత్మికత అంటే అర్ధాన్ని తెలుసుకోండి. అది పరులకు చేసే సాయమో, పరమపద సోపానమో కాదు. ఖురాను చదువండి (నే చదివా). ఆధ్యాత్మికత పాలెంతో తెలుస్తుంది. (ఆధ్యాత్మికత అర్ధం 8వ జవాబులో ఉంది)
4: దీనికీ 2వ సమాధానమే వర్తిస్తుంది.
5: దీనికి నాకన్నా రాకేశ్వరరావు గారి సమాధానం బాగుంది. పైన చదువుకోండి.
6: మన సంస్కృతి బ్రాహ్మణ గురువులచే తయారు చేయబడిందని నేను చెప్పలేదు. ఆ మూలాలకు కుల గజ్జి నేను అంటించలేదు. వారు కాపాడారని మాత్రం విశ్వసిస్తున్నాను. అబ్రాహ్మణుణ్ణి అయిన నాకు ఆయాచితంగా వారిపై ప్రేమని కురిపించాల్సిన అవసరం లేదు.
7: మీరు నేను హైదరాబాదుకు చెందినవాడినని ఎందుకు నిర్ధారించారో తెలియదు. ఎదుటి వారి అభిప్రాయాలను కూడా మీరీవిధంగానే వక్రీకరిస్తున్నారు. నాది బెంగలూరు. కనీసం దేశాన్ని చుట్టిరానివారు మీరేనని నేను విశ్వసిస్తున్నాను. నేను యూరోపియన్ సంస్కృతిని రెండేళ్ళపైబడి, అమెరికన్ సంస్కృతిని ఏడాది పైబడి తిరిగి చూసి వచ్చిన వాడిని. ఇక గల్ఫ్, జపాన్లతో కలుపుకుంటే నేను తిరిగి వచ్చిన దేశాల సంఖ్య 4.
8: మోక్షం ప్రస్తావన ద్వారా మీరు ఆధ్యాత్మికతకు అర్ధం తెలియని వారనిపించారు. మీరు ఆధ్యాత్మికత అర్ధం అడగటానికి సంకోచిస్తున్నారనిపించి చెప్తున్నా వినుకోండి. ఆధ్యాత్మికత ముఖ్యోద్దేశ్యం ఆత్మ స్పృహ. ఆత్మ స్పృహ అంటే మోక్షం కాదు వెర్రి నాయనలారా(తెలియని వారందరికీ)! ఆత్మ స్పృహ అంటే సకల జీవకోటిలో, ప్రకృతిలో, విశ్వంలో ఉన్న అఖండ, అవిభాజ్య, అనంత శక్తిని గ్రహించటం.
9: బ్రాహ్మణ ఆధారిత హిందుత్వం అని మీరంటున్నారు. నేను కాదు. మీ చివరి వాక్యంతో నేను ఏకీభవిస్తున్నాను. నిజమే మీకు జ్ఞానం లేదు.


ప్రవీణ్తో వాదించే ఓపిక ఎలా నశించిందో, మీతో కూడా అలానే నశించింది. వాదించి వాదించి చివరాఖరి కామెంటు మీకే అప్పగించి మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాననే అపవాదు తెచ్చుకోవటం కంటే ఆ కామెంట్లు 'కత్తి'రించటం మేలను తెలుసుకున్నాను.

ఇకపై comment moderationఉంటుంది. మూర్ఖ కామెంట్లు ప్రచురించబడవు.

Kathi Mahesh Kumar said...

ఒకసారి మీ వ్యాసం మీరే మళ్ళీ చదువుకునే అవసరం ఉందనుకుంటాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

@తాడేపల్లి : తాడేపల్లి గారు హిందూ మతాన్ని బ్రాహ్మణ మతంగా అన్వయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణ్యం హిందూ మతం లో ఒక చిన్న భాగం మాత్రమే. బ్రాహ్మణుడు అంటే జ్ఞానం కలవాడు, బ్రహ్మ తత్వాన్ని అనుసరించి అనుభవించే వాడు అని అర్థం. జ్ఞానం, అనుభవం ఎవడబ్బ సొమ్మూ కాదు. గురువు ఎవరైనా గురువే, బ్రాహ్మణులు ఒక్కరు మాత్రమే కాదు.

హిందూ మతం మొత్తానికి బ్రాహ్మణులు ప్రతినిధులని ఎందుకు సూత్రీకరిస్తున్నారు ? బ్రాహ్మణ కుటుంబ సంస్కృతి ధార్మిక హిందువులు 'అందరికీ' ఆదరపాత్రమే అని ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నారు ? హిందూ సమాజం లో వారు ఒక చిన్న భాగం మాత్రమే. వారి కుటుంబ సంస్కృతి కూడా అంతే.


వినడానికి చాలా బావుంది. కానీ ఆచరణలోకొచ్చేసరికి ఈ వాదం దయనీయంగా కుప్పకూలుతుంది. అబ్రాహ్మణ సంస్కృతి హిందూమతానికి తగినంతమంది గురువుల్ని, ఆచార్యుల్ని సరఫరా చెయ్యజాలని పరిస్థితిలో ఉంది. అందుకు మన దేశచరిత్రే నిలువెత్తు సాక్ష్యం. ఈ అబ్రాహ్మణుల్లో హెచ్చుశాతం మంది యొక్క సంస్కారం, ఆధ్యాత్మిక పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయంటే - వారు ఏ మతంలో ఉన్నా ఒకటే అన్నట్లు ఉంది. కనుక అది హిందూధార్మిక దృష్ట్యా శ్రేష్ఠమైన జీవనవిధానం కాదు.

మనం ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మణులు లేకుండా హిందూమతం బతికిబట్ట కట్టడం అసాధ్యం. ఎందుకంటే అందులో మంచీచెడూ తెలిసినవారూ, దాన్ని ఎంతోకొంత ఆచరిస్తున్నవారూ వారే. అందులో అనుమానమేమీ లేదు. మనకి చారిత్రికంగా ఉన్నకొద్దిమంది బ్రాహ్మణేతర గురువులూ బ్రాహ్మణుల దగ్గర శిష్యరికం, శుశ్రూష చేసి గురువులైన వారే.

అలా కాకుండా ఈ పరిస్థితి మారాలని అబ్రాహ్మణుల్ని బ్రాహ్మణులతో సమానంగా హిందూసంస్కృతిమంతుల్ని చెయ్యాలని నేనంటున్నాను. హిందూమతానికీ, అబ్రాహ్మణులకీ మధ్య డైరెక్ట్ ఛానెల్ ఏర్పడాలని నేను కోరుతున్నాను.

Anonymous said...

>> మానవత్వం బ్రాహ్మనిజం ఆధారిత హిందుత్వంలో లేదు
ఇలాంటి స్టేట్మెంటులు కేవలం *సంఘసంస్కర్తలు* మాత్రమే ఇవ్వగలరు.
దళిత ఆధారిత హిందుత్వం ఏమైనా ఉంటే దాంట్లో మానవత్వపాళ్ళు ఎంత ఉన్నాయో రాజావారు చెప్తే చదువుకుని ఆనందిస్తాం

తెలుగోడు said...

@తాడేపల్లి : హిందుత్వం=బహుళత్వం. హిందుత్వం అనేది ఒక మతంగా తీసుకున్నా లేదా ఒక సంస్కృతి లేదా జీవన విధానంగా తీసుకున్నా కూడా, విభిన్నత & బహుళత్వమే హిందుత్వానికి ఆయువుపట్టు.

మీరన్నట్టుగా చరిత్రనే చూసినట్లయితే, హిందూ సమాజం మీద ఎన్నో మతాలు/సంస్కృతులు దాడి చేసాయి. కాని ఏ ఒక్కటి కూడా హిందుత్వం పునాదులను కదిలించలేకపోయింది. బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం మొదలైన మతాలు ప్రపంచంలో ఎక్కడికి వెళితే అక్కడి సమాజాలను పూర్తిగా మత-ఆక్రమణ & సంస్కృతి-ఆక్రమణ చెయ్యగలిగాయి. ఆయా ప్రాంతాల ధర్మాలను పూర్తిగా మార్చివేయగలిగాయి కూడా. కాని హిందుత్వాన్నిఎప్పటికి గెలవలేకపోయాయి. కారణం - హిందుత్వం ఎన్నడూ కూడా ఒకే-సూత్రం, ఒకే-సంస్కృతి, ఒకే-ఆలోచన మతం కాదు. అన్ని రకాలైన విధానాలను గెలవడం ఏ ఒక్క ధర్మానికి సాధ్యం కాలేదు.

శతాబ్దాల నుంచి కూడా, హిందుత్వం అనేది అనేకమైన సూత్రాల, సంస్కృతుల, ఆలోచనల సమాగమం. అదే హిందుత్వం యొక్క అతి గొప్ప బలం. అంత గొప్ప బలాన్ని వదిలేసి, ఒకే-ఒక్క పద్ధతిని, సంస్కృతిని, ఆలోచనను అందరి మీద రుద్దడం అనే ఆలోచన ఆత్మహత్యా సదృశం.సంకుచితం.అభిజాత్యం.

గమనిక - నా దృష్టిలో హిందుత్వం మరియు హిందూ మతం/సంస్కృతి/జీవన విధానం అంటే - ఒక స్వతంత్రమైన, ఒకరిచేత నిర్దేశించబడని, బహుళ మార్గాలున్న జీవనం. Hinduism is 'inclusive' and not 'exclusive'.

సంఘ్ పరివార్ యొక్క 'ఇతర మత వ్యతిరేక - బ్రాహ్మణవాద - ఉత్తర భారత - తిరోగమన' హిందుత్వ నిర్వచనానికి నేను పూర్తిగా వ్యతిరేకం.

Anonymous said...

@తెలుగోడు,
* ఆధ్యాత్మికత/తత్వము గురించి మాట్లాడేటపుడు మనకు కావాల్సింది Quality. Quantity కాదు. ఒక బుద్ధుడు, మొహమ్మద్, ఏసు వీళ్ళెవ్వరూ బ్రాహ్మణులూ కాదూ, అట్లాగే వీళ్ళు ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వంలో వందో వంతు కూడా మీరు చెప్పిన బ్రాహ్మణ తత్వవేత్తలు అందరు కలిసి కూడా ఇవ్వలేక పోయారు.*
ఈ రోజుల లో రేషనల్ థింకర్స్ బుద్దుడు చాలా గొప్ప వ్యక్తి లా కనిపిస్తాడు. వారంటె మన హేతువాదులకు ఒక విధమైన అభిమానం.దీనికి చాల చలా నేపథ్యం ఉన్నాది. అసలికి ఇంతకీ బుద్దుడి నిజం గా జ్ఞానోదయమ కలిగిందా? కలిగితె ఆయన అలా సంఘాలు ఎందుకు ఏర్పాటు చేశాడు. కత్తి మహేష్ బ్లాగులో బుద్దుడి మీద మైథిలి శరణ్ గుప్త రాసిన ఒక టపా చదివేది. ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక వారసత్వం ఎమీటీ ? అందరిని ఆయన సంఘాలలోకి కన్వెర్ట్ చేయటమా? మారని వాళ్ళని ఆయన అనుచరులు చైనా లో చాల మందిని చంపారు. మీరు పైన పెర్కొన్న వారందరు ఒక మతం అనే దానిని స్తాపించి ప్రజల లో చీలికలు తెచ్చిన వారు. ఎంత చేట్టుకు అంత గాలి అన్నటు మీకు గాని/మరికొందరికి గాని వారు గొప్ప వ్యక్తులేమొ not for many people.

Anonymous said...

*మన సంస్కృతి బ్రాహ్మణ గురువులచే తయారు చేయబడిందని నేను చెప్పలేదు. ఆ మూలాలకు కుల గజ్జి నేను అంటించలేదు. వారు కాపాడారని మాత్రం విశ్వసిస్తున్నాను. అబ్రాహ్మణుణ్ణి అయిన నాకు ఆయాచితంగా వారిపై ప్రేమని కురిపించాల్సిన అవసరం లేదు.*

మన సంస్కృతి మీరు గమనిచి నట్లైతె అబ్రాహ్మణుడు రాసిన రామాయణము దాని నాయకుడైన రాముడు ఆయన పాటిచిన ఏకపత్ని వ్రతము,సోదరుల ఎడల ప్రేమ,మిత్రుల ఎడల గౌరవము ఇటువంటి వాటిని బ్రాహ్మణులు ఆదర్శంగా తీసుకున్నారు. బాబు తెలుగోడు గారు మీకు ఏ చరిత్ర చదివారో నాకు తెలియదు గాని ఒకసారీ తమిళ నాడు శివ, విష్ణాలయాలకు వెళ్ళండి అక్కడ మూల విరాట్టు సన్నిధి చుట్టూ విష్ణలయాల లో 12 ఆళ్వారుల విగ్రహాలు + రామానుజాచార్యుల విగ్రహం ఉంటుంది. ఈ 12 లో నలుగురు మాత్రమే బ్రహ్మణ గురువులు మిగతా వారిలొ ఒక హరిజన గురువు, మిగిలిన కులాలకు చేందినవారివి. మీకు తెలుసోలేదో ఈ విగ్రహాల లేక పోతె ఆ దేవాలయాన్ని వైష్ణావలయం గా పరిగణించరు. వైష్ణావులకి దేవుడి కన్నా గురువులు ముఖ్యం. అలాగే శైవులకు (వీర్ని నయణ్మారులంటారు)60+ గురువులు ఉన్నారు వారిలో అధిక బాగం 70% బ్రహ్మణులుకారు. బ్రాహ్మణ సంస్కృతి ఎమీటంటే నేను పైన చేప్పిన వారిని భవిషత్ తరాలు మరచి పోకుండా వారి వాక్కులను పుస్తకాలుగా రాసి భద్రపరచుకున్నారు. వారి విగ్రహాలను చెకించి గుడిలో దేవుడి పక్కన పేట్టి వారి జన్మ నక్షత్రం రోజూన ప్రత్యెక పూజలు గత కొన్ని శతాభ్దాలుగా చేస్తున్నారు. ఇది నువ్వు విమర్శించే బ్రహ్మ్ణ సంస్కృతి అసలు రంగు.

Anonymous said...

కత్తి మహేషా,
* బ్రాహ్మణ గురువులు కష్టపడి వేసిన ఆ నేషనల్ హైవే లో వస్తేగానీ ఎవరికీ మోక్షాలు లేవని ఖచ్చితంగా చెప్పేసారు* సిక్కు మతంలో గురు నానక్ నుంచీ నానక్ దేవ్ వరకూ అందరూ గురువులే. అది మీకు ఆనదు*
బ్రాహ్మణ గురువులు మోక్షాలు పొందినవారినీ నుసరించారయ్యా! ఉదహరణకు కాలహస్తి లో ని కన్నప్పకి దేవాలయము కట్టి పూజలు చేస్తున్నారు, అలాగే మహారాష్ట్రలో పాండరిఊర పాండురంగడు ని పూజిన చాలామంది భక్తులలో తుకారాం,నామదేవ్,జ్ఞానదేవ్ మొదలైనా గురువు ల లో కూడా చాలమంది బ్రహ్మణులు కారు. మరింత వివరముల కొరకు చక్రధారి అనే నాగెశ్వర రావు సినేమాచుసేది. నువ్వు ఎదో సిక్కు మతం చాలా ప్రత్యెక మతం అయినట్లు అట్లు దానికి హిందు మతంతో సంభందం లేనట్లు మాత్ళాడుతున్నావు. ఈ క్రిందిది చదువుకో సిక్కు గ్రంథాలలో హిందు మత ప్రభావం. నీ ఆశక్తి చూస్తుంటె హిందు మతం మీద ఒక కోచింగ్ సెంటెర్ పెట్టి చాలమందీ ముందర శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నాదని పిస్తున్నాది నాకు.

Nām dev (Nām Dev or Sant Nāmdev) (c.1270-c.1350 CE) was a prominent religious poet of Maharashtra, India in the Hindu tradition, and was one the earliest writers in the Marathi language. He also wrote some hymns in the Hindi and the Punjabi languages. Sixty-one of his compositions are included within Sikhism's holy scripture, the Guru Granth Sahib.

తెలుగోడు said...

@అనామకుడు1: హేతువాదులకు బుద్దుడైనా ఒకటే, రాముడైనా ఒకటే. ఎవరినీ నమ్మరు. అట్లాగే భక్తి ఉన్నవాళ్ళకి కూడా బుద్దుడైనా ఒకటే, రాముడైనా ఒకటే. నమ్మేవారికి ఇద్దరు మహానుభావులే. మరి మీకు - రాముడు గొప్ప, బుద్ధుడు కాదు. మీది ఏ రకమైన వాదమో మరి !

" అసలికి ఇంతకీ బుద్దుడి నిజం గా జ్ఞానోదయ౦ కలిగిందా?" - అని మీరడిగేది ఎట్లా ఉందటే, " రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివాడు ?" అని కరుణానిధి అడిగినట్లుగా ఉంది. సమాధానం మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను.

"మారని వాళ్ళని ఆయన అనుచరులు చైనా లో చాల మందిని చంపారు" - అని ఆరోపించారు. అహింస అనేది భౌద్ధం లో ముఖ్యమైన అంశం. బుద్ధుడు ఎప్పుడూ హింసని బోధించలేదనేది జగమెరిగిన సత్యం. పోనీ కాస్సేపు మీరన్నది నిజం(?) అనుకున్నా కూడా, మధ్య యుగాల్లో ప్రతీ మతమూ కూడా ధర్మ-వ్యాప్తిని, అందు కోసం హింసను అనుసరించినదే. దీనికి హిందూ మతము ఎంత మాత్రమూ అతీతము కాదు.

"మీకు గాని/మరికొందరికి గాని వారు గొప్ప వ్యక్తులేమొ not for many people." - హ్హ హ్హ హ ! నేను చెప్పిన మూడు మతాలను కలిపితే హిందూ మతానికి మూడింతల జనం ఉంటారు. ఆ అందరు 'many people' కి సంబంధిచినంత వరకు వారు చాలా గొప్ప. హిందూ మతం లోని చాలా మందికి కూడా వారు గొప్పే, మీ లాంటి కొందరికి తప్ప.

తెలుగోడు said...

@అనామకుడు2: నేను చదువుకుంది ప్రపంచ, భారత దేశ, ఆంధ్ర దేశ చరిత్రలు. మీరు కేవలం తమిళనాడు లోని అతి కొద్ది దేవాలయాల చరిత్రను మాత్రమే చదివారనుకుంటాను. తమిళనాడు మాత్రమే కాకుండా భారత దేశం ఇంకా చాలా ఉంది. చదవండి , చూడండి.

సరే పోనీ తమిళనాడునే తీసుకుందాము. తమిళనాడు లో అన్ని ఇతర వర్గాలకు బ్రాహ్మణ వర్గాలతో సమానమైన గుర్తింపు ఉన్నదని మీ ఉవాచ. మరి దేశంలోనే అంత అభ్యుదయమైన తమిళనాడు రాష్ట్రంలో, అత్యంత తీవ్రమైన ద్రవిడ ఉద్యమం ఎందుకు జరిగిందంటారు ? బ్రాహ్మణవాద ఆభిజాత్యానికి వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున పోరాటం ఎందుకు జరిగిందంటారు ? దయచేసి తమిళనాడు చరిత్ర అయినా పూర్తిగా చదవగలరు :-)

వీలును బట్టి ఆంధ్ర దేశ, భారత దేశ, ప్రపంచ చరిత్రలు కూడా :-))

చివరగా, నేను విమర్శించేది బ్రాహ్మణ సంస్కృతిని కాదు. ఈ భూమి మీద ఉన్నవేన వేల సంస్కృతులలో అదీ ఒకటి. ఎక్కువా కాదు, తక్కువా కాదు. బ్రాహ్మణులైనా మరి ఇంకెవరైనా కూడా అందరూ అన్నింటా సమానమే. ఎవ్వరికీ కూడా కొమ్ములే౦ లేవు.

కాని ఇతర వర్గాలను తక్కువగా చూసే సంస్కృతిని, తర తరాలుగా జరిగిన అన్యాయాన్ని, అంటరాని వారుగా చూసే ఆభిజాత్యాన్ని, అధికారం చలాయించాలనుకునే దురహంకారాన్ని ఖచ్చితంగా ఖండిస్తాను.