ఆఖరి అవకాశం


లుచబడ్డ నా ప్రతిఙ్ఞ లాగనే
నిలకడ లేని మేఘాలు
మలినపడ్డ నా ప్రవర్తన లాగనే
నీలాకాశాన్ని వీడి పరిగెడుతున్నాయి

కాలం మృత జీవితాన్ని తలచి పలవరిస్తే
గాలి ముభావంగానే పలకరిస్తుంది
మన స్నేహం గత ఙ్ఞాపకంతో పరితపిస్తే
నా మనసు మాత్రం..
పైశాచికంగా పరవశిస్తోంది

నీటిలోని నా ప్రతిబింబం ఒక్కటే...
నన్ను చూసి అసహ్యించుకోక,
రప్పో వేయించుకుని
అలల తరంగాలలో
నా గతాన్ని చూపింది

నిజం! ఎంత మధురం నా గతం
పట్టిందల్లా బంగారం
ఎందుకంటే... అత్మస్ధైర్యం

నేడు మాత్రం నా వ్యసనాలు
కర్ణుని చావుకి కారణాల్లా
నా పతనానికి తలుపులు తెరిచాయి

సందేహం లేదు
సైతానేదో ఆవహించింది
కనుకనే కనుల చుట్టూ
స్వార్ధం ఆవరించింది

క్షణక్షణానికి ఒక చేతగా
రోజురోజుకీ ఒక రీతిలో
రంగు మార్చుతున్న నేను..

కోల్పోయినదేమిటో
ఇప్పటికి..., ఇప్పటికి తెలుసుకుని
కుమిలిపోతున్నా!

జారవిడిచిన జీవితాన్ని
తిరిగిపుచ్చుకునే ప్రయత్నంలో
చివరి అవకాశానికై అభ్యర్ధన!

పరివర్తనతో పశ్చాత్తాప పడినా
ఎలాంటివాణ్ణి ఇలా మారానేమంటూ
కళ్ళు చెమ్మగిల్లినా
నన్ను నమ్మవు కదూ..?

నే శ్వాస విడిచేలోపు
నీ విశ్వాసాన్ని పొందగలనా...?

4 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

కవిత బాగుంది బృహస్పతి గారూ.

బృహఃస్పతి said...

వైద్యభూషణ్ గారూ, ధన్యవాదాలు. వికాసానికి స్వాగతం

sreenika said...

కవిత చాలా బాగుంది..బృహ:స్ఫతి గారు
పతనావస్థ నుండి పచ్ఛాత్తాపంలోకి..కవితలో చాలా డెప్త్ ఉంది.
జార విడిచిన....
లైన్లు చాలా బాగున్నాయి.

బృహఃస్పతి said...

శ్రీనిక గారికి, ధన్యవాదాలు. మీ కామెంట్ కూడా అంతే కవితాత్మకంగా ఉంది.