శిల - పరిచయం

పని వత్తిళ్ళ వల్ల మరి కొన్ని రోజులు బ్లాగలేనేమో... అందాక వికాసాన్ని మర్చిపోకుండా ఇది వరకు రాసుంచుకున్న ఈ కధను దారావాహికంగా అందిస్తున్నాను. అసలే ఈ సెప్టెంబర్ మాసం సీరియల్ మాసమని చాలా మంది బ్లాగర్లు ఇప్పటికే నిరూపించారాయె :) పది రోజుల పాటుగా ధారావాహికంగా సాగే ఈ కధ పరిచయం ఈ రోజు...



ది ఒక విచిత్రమైన ప్రేమ కధ. సంభాషణలతో అవసరం లేకుండా పూర్తిగా వచనం, వర్ణనలతోనే సాగే వినూత్న ప్రయోగం. రకంగా మూగ గాధ. కధావస్తువు కూడా ప్రస్తుత సమాజంతో అన్వయించుకునేందుకు వీలుపడదు. నా ఇదివరకటి కధల్లానే బాహ్య ప్రపంచంతో నిర్నిమిత్తంగా - కేవలం ప్రేమ తీవ్రతను చర్చించుకునేందుకు అల్లబడిన ఒక కాల్పనిక సాధనం. కనుకనే పాత్రల మనస్తత్వాలను అవగతం చేసుకునేందుకు కధాగమనంలో రచయిత రంగప్రవేశం అనివార్యం. వీటన్నిటినీ దృష్టిలో నిలుపుకుని చదివితే 'శిల' ఒక అందమైన కలగా మిగులుతుంది. లేదంటే విసుగు పుట్టిస్తుంది.

పది రోజుల పాటుగా ధారావాహికంగా సాగే 'శిల'ని పరికించండి. పరిశీలించండి...

2 comments:

కొత్త పాళీ said...

Interesting. Looking forward to it.

బృహఃస్పతి said...

కొత్తపాళీ గారికి స్వాగతం. మీ ఆసక్తిని నిలబెట్టేందుకు కష్టపడతాను. పదో రోజు మాత్రం మీ కామెంటు కోసం ఎదురుచూస్తాను. :)