అమ్మ


నేన్నిద్దట్లో ఉన్నాను నువ్వు లాలించినప్పుడు...
నీ గుండెలపై పరున్న సంగతి గ్రహించలేదు.
మేల్కొన్నాకైనా కృతజ్ఞతలు చెప్పలేదు నీకు!

నే నాకలి గైకొని ఉన్నాను నువ్వు వడ్డించినప్పుడు...
నీ ప్రేమని పంచి ఇస్తున్నట్లు తెలుసుకోలేదు.
పూర్తయినాకయినా అడగలేదు నువ్వు తిన్నావో లేదో అని!

నేనెంతో గర్వపడ్డాను నువ్వు ముద్దించినప్పుడు...
నీ ముద్దు పొందటం నా అదృష్టమని తట్టలేదు.
అరచేత్తో నీ ముద్దుని తుడిచి మనసారా ముద్దివ్వలేదు నీకు!

నేడు హంస తూలికా తల్పం ఉంది.
జో కొట్టేందుకు చల్లని గాలులున్నాయి.
మైమరపించే సంగీతం ఉంది.
నువ్వు లేవు... నిద్ర పట్టటంలేదు!

పంచభక్ష్య పరమన్నాలున్నాయి.
మత్తెక్కించే మధుపానీయాలున్నాయి.
వడ్డించే సేవకులున్నారు.
నువ్వు లేవు... ఆకలి లేదు.

అభిమానం కురిపించే అత్మీయులున్నారు.
తోడుగ నిలిచే స్నేహితులున్నారు.
కంటికి రెప్పలా చూసుకునే వారెందరో ఉన్నారు.
నువ్వు లేవు... మనశ్శాంతి లేదు.

6 comments:

Okkanimisham said...

Chala Baga rasaru andi.......
Soooo Nice...

సుజాత వేల్పూరి said...

చాలా చాలా బావుంది. అమ్మ లేకపోవడం అనే విషయం తల్చుకుని ఒక్క క్షణం భయమేసింది. ఎంతమంది ఉన్నా, అమ్మ లేకపోతే అనాధలమే!

బృహఃస్పతి said...

ఒక్క నిముషం(?) మరియు సుజాత గారికి,

ధన్యవాదాలు.

cartheek said...

bruhaspathi gaaru mundugaa Dnaalu Dannalu...........

chala baga cheparu amma goppatanam

prapanchamantha mana venakunna amma lekapote aa baada cheppanalavi kaanidi....

great sir....

బృహఃస్పతి said...

కార్తీక్ గారూ, ధన్యవాదాలు. అమ్మ విలువ వర్ణించలేనిది. అందుకే 'అమ్మ' పై ఏ కవితైనా అందంగానే ఉంటుంది.

madhavarao.pabbaraju said...

శ్రీ బృహస్పతి గారికి, నమస్కారములు.

చాలా కాలంగా మీనుంచి ఎటువంటి కవితలు రావటం లేదు. ఎందుకని? కొత్త కవితలు మీ నుంచి రావాలని ఆశిస్తూ
మీ స్నేహశీలి,
మాధవరావు.