నీవు నివసించే చోటు


న్నాళ్ళూ నువ్వెక్కడ
ఉన్నావో తెలియక
ఇక్కట్లు పడ్డాను

ఆలయాల్లో నీ
ఆనవాలు దొరకలేదు
ఎంత అన్వేషించినా
నీ ఆచూకీ లేదు

చివరకు అందరూ అనుకున్నట్లే...
నీవు అందరిలోనూ,
అన్నింటా ఉంటావనుకున్నాను.

అందుకే, నిన్ను...
ఈడొచ్చిన ఆడపిల్లలో వెతికాను
తోడుగా వెన్నంటే స్నేహితునిలో వెతికాను

నా తల్లితండ్రులలో వెదికాను
తోబుట్టువులో వెదికాను
ముష్టివానిలో వెదికాను
మృగంలో వెదికాను

నాకు నచ్చిన ఓ నాయకునిలో వెతికాను
నా గదిలో తిరుగాడు వాంఛలలో వెతికాను
అసహాయుడు కార్చే కన్నీటిలో వెతికాను
నా కనుల ముందర పడ్డ అన్నింటిలో వెతికాను

అంతెందుకు? నువ్వు
నా హృదయంలో
ఉన్నావనుకున్నాను

కానీ ఇప్పుడు తెలిసింది.
నీవు నేనెప్పుడూ కన్నెత్తైనా చూడని
మా పూజ మందిరంలో ఉన్నావని

నీవు మా ఎవ్వరిలోనూ లేవు.
ఎవరి అవకాశం వారిది
వీలు చిక్కినప్పుడల్లా
నిన్ను మా హృదయంలో
సులువుగా గెలువగలము
సునాయాసంగా అణచివేయగలము

మలిన పడ్డ మా మనసుల్లో
నీకు చోటిచ్చేంతటి జాగా లేదు
మురికి నీరు ప్రవహించే మా గుండెల్లో
నీవు మంచి నీరు పంపినా, అది
కలుషితమవుతుంది తప్పితే, మా
మురికిని మరల్చలేదు

ఈ గుండెల్ని పిండి
ప్రాణాల్ని హరించటమొక్కటే
పరిష్కార మార్గం

ఇది సత్యం
ఇది నిత్యం
ఇది తధ్యం

ఇది ప్రకృతి ధర్మం

7 comments:

sunita said...

ఊహూ!! ప్రతీసారీ బాగుంది అని చెప్పను.చక్కటి భావన.

కలి said...

ఆయనకు బూర్జువా భావాలు ఎక్కువ. ధనవంతుల ఇంటికే పరిమితం. జై మ్యావ్

hanu said...

baagumdi, nice ine

చిలమకూరు విజయమోహన్ said...

మా పూజ మందిరంలో ఉన్నావని
ఇంత అద్భుతమైన పూజగది ఉంటే మరి అక్కడ ఉండక మరెక్కడుంటాడు

జయ said...

బాగుందండీ, చాలా చక్కటి భావం. అన్నింటికీ మరణమొక్కటేనా పరిష్కారం.

durgeswara said...

ఈ ఆవేదనలోంచి వెలుగులు విరజిమ్ముతూ ప్రత్యక్షమవుతుంది మనమానసమందిరం లో ఆయన దివ్యధామం .ఇంకా మథనం జరగనీయండి .

బృహఃస్పతి said...

@సునీత, హను, కలి, విజయమోహన్ గారూ, ధన్యవాదాలండీ...

జయ గారూ, అన్నింటికీ మరణం పరిష్కారమని నేనెలా అంటాను? కేవలం దైవానుభూతికి మాత్రమే మరణం పరిష్కారమన్నాను. :)

దుర్గేశ్వర గారూ, మధనం నిత్యం జరుగుతూనే ఉందండీ. మన మానసంలో దేవునికి స్థానం కల్పించాలంటే దానిని శుభ్రం చేసి ఇవ్వాలి గా భగవంతునికి. ఈ కృయే అన్నింటికన్నా కష్టమైనది. అపరిశుభ్రమైన చోట మనమే ఉండటనానికి ఇష్టపడం. భగవంతునికెలా ఇవ్వగలం?