జయించా


నేడు నా కళ్ళు శ్వాసిస్తున్నాయి
ఉఛ్ఛ్వాస
నిశ్వాసలను
చక్షువులే
శాసిస్తున్నాయి

కైలాసమంత ఎత్తులో
నన్ను
- నేను
కనుగొన్న
ఆనందం
కనులలో
ప్రతిఫలిస్తోంది.

నా కాళ్ళు నేల నానట్లా!
నింగిన
విహరిస్తున్నాయి

విశ్వవిజేతనైనంత

సంతోషంగా

రక్తం
కొత్త ఉత్తేజంతో
ఉరకలు
తీస్తోంది

మానవుడి మరుగుజ్జుతనానికి
ఇన్నాళ్ళకి
పెదవులు నవ్వాయ్!

ఎందుకంటే
--
రోజు నే కోర్కెలను జయించాను.

4 comments:

naresh veeramas the ROCK said...

naa nota kudasa ide maata raavaalane naa prayathnam sodara..
neenota vachina e jayinchaanane padam .... repaina maa nota raakaa pothundaa? good...congrats...

బృహఃస్పతి said...

@నరేష్: కవితల్లో రచయిత అనుభవాల్ని వెతక్కండి... :-)

మీకు All the best

'Padmarpita' said...

Congrats....మీరు జయించారు, మరి మేమెప్పుడు జయిస్తామో!

బృహఃస్పతి said...

పద్మార్పిత గారూ,

జయం, అపజయం అన్నవి సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. (ముళ్ళపూడి గారి పెళ్ళిపుస్తకం స్టైల్ లో డైలాగ్స్ ఊహించుకోండి...) ఈ రోజు జయంగా ఫీలయినది కాలక్రమేణా అపజయం అవ్వచ్చు. అవకాశం లేనప్పుడు అపజయాన్ని కూడా జయంగా భావించి తృప్తి పొందవచ్చు.

??? అర్ధం కాలేదు కదా...??? :( రాసినవాడిని నాకే అర్ధం కాలేదు. :(

చెప్పొచ్చేదేమిటంటే, ఒకానొక సందర్భంలో ఒకానొక విధంగా ఫీలయినదే ఆ కవిత. శాశ్వత అనుభవం కాదుకదా...

హన్నన్నా...అందరం మానవమాత్రులమే కదా :)