...మజిలీ కధ - 4

నేను ఆరో తరగతికి వచ్చాను. మధ్యలో మావయ్య ఓ సారి మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అమ్మ చాలా గొడవ చేసింది. ఏదో సంతకం చెయ్యటానికి అమ్మ ఒప్పుకోవటం లేదని మాత్రం అర్ధమయ్యింది.

మావయ్య వెళ్ళిపోయాక నాన్నతో అంది.

"ఎకరాలకు ఎకరాలు స్వాహా చేస్తున్నాడు. ఇది కూడా అమ్మేస్తే అమ్మా, వదినా ఏం తినేది?"


*******

మళ్ళీ సంక్రాంతి దగ్గర పడింది. ఎప్పటిలానే మావయ్య దగ్గర నుండి పిలుపు వచ్చింది అందరినీ రమ్మని.

అయితే నాన్న కొన్ని రోజులు తటపటాయించారు. వెళ్దామా వద్దా అని. నేను అక్కా ఓ పూటంతా ఏడ్చాం. చివరకు తీసుకు పోక తప్పింది కాదు నాన్నకు. పెద్దమ్మ వాళ్ళెవరూ రాలేదు. మేమూ, పిన్ని వాళ్ళూ వచ్చాం. మావయ్యని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

"పొలానికి తీసుకెళ్ళు" గొడవ చేసింది చెల్లి.

"ఇంకెక్కడి పొలం, కాలం చెల్లిపోయింది." అమ్మమ్మ నిష్టూరమాడుతోంది చెంబుతో నీళ్ళు నా కాళ్ళ మీదకి ఒలకబోస్తూ.

మావయ్య అమ్మమ్మ మీద విరుచుకు పడ్డాడు పిల్లల దగ్గర అలా మాట్లాడుతున్నందుకు. మేమంతా బిక్క చచ్చిపోయాం.

"ఇహిహి" అని నవ్వాడు మావైపు చూసి.

"ఏం కధల పుస్తకాలు కావాలో చెప్పండి"

"నాకు రాజులు, మాంత్రికుల కధలు" అక్క అంది.

"నాకు డిటెక్టివ్ కధలు" చిన్నక్కంది.

"నాకు జంతువుల కధలు" నేనన్నాను.

"నాక్కూడా..." చెల్లాయి వంత పాడింది.

మావయ్య అందరి లిస్టూ రాసుకుని వెళ్ళిపోయాడు.

మేమంతా తోటకి పోయాం ఆడుకోవటానికి. తిరిగి వచ్చేసరికి మావయ్య వీధి అరుగు మీద నుంచుని ఎదురింటి ఆడమనిషి వంక చూస్తున్నాడు. ఆ ఇంటావిడ అక్కడే కూర్చుని ఉంది. ఆవిడ చూపు మా అరుగు వైపే ఉంది. మధ్యమధ్యన ముసిముసిగా నవ్వుతూ ఉంది.

నాకా చూపులకి, నవ్వులకి అర్ధం తెలియదు.

"కధల పుస్తకోలూ" అరుచుకుంటూ మావయ్య నడుం చుట్టూ చెయ్యి వేసాను.

రాత్రి భోజనాల ముందు పెద్దాళ్ళ సమావేశం. వీళ్ళకి మరేం పనుండదు. ఎప్పుడూ మావయ్యని తిట్టడమే. మేం పక్క గదిలో పుస్తకాలు పట్టుకున్నా, మా చెవులు అటువైపే ఉన్నాయి.

"వీళ్ళ నాన్న సంపాదించినదంతా తాగుడికి, ఆ ముండకి తగలేస్తున్నాడు" అమ్మమ్మ కొంగు నోటికి అడ్డంగా పెట్టుకునింది.

అమ్మమ్మ ఏడుస్తోంది. అవును నిజంగానే ఏడుస్తోంది. అమ్మమ్మే కాదు అమ్మ, పిన్ని కూడా ఏడుస్తున్నారు. వాణత్త మాత్రం వంటింట్లో నుండి బయటకు రాలేదు.

"పొలం అమ్మిన సొమ్ములో సగం అప్పులు తీర్చేం. మిగిలిందంతా కాజేసి ఆ దొంగ లం..కి పెట్టేడు." అమ్మమ్మ వీధి వంక చేయి ఊపుతూ ఏడుస్తోంది.

"మనం దొంగాట ఆడుకుందాం" అన్నాన్నేను.

చెల్లి సరేనంది.

అక్క ఆడలేదు. పైగా తిట్టింది. వాణత్త మమ్మల్ని తీసుకుపోయి నాకు చెల్లికి ముద్దలు చేసి తినిపించింది.

మరుసటి రోజు భోగి.


**********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...

11 comments:

చైతన్య.ఎస్ said...

హ్మ్మ్ తరువాత ఎప్పుడు సోమవారమేనా ???

బృహఃస్పతి said...

హయ్యో!

చైతన్య గారూ, అందాక ఆగనక్కరలేదండీ. రేపే మిహతా కధ. నా సీరియల్స్ కి వీక్ ఎండ్ ఎక్సెప్షన్స్ ఉండవు. :)

పది రోజుల కంటే ఎక్కువ సాగవు.

Rajasekharuni Vijay Sharma said...

బాగుంది బాగా రాస్తున్నారు. ఇంతకీ ఇది నిజంగా జరిగిందా..? లేక మీ కల్పితమా...? కల్పితమైతే మీకు 100 కి 200 మార్కులు :)

Ruth said...

waiting.....

sunita said...

ప్చ్....ఇలా ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళను నేను కూడా ఎరుగుదును. తరువాత...?

Sravya V said...

Your narration is very good !

బృహఃస్పతి said...

శర్మ గారూ, నే చూసిన కొన్ని సంఘటనలనే కాస్త కల్పించి, దగ్గరగా చూపించే ప్రయత్నంలో చుట్టరికాన్ని కలుపుకుని రాసినదండీ. మజిలీ కధల పేరుతో భవిష్యత్తులో కూడా ఎన్నో విషాద జీవితాలని ఆవిష్కరించే ఆలోచన ఉంది.

సునీత గారూ, ఇదింకా మొదలే కనుక ఆస్థుల ప్రస్తావన చేస్తున్నాను. నా అంతిమ లక్ష్యం కోల్పోతున్న జీవితాలని విశ్లేషించటమే!

రూత్ & శ్రావ్య గారూ, టాంకూ అండీ...

ఈ కధ ఏమంత కొత్తది కాకపోయినా, మీరన్నట్లు నెరేషన్ లోనే వైవిధ్యాన్ని చూపించటానికి ప్రయత్నిస్తున్నాను.

Sravya V said...

అయ్యో మీ నేరషన్ బాగుంది అంటే కథ పాతతి అని కాదండి, ఇది చదువుతుంటే అయ్యో అనిపించింది , బాగుంది అని వ్రాయలేక అన్నమాట .
సునీత గారు చెప్పినట్లు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇలాంటి వినేవాళ్ళం కాని ఆ వయస్సు లో ఏమి తెలియదు కదా, పైగా ఎక్కువ తక్కవ ప్రశ్నలు వేస్తె వీపులు చిట్లిపోయేవి :) .

బృహఃస్పతి said...

శ్రావ్యగారూ, కధ ఏమంత కొత్తది కాదన్న విషయం నేను చేసుకున్న కన్ఫెషన్. :) మీరా ఉద్దేశ్యంతో వ్యాఖ్యానించారన్న స్పృహే నాకు లేదండి.

'మీరన్నట్లుగా నెరేషన్లో వైవిధ్యాన్ని చూపించా'నన్నాను గానీ, 'మీరన్నట్లుగా కధ ఏమంత కొత్తది కాకపోయినా...' అనలేదు కదండీ :(

నా కామెంట్లతో నేను భలే కన్ఫ్యూజ్ చేస్తాను కదండీ... :)

భావన said...

మజిలి కధ -- 4
అమ్మయ్య ఐపోయింది ఆఖరిది కూడా చదివేను అబ్బే లాభం లేదు మరి ఇంత తక్కువా కాస్త ఎక్కువ రాయాలి లాభం లేదు...
బాగా రాసేవు అబ్బాయి. ఏంటో ఒక్క సారి కొంచం గా గుండె బరువెక్కినట్లు వుంది.. అంటే 10 ఏళ్ళ పిల్లవాడి గా కధ చెపుతున్నావు కాబట్టి ఇంకా ఎవ్వరి మనసుల లోని భావాలతో సంభందం లేకుండా విషయాలు మాత్రం చెపుతున్నా ఆ క్షణాన అందరి భావాలు ఆలోచిస్తే బాధ గా వుంది. హ్మ్మ్మ్ నెక్స్ట్....
"నా కామెంట్లతో నేను భలే కన్ఫ్యూజ్ చేస్తాను కదండీ... :)" ;-) కనిపెట్టేసేవే... (వూరికే లే బాధ పడకండి) :-)

బృహఃస్పతి said...

భావన గారూ, అన్నానంటే అన్నానంటారు గానండీ, వరుసగా 4 భాగాలు ఒక్కసారి చదివిన మీరు కూడా "అబ్బే లాభం లేదు మరి ఇంత తక్కువా కాస్త ఎక్కువ రాయాలి" అనడంలో అర్ధమేంటండీ... :(

మేం కోడింగైనా కధలైనా లైన్లలోనే కొలుస్తాం. కాలాలంటే లెక్కెట్టుకోండి. 32 లిన్లుంటాయ్ ప్రతీ భాగంలో... :)

ఎస్టిమేషన్ కన్నా ఎక్కువ/తక్కువ పని చేస్టే బోల్డు ప్రోబ్లమ్స్ అండీ...