కలలకు ముళ్ళుంటాయ్

గ్గుమన్న
నిజం నిప్పు మీద
నా కలల గులాబీ
బుగ్గైపోయింది

బుగ్గై మిగిలిన
కలల కట్టె అంచున
మదమెక్కి పొంచిన
ఆ కలల బలహీనతల
ముల్లు శూలం మాత్రం ...
మరింత పదునెక్కి
అదను చూసి తిరగబడేందుకు
ఎదురు చూస్తోంది

నా ఈ ఓటమికి ఎవరిని నిందించను?
నిప్పునా?
నే చేసిన తప్పునా?
నిజాన్నా?
నా నైజాన్నా?

14 comments:

Padmarpita said...

చాలా బాగుందండి!

బృహఃస్పతి said...

టాంకూ అండీ... :)

భావన said...

బలహీనతల ఇనుప ముల్లు ను విరిచేసి మాడ్చి మసి చేసే శక్తి నిజానికి కాదు ఆ నిజాల నిప్పులో కాలిన కలల గులాబి ల ధూళి తో రేగిన ఆలోచన ల దుమారం నుంచి. ఎప్పటికి వస్తుందో.. అది మాత్రం తెలియదు కదా మనకు.. :-( అందాక ఎవ్వరిని నిందించకండి, నిందించిన మరుక్షణం ముల్లు కసుక్కున దిగి బాధ పెడుతుంది మరి
చాలా బాగుంది ఆ పిక్చర్ తో అలా గుండె ను పేపర్ నైఫ్ తో నొప్పిలేకుండా కోసేరు కదా..

Bhãskar Rãmarãju said...

నిన్ను!!

బృహఃస్పతి said...

నిందించిన మరుక్షణం ముల్లు కసుక్కున దిగి బాధ పెడుతుంది

చాలా కరెక్ట్ గా చెప్పారండీ...

ఆ పిక్చర్ తో అలా గుండె ను పేపర్ నైఫ్ తో నొప్పిలేకుండా కోసేరు కదా..

మీరింకా బెటరండీ, నాకైతే నొప్పి కూడా తెలిసింది. మీకు తెలుసా? ప్రేమదేశం సినిమా మొదట్లో గులాబీపై బైక్ నడిపే సీన్ వచ్చేటప్పుడు నే ముఖం తిప్పేస్తా.

భాస్కర్ గారూ, రెండక్షరాలతో నా కవితని కామెడీ చేసేస్తారా? నేనొప్పుకోను

నేస్తం said...

భాస్కర్ గారూ :D
బృహఃస్పతి గారూ చాలా బాగుందండి

బృహఃస్పతి said...

@నేస్తం: థాంక్స్ అండీ...

sunita said...

చాలా చాలా భాగుంది!

బృహఃస్పతి said...

సునీత గారూ, టాంకూ అండీ! మరో వారం పాటు కొంచెం బిజీ అందుకే ఈ కవితల వెల్లువ. వచ్చే వారంతం నాటికి మరో సీరియల్ మొదలు పెట్టే యోచన ఉంది.

కలి said...

మీ ఈ ఓటమికి పెట్టుబడిదారి వర్గాల కుట్ర ఉంది. తిరగబడండి. తిరగబడితే కానీ భూస్వామ్య వర్గాల దాడులు అడ్డుకోలెం

బృహఃస్పతి said...

కలి గారూ, బ్లాగ్లోకంలో మిమ్మల్నిదే చూడటం. మీ పేరు నవీన్ శర్మ కాదుకదా...

ఏమనుకోమాకండేం... మీ కామెంట్ చూసి అలా అనిపించింది. :)

Anonymous said...

ప్రవీణ్ శర్మ కు నవీన్ శర్మ అనే బ్రదర్ కూడా ఉన్నాడా (ప్రస్తుతం మనకు తెలిసిన బ్రదర్ల తో పాటు? :)

బృహఃస్పతి said...

అంటే కలి నవీనంగా వచ్చారు కదా, అందుకే నవీన్ శర్మా? అని అడిగా... కామెంట్ కూడా ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకుపోతేనూ... :)

(అయినా నాకు తెలిసులెండి... నా శ్రేయోభిలాషే కలి పేరుతో సరదాగా కామెంటారని)

కలి said...

>>ఎక్కడి నుండి ఎక్కడికో ...

సంప్రదాయాలు ముసుగులో మగ్గి మసి అయిపోతున్న ప్రజలను అభ్యుదయం వైపు నడిపించటానికి.. అవతరించిన అవతారమే ఈ కలి .. కలి .. కలి .. కలి