ఇన్నాళ్ళకు నేల మీదకు దిగి రాస్తున్న కధ ఇది. కాల్పనిక జగత్తుని పక్కన పెట్టి రాస్తున్న మొట్టమొదటి సాంఘిక కధ. మరి నేనీ సాంఘిక కధా వస్తువులను వ్యక్తీకరించేందుకు పనికి వస్తానా??
స్నేహితులందరితో కలసి అలా ఒక విహారయాత్రకు వెళ్ళిరావటం ఎంతో మధురానుభూతిని మిగులుస్తుంది. చదువుతున్నది P.G. చివరి సంవత్సరం అని కాబోలు, అమ్మాయిలు కూడా అడిగిందే తడవుగా ఒప్పుకున్నారు అరకు రావటానికి. అప్పటికే నాగార్జునసాగర్ అందరం చూసి ఉండటం మూలాన ఈ ట్రిప్పు అరకు వేసాం. ఇందులో నా బలవంతం కూడా ఉంది. అక్కడకు దగ్గర్లోనే మా అమ్మమ్మవాళ్ళ ఊరు. ఆ ప్రాంతం అంతా నా సహచరులకి చూపించాలన్న ఉబలాటం. అరకు వెళ్ళాలంటే మా ఊరు దాటుకునిపోవాల్సిందే. ఒక వ్యాను, ఒక కారులో బయలుదేరాం. ఇంకా ఘాట్ రోడ్డు దాకా చేరుకోలేదు. దారి పొడవునా ఊళ్ళున్నాయి. నిజానికి మేం వేసుకున్న ప్రణాళికలో మా ఊళ్ళో ఆగే కార్యక్రమం లేదు. అయితే ఆశ్చర్యకరంగా మా ఊరి మీదుగా వెళుతుంటే కారు చెడిపోయింది.
జనాలందరం రోడ్డు మీదకి దిగాం.
"ఇదే మా ఊరు" నా ముఖం విప్పారింది.
"మరో గంట పట్టేట్టుంది" అయిదు నిముషాలు ఇంజన్ చెక్ చేసి అన్నాడు రవి. ఆ కారు వాడిదే. ఈ ట్రిప్పుకి తాత్కాలికలీడర్, ఆర్గనైజర్ అన్నీ వాడే.
" ఏం చేద్దాం?" అసహనంగా అంది ఉమ.
శంకర్ చేతిలోని రాళ్ళు తీసుకుని ప్రక్కనున్న కాలువలోనికి విసురుతున్నాడు.
"మరేం ఫరవాలేదు. మీరంతా వెళ్ళి గెస్ట్ హౌస్ తీసుకోండి. మేం బాగుచేసుకుని వస్తాం." రవి అన్నాడు.
కాసేపు తర్జనభర్జనలు జరిగాయి.
చివరకు ఒక వ్యానులో ఉమ, సూర్యం, వంశీ, శంకర్ ... మొదలైన వాళ్ళంతా వెళ్ళిపోగా నేను, రవి, విజయ్, రెడ్డి, చంద్ర, హేమ మిగిలాం.
"మా ఊరు చూద్దాం పదండి" అందరికీ కలిపి అడిగాను.
"ఏముందేమిటి మీ ఊళ్ళో చూట్టానికి?" విజయ్ అడిగాడు.
"మా మావయ్య ఇల్లు" కళ్ళు చిట్లించి చెప్పాను.
"చాలా పెద్దది. ఒక వీధి పొడవుంటుంది" చెప్పాను. ఆ చెప్పటంలో గర్వం లేదు.
"ఇక్కడ చేసేదేముంది? వెళ్దాం పద" చంద్ర ముందుకు కదిలింది.
"ఎంత దూరం?" మరో ప్రశ్న
"నన్ను ఒక్కడ్నీ వదిలేస్తారా?" పై ప్రశ్నకు సమాధానం రాక ముందే రవి ఏడుపు అభినయించాడు.
మొత్తానికి విజయ్ ని వాడికి తోడుగా ఉంచి కదిలాం. దారి పొడవునా నా చిన్ననాటి జ్ఞాపకాలు తోడు వచ్చాయి.
"ఇప్పుడు ఎవరూ లేరా ఆ ఇంట్లో..." చంద్ర అడిగింది.
"ఉహూ!!"
"మావయ్య వెళ్ళిపోయాక అమ్మమ్మ ఒక్కతే ఉండేది కానీ నెల్లాళ్ళకే పోయింది దిగులుతో"
"మీ మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు?" హేమ ప్రశ్నించింది.
సహజంగా ఆడవాళ్ళకి ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ.
"మీరు బోర్ ఫీలవ్వనంటే చెప్తా" అన్నాన్నేను.
"తను అడిగింది ఒకే ప్రశ్న. చాటభారతం చెప్పనక్కరలేదు." రెడ్డి వ్యంగ్యంగా అన్నాడు.
అంతే ఒక్కసారి వాడి వీపుమీద అంతా తలా ఓ చేయి చరిచారు.
"నువ్వు చెప్పు వినాలనుంది" చంద్ర అంది.
ఆమె కళ్ళల్లో చూస్తూ చిన్నగా నవ్వాను.
"చెప్పరా సరదాగా అన్నాను. నాకూ వినాలని ఉంది." రెడ్డి కాళ్ళ బేరానికి వచ్చాడు.
"సరే వినండి"
మీరే చెప్పాలి. :-)

*********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...
6 comments:
మరీ అంత కొంచమా . అన్యాయం. నేను ఖండిస్తున్నా. కాస్త ఎక్కువ రాయవచ్చు కదా...
:( భావన గారూ, సారీ అండీ... రేపు తెల్లారే తరువాయి భాగం పెట్టేస్తా... ఉపోద్ఘాతంలా ఉంటుందని సరిగ్గా అక్కడ ఆపా... అసలు కధ రేపే మొదలయ్యేది.
గుడ్ బిగినంగ్.భావన గారి మాటే నామాట.
పైంటింగ్ చాలా బాగుంది, బిగినింగ్ బాగుంది.
సప్సెన్స్ అన్నమాట(సస్పెన్స్ కాదు).
శ్రీనిక, విజయమోహన్ గారూ, ధన్యవాదాలు.
సునీత గారూ, పైంటింగ్ తో పాటూ కధ కూడా చాలా బాగుంది అనిపించేందుకు కృషి చేస్తానండి... :)
Post a Comment